19 April (19.04.) (110)
శ్రీ శారదా శ్యామ సందేశం:
ఎవరైనా రండి అని
పిలిచినప్పుడు వస్తాను అని చెప్పి వెళ్లకపోతే మాట తప్పిన వారు అవుతాము.
వచ్చేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను అని చెప్పాలి.
When
someone calls to come, by saying will come, and if we didn't go, we
will called as breached ones. So say that I will definitely try to get
there. (19 Apr)
110) దయ గనవే సాయీ మమ్ముల
దయ గనవే సాయీ మమ్ముల
దయ గనవే సాయీ ద్వారకామాయి
దరిశన మీయవే శేష సాయీ //దయ//
1. పరమ ధర్మమును ఇల నెలకొల్పగ
పరమత సహనము పాదు కొలపగ
భక్త జనులకు అభయ మొసంగగ
సాయి దేవునిగ అవతరించితివి //దయ//
2. నిష్టయే మనసును నిలుప గలుగు నని
ఘన సబూరియే నడిపించు ననీ
ప్రేమ స్వరూపమే పరమాత్మ యనీ
దెలుపగ ధరలో అవతరించితివి //దయ//
3. సద్గురు దేవుడే సకల మొసగునని
సద్గుతులను కలిగించ గలడనీ
దెలిపి మానవుల తరింప జేయగ
శ్యామ సన్నుత అవతరించితివి // దయ//
Comments
Post a Comment