18 April (18.04.) (109)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

మనిషికి జంతువుకు మధ్యనున్న ప్రధాన భేదం వాటి ఏకాగ్రతాశక్తి యందలి భేదమే. ఏ కార్య విజయమైనా ఏకాగ్రత యొక్క ఫలితమే.
The main difference between man and animal is the difference in their concentration. The success of any endeavor is the result of concentration. (18 Apr)


109) ద్వారకా మాయీశా దరి జేర్చగా రావా

ద్వారకా మాయీశా దరి జేర్చగా రావా సాయి రామా
నీవు కరుణించ కున్ననూ కాపాడె వారెవరు సాయిరామా

1. నియమ నిష్టల తోడనూ పూజించగా లేను సాయి రామా
మీకు పంచ భక్ష్యంబుల భోజనం బిడలేను సాయిరామా

2. పన్నీటి స్నానము చేయించగా లేను సాయిరామా
పట్టు వస్త్రము లిచ్చి పూజించగా లేను సాయిరామా

3. తాంబూల దక్షిణల నర్పించగా లేను సాయిరామా
హారతుల నొసగి అర్ర్చించగ లేను సాయిరామా

4. సతతంబు నీ నామ స్మరణ జేయగ లేను సాయిరామా
నీ లీలలను గాన మొనరింపగా లేను సాయిరామా

5. ఆర్భాటముగా భజన లేమీ చేయగ లేను సాయిరామా
నీ మహిమలను గూర్చి వర్ణించగా లేను సాయిరామా

6. నీ రూప మెటులుండు ? నీ వేష మెటులుండు ? సాయిరామా
నీ రూప వేషముల దెలియగా లేనయ్యా సాయిరామా

7. నిను నమ్మి పిలచిన పలికెద వని వింటి సాయి రామా
పనిలికి భక్తుల నెల్ల రక్షింతువని వింటి సాయిరామా

8. దెలిసి దెలియక నిన్ను పిలుచుచచూ నుంటి సాయి రామా
నా పిలుపునకు పలికి నన్ను రక్షింపగా రావే సాయి రామా

9. నీ పాలబడిన నన్ను వదలకు మని నిన్ను సాయిరామా
మరి మరీ వేడుచు మ్రొక్కుల నిడుచుంటి సాయి రామా

10 . శ్యామ చరణాదులను కృప జూపి బ్రోవగా సాయిరామా
వేగ అరుదెంచ వేడెద కరుణాంతరంగ శ్రీ సాయి రామా....


Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)