6 April (06.04.) (97)
శ్రీ శారదా శ్యామ సందేశం:
విజయం అనేది ప్రకృతిలో ఆకస్మికంగా లభించేది కాదు. అది ఎంతో జాగరూకతతో పొందదగినది.
Success is not something that happens suddenly in nature. It can be obtained with Great Vigilance. (6 Apr)
97) ప్రభో సాయి రామ రారా….
ప్రభో సాయి రామ రారా…. మమ్మదు కోరా….
షిరిడి నివాసా…… శ్రీనివాస…. ॥ప్రభు॥
తల్లివి నీవే, తండ్రివి నీవే ,గురు దైవములు నీవే…..
రాముడ నీవే, కృష్ణుడ నీవే ,దత్త మారుతి నీవే……
శివ నాగ సాయి నీవే ,శ్యామ సాయి నీవే…..
జయహో సాయిశా…. జయహో సాయిశా…. ॥ప్రభో॥
నీవే దిక్కని నిరతము నమ్మి కొలిచే వారము దేవా-----
కరుణను జూపి కడ తేరెడి మార్గములను జూపగా రావా -----
రంగనాథ సాయి నీవే…. రామదాస నీవే…..
జయహో సాయిశా… జయహో సాయిశా…. ॥ప్రభో॥
సుఖ దుఃఖములకు చెదరని మనసును
కరుణ నొసంగుము స్వామి……
సద్భక్తులమై నీ పద సన్నిధి జేరగ చేయుము స్వామి……
మమ్ము దయ గనవే సాయీ…. ద్వారకామాయి…
శ్యామ సన్నుతా…. సాయి మహేశా… ॥ప్రభో॥
Comments
Post a Comment