(208) 26 July (26.07.)
శ్రీ శారాదా శ్యామ సందేశం: 26 Jul
నది నిస్సంగ భావాన్ని, అంకిత భావాన్ని నమ్రతను బోధిస్తుంది. జీవితం కూడా నది వలెనే అనంత దివ్య మహా సాగరం వైపు ప్రవహిస్తోంది.
The
river teaches unsocial feeling, dedication and modesty. Life itself is
like a river flowing towards the Infinite Divine Ocean.
208) ముప్పది వత్సరములన్ని (26.07.)
ముప్పది వత్సరములన్ని ముచ్చటగా గడిపితిమని
కలిసిమెలిసి బ్రతికితిమని కలతలసలే లేవనుచును
మరవకండి మహామాయ ప్రభావమును
మదిలోన ముసలి తనము ముసుగువేసి
ముందుకొచ్చె పరుగునా వారు వారు చేసినట్టి
కర్మములకు అనుగుణముగ వారి వారి మనోభావములకు
సక్రమముగా అనుభవించ వలసి యుండు
ఫలితములను క్రమముగా
జగదీశ్వరుడాడించెడి నాటకమున పావులుగా ॥ముప్పది॥
(1) నేను నాదను భావమే అన్నిటికీ మూల మనచు
అది తొలగిననే గానీ ఆనందము నిలువ దనుచు
సద్గురును సేవింపక జీవులు తరియించరనుచు
భగవాన్ రమణు లొసగిన ఉపదేశంబును మరిచి ॥ముప్పది॥
(2) జీవితమందున సాధన భాగము కాదని తెలిసి
సాధనలో జీవిత మొక భాగమనెడి సత్య మెఱిగి
శ్రీ సాయి సూక్తుల ఆచరణకు మీరంకితమై
సుఖియించుడు, తరయించుడు శ్యామనాథు కృపతోడా ॥ ముప్పది ॥
(20.03.1986 00.38 గం.కు)
Comments
Post a Comment