4 April (04.04.) (95)
శ్రీ శారదా శ్యామ సందేశం:
మామూలు మానవునికి నిద్ర, మరపు ఒక వరం. సాధకునికి అవి శాపం.
For a normal human Sleep and forgetfulness is a boon, and its a curse for a practitioner. (4 Apr)
95) దైవ ప్రార్థన దారి చూపును
దైవ ప్రార్థన దారి చూపును
శాంతి ధైర్యముల నొసగును
తృప్తి ఆనందము లుంచును
దయను బెంచి దరికి జేర్చును ॥దైవ॥
ఒక్క దైవము నాశ్రయించుము
ఒక్క నామమునే జపించుము
రూప నామములు లెన్ని యున్నను
అన్ని ఒకటే యనుచు జేసెడి ॥దైవ॥
దురాలోచన తుడిచి వేయుము
దూషణములను వదలి వేయుము
సహన విశ్వాసముల గలిగి
భక్తి శ్రద్ధల తోడ జేసిడి ॥దైవ॥
ప్రేమ భావము పెంపు జేయుము
పరమ శాంతికి జేరువగుము
శ్యామ సూక్తుల ఆలోచించుచూ
ఆచరించుచు సదా జేసిడి ॥దైవ॥
Comments
Post a Comment