(201) 19 July (19.07.)

 శ్రీ శారదా శ్యామ సందేశం: 19 Jul

సదా సద్గురునికి దాసునిగా వుండటమే మన కర్తవ్యము. దాసుడే ధన్యుడవుతాడు. ఇది సత్యము.
Our duty is to always be a servant of True-Guru. Servent will be blessed. This is the truth.



201) రమణ రమణ రమణ రమణా  (19.07.)

రమణ రమణ రమణ రమణా యనరే! 
మరణమనిన చింతించె మనసును గనరే!

(1) నేనెవరని పరికించెడి మార్గము గనరే!
దివ్య మార్గము గనరే!
నేను నీవు నశియించెడి భావము గనరే!
సద్భావము గనరే!  ॥రమణ॥

(2) ప్రారబ్దము నడిపించెడి తీరును గనరే! 
లోక తీరును గనరే! లోకేశ్వరు సేవించెడి పధమును గనరే!
దివ్య పధమును గనరే! ॥రమణ॥

(3) అరిషడ్వర్గములు జేయు వింతల గనరే! 
వింత వింతల గనరే! 
వింతల నశియుంప జేయు చరణము  గనరే! 
రమణు చరణము గనరే! ॥రమణ॥

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)