(212) 30 July (30.07.)

 శ్రీ శారదా శ్యామ సందేశం: 30 Jul

ఒక పెద్ద వృక్షము అనేక రకముల ప్రాణులకు ఆశ్రయమిస్తుంది. ఆ ప్రాణులు అక్కడ విశ్వాసముతో రక్షణ పొందుతాయి. గురువు కూడా అలాంటి మహావృక్షమే. మనమంతా వారి ఆశ్రయము పొందగల ప్రాణులము.
A large tree shelters many species of animals. Those souls will be saved there by faith. Guru is also such a great tree. We are all beings who can take their shelter.
 

 
212) శ్రీకరమౌ నీ పద సన్నిధిలోన  (30.07.)
(బీమ్పాస్ రాగం)
 
శ్రీకరమౌ నీ పద సన్నిధిలోన
నిలచెడి భాగ్యము నొసగుమ మా సాయి (2)

గంగా యమునలు ప్రవహించిన
నీ పాదములే పరమ పావనములు
సకల తీర్థ, సంపదల నిలయములు
పతితుల కెల్లను పరమార్ధములు ॥శ్రీకరమౌ॥

(1) అవగాహనతో నీ చరితమును
ఒకపరి అయినను చదివిన చాలును
సకల దేవత సాధు జీవములు,
సకల విశ్వము నీవని తోచును ॥శ్రీకరమౌ॥

(2) రాజైనను పేదవాలె జీవించెడి వాడు
భగవంతుని కృపకు పాత్రుడవునంటివీ
రాజాధి రాజులే పడిగాపులు కాచుచుండ
భిక్షతో జీవించి ఆచరించి చూపితివి ॥శ్రీకరమౌ॥

(3) పరమాత్మవు నీవైనను మానవునిగ
సంచరించి మమతానురాగములతో
మనసుల మురిపించితివి భక్తుల కోరికలను దీర్చి
అభయ మొసగుచున్నావు మానవుడే మాధవుడై
వెలుగు దారి చూపించితివి
శ్యామను నీ చేతిలో కీలు బొమ్మను చేసినావు ॥శ్రీకరమౌ॥
(15.03.1986, రా. 1 :30 గం.కు)


Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)