15 April (15.04.) (106)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

గురువు, మంత్రము, సాధన వ్యక్తిగతము.
Guru, Mantra, Practice are personal. (15 Apr)
 


106) ఏమి కర్మముల జేసితినో

ఏమి కర్మముల జేసితినో నేనేమి పాపముల నొనరించితినో
ఈ భూవిలో పలు బాధల వలలో జిక్కి దిక్కుతోచక యున్నాడను

1. నిన్ను నమ్మితిని, ఓర్పుగ నుంటిని నీవేదో మేలొన గూర్తువనీ
ఎన్నడు నీ దయ ప్రసరించునో యని ఎదురుతెన్నులు జూచుచు నుంటిని ‌//ఏమి //

2. ఎటు నేను వేడిన కరుణించెదవో, ఎటు ప్రార్ధించిన మొరలాలింతువో
ఎరుగని వాడను సాయి దేవా, ఎటునను బ్రోతువో దేవా దేవా //ఏమి //

3. తండ్రివి నీవే దయమాలిన ఇక దీనజనులకు దిక్కెవరయ్యా
మా మొరలను విని వేదనలను గని సరగును బ్రోవుము శ్యామ సన్నుత
//ఏమి //



Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)