(183) 1 July (01.07.)

 శ్రీ శారాదా శ్యామ సందేశం: 1 Jul

నీళ్లలో నావ ఉండాలి కానీ నావలో నీరు ఉండకూడదు అని అంటారు. అంటే దానర్థం, సంసారంలో నీవు ఉండాలి కానీ నీలో సంసారం ఉండకూడదు అని . తామరాకుపై నీటి బొట్టువలె ఉండు అంటారు. అంటే తామరాకుపై నీరు ఉన్నప్పటికీ ఆ నీరు తామరాకును ఎట్లా అంటుకోదో ఆ విధంగా ఈ సంసారంలో ఉండాలి .
It is said that there should be a boat in the water but there should be no water in the boat. It means that you should be in all things but no things should be in you. It is called like a drop of water on a lotus. That is, even though there is water on the lotus, that water doesn't stick to it, like that you need to be life with all things (Samsara).



183) హర హర శంకర భక్తవ శంకర గౌరి (01.07.)

హర హర శంకర భక్తవ శంకర గౌరి ప్రియంకర పాహి హరే
హరి హరి శ్రీ హరి కేశవ నరహరి మాధవ శౌరి ముకుంద హరే 
శివ శివ శంకరి శంభు మనోహరి ప్రేమవశంకరి మాత శివే
జయ జయహో శ్రీ రామ, కృష్ణ, శివ, దత్త మారుతీ సాయి ప్రభో

(1) నీ లీలల విని నీ మహిమల విని నీ కథలను వినగలిగినచో 
నీ పద భక్తి అలౌకిక యుక్తి మహత్తర శక్తులు కలుగు గదా
సత్యము ధర్మము  సత్పథ మర్మము సద్గుణ కర్మము తెలియుగదా
జయ జయహో శ్రీరామ కృష్ణ , శివ ,దత్త , మారుతీ సాయి ప్రభో॥

(2) ఎవరే తీరుగ భావించిన పూజించిన సంతస మందెదవు
ఏ దైవము నారాధించిననూ సకలము నీవని దెలిపెదవు
దైవ మొక్కటని మతములు వేరని సమ్మతమునె ఒన గూర్చెదవు 
Ilజయ జయహో ll

(3) భక్తజనుల కడు యుక్తిగ నీపద రక్తులుగ నొనరించెదవు
బాధ్యతల నెల్ల నా ధ్యంతముగ నీవే ప్రేమగ భరియుంచెదవు
కష్ట, నష్ట, అరిష్టముల బహు నేర్పుగ నీవే తొలగించెదవు
Ilజయ జయహో......ll

(4) కుల మతములు మానవ కల్పితములు, బేధము లెంచుట దోసమనీ
ఎల్లర నొకటగు ప్రేమ భావమున జూచిన శాంతియె గలుగుననీ
దైవ భావమును పాదు కొలిపి ప్రశాంతత జగతికి నొసగెదవు 
జయ జయహో శ్రీరామ, కృష్ణ, శివ, దత్త మారుతీ సాయి ప్రభో 

(5) సకల దేవతల రూపము లన్నియు నీవనియే జూపించెదవు
సకల సాధు స్వరూపము లన్నియు నీ రూపమే యని తెలిపెదవు
సకల ప్రాణులలో నీవు న్నావని నిదర్శనములనే యొసగెదవు 
Ilజయ జయహోll

(6) నిష్ట సబూరులు గలిగి యున్న నీ దరికి దయజూపి లాగెదవు
అడుగడుగున కడు ఆధరము తో ఆలన పాలన జేసెదవు
జన్మ జన్మముల జత విడదీయక జాగ్రత్తగ కాపాడెదవు 
Ilజయ జయహో॥

(7) కోరిన కోర్కెల నెల్ల తీర్చుచు కొందరి నటు కరుణించెదవు
కోరని వాటిని దీర్చుచు కొందరి నింకొక తీరుగ బ్రోచెదవు
ఎవ్వరి కెయ్యది శ్రేయము గూర్చునో అయ్యది వారికి నోసగెదవు 
Ilజయ జయహో ॥

(8) వేద శాస్త్రముల సారము లన్నియు సలలితముగా బోధించెదవు 
సద్గతుల నొసగు సత్కర్మల విచిత్రముగ జేయించెదవు
సత్కర్మల సత్ఫలితముల ఫలము సద్గతినే అందించెదవు
Ilజయ జయహో ॥

(9) సత్య భాషనమె సద్గురు సేవయే సక్రమమగు మార్గములనీ
అన్నపాన విశ్రాంతి దానములు అత్యుత్తమమగు ప్రేమ యనీ
మానావమాన వికారాదులను సమముగ జూడగ నేర్పెదవు
Ilజయ జయహో ॥

(10) సద్గురుని కరుణ సకల శ్రేయముల నొసగి గాచునని జూపెదవు
సత్కధ శ్రవణమే భగవన్నామమె దారి జూపునని దెలిపెదవు
భగవనామ సంకీర్తనములే భద్రత నిడునని సూచించెదవు
Il జయ జయహో ॥

(11) సాయి సాయి యని సతతము దలచెడి వారిని సత్ కృప గాచెదవు
సర్వ భారముల మోసి ఈ భూవిని సంసారంబుధి దాటించెదవు
సద్భక్తుల నీ దరికి జేర్చుకొని  సద్గతుల  ప్రసాదించెదవు
Il జయ జయహో ॥

(12) దెలిసియు తెలియక జేసిన దోసగుల ప్రార్ధించిన క్షమియించెదవు
సమయమున కగు సలహాల నొసగి సాను నయముగ సంరక్షింతువు
గమనము, గమ్యము, ధ్యానము, ధ్యాత, సర్వము నీవై  పరిపాలింతువు 
Il జయ జయహో ॥

(13) సర్వము నీ కర్పించిన వారల సంరక్షణ జేపట్టెదవు
గర్వ విదూరుల జేసి వారలను గమ్యము జేరగ జేయుదువు
ఈర్ష్య అసూయ రహితులుగ జేసి ఇహపర సౌఖ్యము లొసగెదవు 
Ilజయ జయహో ॥

(14) శ్యామా తాత్యా మహల్సాపతీ రాధా కృష్ణ మాయులను 
అబ్దుల్ కాకా సాహెబ్ దీక్షిత్ నానా చందోర్కరాదులను
చేరగ బిలచి పరిరక్షించిన విధమున శ్యామ దేవుని బ్రోవగదే
Il జయ జయహో ॥

(15) కాశీనాధ ఉపాసనీ బూటీ మేఘశ్యాములు దాసగణు
బీవీ దేవు  కృష్ణ బాగోజీ నరసింహ  హనుమ కేశవుల
ఆలన పాలన జేసి గాచిన విధమున శ్యామను బ్రోవ గాదె
Il జయ జయహో ॥

(16) రసానె తారాబాయి సదాశివ తార్కాడ్ ఎంబి రేగే ధూమల్
హరి వినాయక సాధే కుశాభావు శ్రీ నారాయణ ప్రధానులు 
ప్రేమగ దీసి సద్గదుల నొసగిన విధముగ శ్యామదేవుని బ్రోవగదే
Il జయ జయహో॥

(17) బాల భక్త మౌనీశ్వర సారధి వర శ్రీరామ మహాత్ములను
భక్త కోటినీ భాగవతులను సత్సంగ భజన బృందమలను 
కరుణతో గాచెడి విధమున శ్యామదేవుని జన్మజన్మలలో బ్రోవగదే
Il జయ జయహో  ॥

(18) స్తుతియంతు నీ నామ మహిమ శ్రీ సాయి
అనుదినము ప్రతిక్షణము శ్రీశేష సాయి !
సత్భక్తి సద్గుతుల నోసగవే సాయి 
నీలోన శ్యామదేవుని నైక్యమొనరించుకో సాయి ॥
ఓం శాంతి శాంతి శాంతిః

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)