2 April (02.04.) (93)
శ్రీ శారదా శ్యామ సందేశం:
93) జారవిడువకురా శ్యామ
ముల్తాన్ రాగం ఆదితాళం చతురస్రం
జారవిడువకురా.... శ్యామ హృదయేశ్వరా.... సాయీ ॥జార॥
జారవిడచిన చేరదీయ గలాడు ఈ భువి లేడురా ॥జర॥
జారవిడవకురా... నన్ను జారవిడవకురా
జారవిడచిన చేరదీయ గలాడు ఈ భువి లేడు లేడురా
లేడు లేడురా... జార విడువకు రా.... రా !సాయి ॥జార॥
నిన్ను నమ్మి నీ కంకితమై నీ ఉపదేశంబుల నుండుట లేదని
సకల విశ్వమున నిన్ను జూచి ప్రేమగా సేవించుట లేదని
సత్య ధర్మ సన్మార్గములందున చరియింపక - నిను దలచుంటినని ॥జార॥
పరదూషణముల పాపపు పనులను ప్రత్యక్షముగనే చేయు చుందునని
కులమత భేదము లెంచుచు అహమున అల్పునిగ
చరియుంచుందునని
సౌఖ్యము లందున నిన్ను మరచి దుఃఖంబులలో నిన్ను దలచు చుంటినని ॥జార॥
భక్తి శక్తి యుక్తాదులు లేకనే భక్తునిగా నటించు చుంటినని
అర్హత యోగ్యత లసలే లేక అధికారంబుల గోరుచుంటినని
ఆడంబరమున ప్రశంసనములతో ప్రతితుడనై - నశించుచుంటినని ॥జార॥
విశ్వ మెల్లడల నిండి యున్నట్టి నీలో నేనొక భాగమే కదా !
నేనను ,నా భావన , ప్రతి చర్య యు నీ వాడించెడి నాటకమే కదా !
సుఖదుఃఖంబుల చింతన లేలనో నీకు నాకు భేదమేలనో ॥జార॥
ఏమి తెలియక అజ్ఞానముతో అవివేకముగా బలుకుచుంటిని
లౌకిక వాసనలందు తగులుకొని మూర్ఖముతో నడయాడు చుంటిని
కోపము చెంది దూరము చేసి దుర్మార్గుడనని ఆవలకు ద్రోసి ॥జార॥
Comments
Post a Comment