7 April (07.04.) (98)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

ఏకాగ్రత పరిపక్వతకు, పరిపక్వత స్థైర్యానికీ, స్థైర్యము విజయానికి, విజయం ఆనందమునకు అనుసంధానములు.
Concentration for Maturity, Maturity for Stability, Stability for Success, Success for Happiness are the interlinks. (7 Apr)


98) శ్రీ సాయినాథా…..  శ్రీనివాసా…

శ్రీ సాయినాథా…..  శ్రీనివాసా….. చింత బాపగ రారా

నీ సేవ చేసే మా మనవి నీకు వినబడలేదా ॥ శ్రీ సాయి॥


ఆయువేమె తక్కువై….. ఆశలేమె ఎక్కువై…. 

అసలైన దారులు వదిలి అలమటించి పోతున్నాము

నీవు గాక దిక్కెవరయ్యా నిన్ను కొలుచు బాలల మయ్యా

మంచిని దెలిపీ మాయల దులిపి

మము దయ గనగా రావా…. వేగమే రావా… ॥శ్రీసాయి॥


నీ పదముల నమ్మినాము…. 

నీ భజనే చేసినాము…. 

మాకు నీవే దిక్కువని మనసారాగ వేడినాము 

మాదు మొరలు వినగా లేవా ----

మమ్ముల గాన జాలియే రాదా….. 

అఖిలలోక నాయక నీవే… అలిగిన ఇక గతి ఏమి మా స్థితి ఏమి…. ॥శ్రీ సాయి॥



Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)