(189) 7 July (07.07.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Jul
నీవు నమ్మినది నీకు
ఎప్పుడూ మంచినే చెబుతుంది. కావున మరేమీ ఆలోచించక విశ్వాసముతో, ధైర్యముగా,
ఓర్పుతో ఆచరించు. సన్మార్గుడవై సంచరించు, తరిస్తావు. గురువు యొక్క
శరీరాన్ని గానీ, అలవాట్లను పట్టించుకోకు. ఆయన అందించే సందేశాన్ని పొరపాటు
లేకుండా ఆచరించు. అదే ఆనందానికి శాంతికి మార్గము.
What
you believe is always good for you. So don't think about anything else
and practice with faith, courage and patience. Wander along the right
path and you will prosper. Don't care about the Guru's body or habits.
Practice his message without fail. That is the path to happiness and
peace.
189) ప్రభో ఏసునాధా..... పరాకేలనయ్యా (07.07.)
ప్రభో ఏసునాధా. ....
పరాకేలనయ్యా
దయను జూపి మమ్ము...
దరికి జేర్చవయ్యా ॥ప్రభో॥
(1) నిన్నెరుగ లేక నింద మోపినారు
నిజము నెరిగి నంత నిట్టూర్చినారు
నీ ప్రేమయే దైవమై దారి జూపే ॥ ప్రభో॥
(2) జీవకోటి నెల్ల చేర దీసినావు
పతిత మానవాళి నుద్ద రించినావు
నీ ప్రేమయే జ్యోతియై దారి జూపే
కృష్ణ రాము లీవే - క్రీస్తు మౌలా లీవే
శ్యామ సాయి వీవే - సద్గురుడ వీవే
ప్రభో కావరా -వేగమే -దేవా ॥ప్రభో॥
Comments
Post a Comment