25 April (25.04.) (116)
శ్రీ శారద శ్యామ సందేశం:
మనలో సద్గుణాలు రావడం ఎలా అనే
భావన నిరంతరం చెయ్యాలి. టీవీలో పనికి రాని ప్రోగ్రాములు, చెత్త సినిమాలు,
వార్తాపత్రికలు చూడడం, చదవడం వల్ల చెత్తను అంటే దుర్గుణాలను మరలలోపలికి
వేసుకుంటున్నాము. అందువల్ల వాటికి దూరంగా ఉండాలి. మనం చేసే సాధన అంతా
దుర్గుణాలను పోగొట్టుకోడానికే.
We should always
think about how to get virtues in ourselves. Watching and reading
useless TV shows, crap movies, newspapers, are putting us back into the
bad qualities of garbage. So stay away from them. All the practice we do
is to get rid of bad qualities. (25 Apr)
116) దత్త దిగంబర సాయి దేవా !
దత్త దిగంబర సాయి దేవా !
దీనులను నొకపరి కరుణ తో గనుమా
తెలిసి తెలియక జేసిన దోసములను
దలచి మము వేధించకురా! శోధించకురా ! బాధించకురా ! //దత్త //
1. అమాయకులమై అర్థము దెలియక
అనర్థములను కొని దెచ్చుకొనుచు
ఆవేదనలలో పడి వుంటిమిరా
ఆధారమునే కనజాలమురా //దత్త //
2. లౌకిక వాంఛల వలలో పడితిమి
దురాశ పాల్పడి దూర్తుల మైతిమి
ఇది మా కర్మమొ ! నీ అనుగ్రహమొ !
దెలియక శాంతికి దూరమైతిమి //దత్త //
3 . ప్రేమ స్వరూపము నీవే గాదా
దయా సముద్రుడవు నీవే గాదా
కన్నతల్లి వలె కరుణతో గాచి
శ్యామాదులను చల్లగా నేలుము //దత్త //
Comments
Post a Comment