(203) 21 July (21.07.)

 శ్రీ శారాద శ్యామ సందేశం: 21 Jul

అన్ని సాధనలకు ఆరోగ్యకరమైన శరీరము, 
ఆరోగ్యకరమైన మనసు అవసరము.
For all practices a healthy body and 
a healthy mind is necessary.
 
 



203) లేరెవరు నీ సాటి నను గావ గల మేటి  (21.07.)

లేరెవరు నీ సాటి నను గావ గల మేటి,
నా హృదయ మందిర నివాస సాయి,,
నీ నోట ప్రతి మాట రతణాల మూటయే
నా బోటి వారికది ధీటైన బాటయే
మాటిమాటికి నీవు తలపు వచ్చేవయ్యా
నాటి నీ నటనతో కట్టి వేసితివయ్యా ll లేరెవరు ll

సతము ప్రవహించెడి నీ ప్రేమ వాహిని లో
నిలువునా ననుముంచి ఈత నేర్పించినావు
దరికి రానీయవు నా దరికి రావు
ఎందుకీ చిత్రమగు నటన నా తండ్రి llలేరెవరుll

సర్వమును వదిలి నీవెంట రమ్మన్నావు
బాధ్యతల భారములు వదల లేనని తెలిసి
నాది నీదన్నావు, నడయాడమన్నావు
ఇన్నిటిని సృజియించుటేల నా దేవా llలేరెవరుll

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)