5 April (05.04.) (96)
శ్రీ శారదా శ్యామ సందేశం:
గురు బోధనలపై నిర్భయత్వంతో కూడిన నమ్మకము, దృఢ విశ్వాసము అనేవి సత్యాన్వేషికి ప్రాథమిక గుణములు.
On Guru's teachings Bold Belief and firm faith are the basic qualities of a truth seeker. (5 Apr)
96) పరాపవాదము పరిహరింపవే
పరాపవాదము పరిహరింపవే -
పరార్థదాయీ బాబా సాయి
నిరంతరంబును నీ నామంబును
స్మరింపనీయవే సద్గురు సాయి ॥పరాప॥
వృధాభిమాన స్వీయ ప్రశంసల
కధీను చేయకు మయ్యా సాయీ
కృథా కామ దుర్లోభాదుల కడు
వ్యధల్ నివారింపగదే సాయీ ॥పరాప॥
సతంబు భూత విహితంబు గూర్చుచు
ప్రతి ప్రాణి నీవలె గన నీవే
ప్రతి క్షణము నీవలె గన నీవే
మదిన్ ప్రసాదింపగదే సాయీ ॥పరాప॥
ప్రశంసనములకు నృశంసనములకు
ప్రశాంత బుద్దిని బరపవె సాయీ
ప్రశస్తము నీ యశోలీలల్
అహర్నిశల్ స్మరియుంపనీయవే ॥పరాప॥
Comments
Post a Comment