(207) 25 July (25.07.)

 శ్రీ శారాదా శ్యామ సందేశం: 25 Jul

"ప్రేమపూరిత కరుణ” శాసనాలకన్నా గొప్పది. 
దానాలు, కర్మకాండలకన్నా అదే గొప్పది.
"Loving compassion" is greater than statutes. 
It is greater than deeds and rituals.
 


207) భగవన్నా మమే తరుణోపాయము (25.07.)

భగవన్నా మమే తరుణోపాయము
బంధము లూడుట కదే ఉపాయము ॥భగవాన్ నామమే॥

(1) నేను నాదనెడి భావము చేత
బంధింపబడిన బడుగు జీవులకు
అజ్ఞానముతో అలమటించెడి
అసలు సత్యమును తెలియని వారికి  ॥భగవాన్ నామమే॥

(2) ఆనందమునకు ప్రాకులాడుచూ
అది ఐహికమున కలదని ఎంచుచు
కామాదులతో పరిభ్రమించుచు
అశాంతితోడ జీవించు వారికి ॥ భగవన్నామమే ॥

(3) వాల్మీకి వ్యాస మహా ఋషులందరూ
తుంబుర, నారద, గంధర్వులందరూ
త్యాగయ్య , అన్నమయ్య భక్తాదులెందరో
మైమరచి, స్మరియించి,
పులకించి, తరియించ ॥భగవన్నామమే॥

(4) నామదేవ, జ్ఞానదేవ,
తులసీ, తుకారాము,
ఘోరా, మీరా, పురందర, రామదాస
కబీరు చైతన్య, రామకృష్ణ శ్యామా
ఎందరెందరో మహానుభావులు
అనుసరించిన అద్భుత మార్గము
 
పతిత పావనుని చేరెడి మార్గము 
మానవాళి కిదే సులభ మార్గము
సాయినాధుడందించిన మార్గము
కలిమాయను దాటెడి నుపాయము ॥భగవన్నామమే॥
(19.03.1986 రా.11:50 గం.కు)

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)