9 April (09.04.) (100)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

మనలోని లక్షణాలను పరీక్షించడానికి ఇతరుల రూపంలో ఆ పరమాత్మ వచ్చి వివిధ రకాలుగా అంటే కోపం, విసుగు లాంటివి మాట్లాడి మనలను ప్రేరేపిస్తారు. అప్పుడు మనలను మనం పరిశీలించుకోని ఆ లక్షణాలు పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి.
To test our qualities, God comes in the form of others and speaks in various ways like anger and frustration to stimulate us. Then we should examine ourselves and try to get rid of those qualities. (9 Apr)



100) సాయినాథా…..  చేరరారా……

సాయినాథా…..  చేరరారా…… 

నీదు బాలల మయ్యా……

మము చేరదీసే భారమంతా 

నీది కాదా బాబా ॥శ్రీ సాయి॥


గోదావరి తీరములో…. 

శ్రీ షిరిడీ క్షేత్రములో

నీ భక్తుల సేవలలో 

కొలువుదీరి ఉన్నావు 

 

నమ్మిన వారిని నడిపించి, 

నిను గొలిచెడి వారల కరుణించి

మహిమల జూపుచు మాయల జూపుచు

భక్తుల బ్రోచుచు నవ్వుచుంటివా…. ॥శ్రీ సాయి॥


నిన్ను చూడగ కొలచినాము, 

మది నిండుగ తలచినాము

తల్లైనా తండ్రైనా నీవనియే పిలిచినాము

మాపై కరుణె రాలేదా! 

మము బ్రోవగ మమతే రాలేదా !

నీ పద సన్నిధి మాకిల పెన్నిధి --- 

మా మనసే నీ కంకిత మయ్యా ॥ శ్రీ సాయి ॥

Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)