3 April (03.04.) (94)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

అందరినీ ప్రేమగా చూడాలి అంటే ఎదుటి వారిలోని దోషాలు, తప్పులు మనం ఎత్తి చూపకుండా వారిలోని మంచిని గమనిస్తే అతనిలో భగవంతుని చూడగలుగుతాము.
To see all with love means instead of pointing others faults and mistakes, see the good in them, then we can see God in them. (3 Apr)



94) ధర్మ స్వరూప ద్వారకామాయివాసా

ధర్మ స్వరూప ద్వారకామాయివాసా

దయరాదా నీ దరిశన మీయగ

దయ రాదా నాతో ప్రేమగ పలుకగ ॥ధర్మ॥


బ్రోచితివి గద ఎందరెందరినో

నీ దగు దివ్య దరిశన మొసగి

గాచితివి కదా భక్తులెందరినో

వీనుల విందుగ ప్రేమగ పలికి ॥ధర్మ॥


ఏ రీతిగ నిను ధ్యానము చేసిన

కనుల కగపడి కరుణించెదవూ

ఏ విధముగా నిను పిలచిన నాతో

ప్రేమగ పలికి మొరలాలింతువు ॥ధర్మ॥


నీ చరణములే శరణంబని మది

నమ్మిన దీనుడ శ్యామచరణుడను

కనికరముంచి కరుణను జూపి

దరిశన మొసగీ ప్రేమగ బలుకుము ॥ధర్మ॥


అభయ ప్రదాత ఆశ్రిత రక్షక

కరుణాసింధొ కామిత దాయక

ప్రేమ స్వరూపా భవభయ నాశక

సద్గురు దేవా శ్యామ సన్నుత ॥ధర్మ ॥




Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)