23 April (23.04.) (114)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

చెడు ఆలోచనలను ఎక్కువసార్లు అనుకుంటే ఆ చెడు ఆలోచనలకు బలం చేకూరుతుంది. అందుకని చెడు ఆలోచనలు మనసునందు కానీ, బాహ్యము నందు కానీ అనుకోకూడదు .
If you think bad thoughts more often, those bad thoughts will be strengthened. So bad thoughts should not be thought of in the mind and exterior. (23 Apr)


114) ధుని ముందు కూర్చున్న సాయి

ధుని ముందు కూర్చున్న సాయి దేవా
నన్ను ధుని లోని కర్రగా మార్చుకోలేవా !
ద్వారకా మాయీశ సాయి దేవా
నన్ను నీ చేతి సటకగ చేర్చుకోలేవా !

లెండి తోటకు బోవు సాయి దేవా
నన్ను నీ పాదరక్షలుగ కూర్చుకోలేవా !
మార్చుకోలేవా ! చేర్చుకోలేవా ! కూర్చుకోలేవా ! //ధుని//

భిక్షాటనము చేయు సాయి దేవా
నన్ను దయతో నీ జోలెగా మార్చుకోలేవా !
రేకు పాత్రగా నన్ను మలచుకోలేవా !
దర్బారు నందుడు సాయి దేవా

నన్ను నీ ఆసనముగా తీర్చుకోలేవా !
చిలుము సేవించడి సాయి దేవా
నన్ను చిలుము గొట్టముగా కూర్చుకోలేవా !
మార్చుకోలేవా ! తీర్చుకోలేవా ! కూడ్చుకోలేవా ! //ధుని //

భక్తులను దీవించు సాయి దేవా
నన్ను భక్త సేవకునిగా నొనరించలేవా !
లోకముల పాలించు సాయి దేవా
నన్ను లౌకికమ్ముల నుండి తొలగించలేవా !

శామసన్నుత చరణ సాయి దేవా
నన్ను నీ పాద రేణువుగ నిలుపుకోలేవా !
నొనరించలేవా! తొలగించ లేవా !! నిలుపుకోలేవా ! //ధుని //



Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)