10 April (10.04.) (101)
శ్రీ శారదా శ్యామ సందేశం:
101) సాయి రాముని భజన జేయండి
సాయి రాముని భజన జేయండి … ఓ భక్తులారా
సాయి నామామృతము గ్రోలండీ
సాయి రాముని భజన చేయుచు
సాయి నామామృతము గ్రోలుచు
సాయి సాయీ యని సతతంబు
సంతస మందు మునగగ ॥ సాయి॥
జన్మలెన్నియో గలవు తెలియండి
ఆ జన్మలందున మనిషి జన్మమే గొప్పదౌ నండీ
జన్మలెన్నియో గలిగి యున్ననూ
మనిషి జన్మమే గొప్పదనుచును
మరీ మరీ గుర్తించుకొని సద్గురుని పాదము లాశ్రయించుచూ ॥సాయి॥
భక్తిశ్రద్ధలు గలిగియుండండి
వినయంబుగా శ్రీ సద్గురువుల సేవ జేయండి
భక్తి శ్రద్ధలు గలిగియుండి వినయముగ
సద్గురుని సేవలు చేయుచుండెడి వారే
ధన్యులు, పుణ్యలు మహితాత్ములనుచును ॥సాయి॥
పేదలకు దానము జేయండి
కడు ఆదరంబున సాధువుల పోషణల జేయండి
పేదలకు దానంబు జేయుచు సాధువుల పోషించు చుండిన
శ్యామదేవుని గాచు సాయియే సద్గతుల నందించగలడని ॥సాయి ॥
Comments
Post a Comment