(199) 17 July (17.07.)

 శ్రీ శారదా శ్యామ సందేశం: 17 Jul

సమర్ధ సద్గురువే పరబ్రహ్మ. త్రికరణశుద్దిగా సద్గురువునకు ఆత్మ సమర్పణ చేసుకొనుటయే సత్యము అనుభవించుటకు మార్గము.
Capable True Guru is Demiurge. With Trinity-Purity surrender the soul to the Guru. Its the way to experience the truth.



199) నేను నేననీ నేను నేననీ   (17.07.)

నేను నేననీ నేను నేననీ 
పలుకుచు నుంటివే శ్యామా (2)
నీవెవరో యని  ఒక్కసారైనా 
చూచుకొంటివా శ్యామా ॥నేను॥

నీవెవరోయని ఒక్కసారైనా యోచించితివా శ్యామా

(1) నాది నాదని నాది నాదని 
నీలుగుచు నుంటివే శ్యామా॥నాది॥
నీదేమున్నదో ఒక్కసారైన 
యోచించితివా శ్యామా ॥నేను॥

దైవ మటంచును దైవ మటంచును 
పలుకుచు నుంటివె శ్యామా
దైవలక్షణము నొక్కటియునా తెలుసుకుంటివా 
శ్యామా సద్గురు వటంచును 
సద్గురు వటంచును వాగుచు నుంటివే  
శ్యామా సద్గురు దేవుల తత్వ బోధలు 
తెలుసుకుంటివా శ్యామా ॥నేను॥

ధనము ధనమని ధనము ధనమని 
దేవులాడెదవే శ్యామా ధనము నీకేమి మేలు చేయునో 
చూచుకొంటివా శ్యామా ॥నేను॥

ప్రేమ ప్రేమని ప్రేమ ప్రేమని 
పలుకుచు నుందువే శ్యామా
ప్రేమ లక్షణము రవ్వంతైనా 
తెలుసుకుంటివా శ్యామా॥నేను॥

పూలమాలలకు పొంగి పోవుచూ పొర్లిపోవకే శ్యామా
పూలమాలలే పెను బామై 
నీ మెడను బిగించునే శామా ॥నేను॥

కనబడునదంత శాశ్వత మనుకొని 
భ్రమసి బ్రతుకకే శ్యామా
సత్యమైనది శాశ్వత మైనది 
తెలిసి బ్రతుకవే శ్యామా ॥నేను॥

భార్యా పిల్లలు బంధు బలగము 
తోడు రారే శ్యామా
నీకు తోడు రారే శ్యామా 
ఎప్పుడు తోడు రారే శ్యామా
తోడుగ  వచ్చెడి  వారెవరో యని 
తెలిసి బ్రతుకవె శ్యామా ॥ నేను॥

తప్పులు చేయుట మానవ సహజము దిగులు చెందకే శ్యామా
తప్పులను దిద్ది చక్కగా నడిపే సన్నిధి చేరవే శ్యామా ॥ నేను ॥

ప్రేమ స్వరూపుని పంచన చేరి బ్రతుకు గడపవె శ్యామా
కరుణా మయుడవు కృపాంతరంగుని శరణు వేడవె శ్యామా ॥నేను॥

శరణు శరణనిన   వారల నెప్పుడు వదలడె గురుడు శ్యామా
సర్వ భారముల మోసి బ్రోచి దరి చేర్చు శ్యామా ॥నేను॥

ఉన్నతోన్నతుడు ఉత్త మోత్తముడు సద్గురు దేవుడె శ్యామా
సద్గురు నాథుడు సద్గురోతముడు సాయి రాముడే శ్యామా
దత్త సాయి రాముడే శ్యామా ॥ నేను॥

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)