(204) 22 July (22.07.)

 శ్రీ శారాద శ్యామ సందేశం: 22 Jul

నీ అనుభూతులను, ఆవేశాలను అణచ వద్దు. ఎవరి వద్ద నీవు స్వేచ్ఛగా మన గలుగుదువో ఆయనతో హృదయంలోని భావాలను పంచుకో.
Do not suppress your feelings and emotions. With whom you are free, with him share the feelings of the heart.
 

204) సనాతనా -  అధునాతన రూపములో  (22.07.)
సనాతనా -  అధునాతన రూపములో
షిరిడీలోన అవతరించితివి
సాయి బాబాగా సాయి బాబా గా ॥సనాతనా॥

(1) భౌతికముగ అరువది వత్సరములు
శిధిలమైన ఆ మసీదులోన
వసియించిననూ విశ్వవ్యాపివై
మానవులకు అనుభవముల నొసగిడి ॥సనాతనా॥

(2) సకల జీవులలో దైవము గలడని
మతములన్నియు మనుషులకే నని
అనుభవముల దయతో కలిగించుచు
ఆనందమార్గములో నడపించెడి - ॥సనాతనా॥

(3) వేదశాస్త్ర పురాణాదులకు
సరియగు నిర్వచనమే నీ జీవితము
నీ సూక్తులకు అంకితమైనచో
సత్యము అనుభవమౌ నీ కృపతో ॥సనాతనా॥

(4) తెలిసీ తెలియని పరిమిత మతితో
నిను గ్రహించయించగ నెంచిన  
శ్యామ దేవుని 
కృప జూపి కరుణతో నడపింపుము
నీ కొరకై నిను ప్రేమింపనీయుము ॥సనాతనా॥
(23.12.  ఉ.2.57 గం.కు మాల్కోస్ రాగం)

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)