1 April (01.04.) (92)
శ్రీ శారదా శ్యామ సందేశం:
అనవసరమగు ఆందోళనలతో, ఆలోచనలతో
మానవులు సహజముగా అంతరంగాన్ని కలుషితమొనర్చుకుంటారు. అవసరమేదో - అనవసరమేదో,
సబబేదో- బేసబబేదో బేరీజు వేసుకుంటూ - తన పాత్ర ఏమిటో చూసుకుంటూ నడవడంతో -
సహజంగా అనేక ఆలోచనలు అంతమౌతాయి.
With unnecessary
worries and thoughts, humans naturally contaminate the inner intimacy.
Assess whether it is necessary or unnecessary, right or wrong. As one
walks by looking at role, naturally many thoughts will end. (1 Apr)
92) జయ జయ జయ సాయీ
జయ జయ జయ సాయీ -
జయ జయ జయహో సాయీ -
ఏమని బొగడుదు నీ కరుణను
నే నేమని బొగుడుదు నీ లీలలనూ ॥జయ॥
ఒక పరి బాధల కలిగింతువు
నింకొకపరి ఓదార్పుల నందింతువు
ఒకపరి మనసును ఖేదింతువు
నింకొక పరి నేకాగ్రత నందింతువు ॥జయ॥
ఒకపరి అరిషడ్వర్గము లందు ద్రోసి
ఆ క్షణమే నేర్పుగా మము బ్రోచెదవు
ఒకపరి చిక్కుల గల్పించుచూ
చిత్రముగా విడదీసేదవూ ॥జయ॥
సుక, శౌనక, ప్రహల్లాద ,నారద,
వశిష్ట, కౌసిక , భరద్వాజలే
నీ లీలలను తెలియజాలరు
అల్పగ్నుడను నాకేమీ తెలియను ॥జయ॥
Comments
Post a Comment