(196) 14 July (14.07.)

 శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Jul

మనశ్శాంతి, నిస్సంగముగా జీవిస్తూ చివరకు ముక్తిని పొందడానికి దేవుడు మనకు బుద్ధినిచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి ప్రకృతి ధర్మములను అధ్యయనం చేస్తూ గురు సహాయముతో భావి జీవిత పథకాన్ని రూపొందించుకోవాలి.
To finally attain salvation, Living with Peace of mind, without association, God has given us intellect. With that use intellect , by studying nature's virtues, with the help of Guru formulate a future life plan. 



196) నవరత్నముల వంటి నవవిధ భక్తులు (14.07.)

నవరత్నముల వంటి నవవిధ భక్తులు 
నా గురుని పాదాల ధూళి రజము 
నా గురుని సేవలో నేను తరించిన 
నాకేమీ కావలెను ఈ జగతిలో ll నవరత్న ll

1.సాయియన్నను వాడే, సర్వేశ్వరుడు వాడే
 శ్యామయన్నను వాడే, శక్తి రూపుడు వాడే.

2.రాముడన్నను వాడే, రక్షించు నతడే,
వాని దాసునకేల కలుగు చెడుగు
శరణాగతిని చేసి గురుని నెరనమ్మిన 
వాని మార్గములోన వాడే నడిపించు ll నవరత్న ll

3. తనను తన బరువులను తానే భరించును
తానే కాపాడుచు తరింపచేయును 
నను నమ్మిన వారే నా వారాలని బల్కి 
నయముగా నేర్పుగా నడక నేర్పు ll నవరత్న ll

4. నడిచి పోవుచు నుండ నడిపించుచు 
తన వారి నెప్పుడు నాదే సర్వము యనుచు 
నాదేమీ లేదనుచు ఇహ పరముల లోన సౌఖ్యము నొసగును. 
 ll నవరత్న ll
(23.10.1994 మ.12.30)

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)