16 April (16.04.) (107)
శ్రీ శారదా శ్యామ సందేశం:
ధ్యానం చేసేటప్పుడు మన లోపల
నాభి నుండి పెద్ద ధ్వనితో హోరుగా నామం వస్తున్నట్లు, అది మన చెవులలో నుండి
కూడా వస్తున్నట్లు భావించుకోవాలి.
While
meditating, we should feel that the name is coming out loudly from our
navel, and it is also coming from our ears. (16 Apr)
107) దయను జూపుమా సాయీ
దయను జూపుమా సాయీ - నీ దరిశన మొసగుము సాయీ
కనికరించుమా సాయీ - నను కరుణతో గనుమా సాయీ //దయ //
1. నమ్మితి నిన్నే సాయీ - నను వీడకు నెప్పుడు సాయీ
దిక్కువు నీవే సాయీ- నా దిగులు తొలగించు సాయీ
2 . అభ్యర్థించెద సాయీ- నాక భయమొసంగుము సాయీ
ఆరాధించెద సాయీ- నా ఆర్తిని బాపుము సాయీ
3. చింతన జేతును సాయీ- నా చిక్కుల దీర్పవే సాయీ
సతతము దలతును సాయీ - సద్భక్తిని నొసగవే సాయీ
4 . పదముల బట్టితి సాయీ - వరము నీయవే సాయీ
శ్యామ దేవుని సాయీ - సద్గతి నొసగవే సాయీ // దయ //
Comments
Post a Comment