15 February (15.02.) (46)
శ్రీ శారదా శ్యామ సందేశం:
దినచర్య, ప్రార్థన, ప్రదక్షిణ, మిత భాషణం, సాత్వికాహారము, బ్రహ్మచర్యము, త్యాగము, దానము, సేవ, నామము చేస్తూ మిగతా సమయంలో నిద్రపోకుండా (పగటిపూట) సత్గంధపారాయణ, మహాత్ముల చరిత్రలు చదువుట సాధనానుకూలమునకు అనుసరించవలసిన మార్గము.
Daily Deeds, Prayer, Divine Circling, moderate speaking, Diet food, Celibacy, Sacrifice, Donation, Service, Chanting rest of the time (during the day), Legends Recitation, Reading the histories of the sages is the practice compatible path to follow. (15 Feb)
46) ఏదిరా నిజమేదిరా?
ఏదిరా నిజమేదిరా?
చివరకు నిలిచేదేది రా ?
అనుమానములను అంతము చేసి
అనుమానములను అంతము చేసి
అనంతమై మిగిలేదేదిరా ॥ ఏదిరా॥
జీవుడు, దేవుడు, ఒక్కటే
జీవుడు, దేవుడు, ఒక్కటే
యనుచు అద్వైతము బోధించును రా
జీవుడు దేవుడు వేరు వేరనుచు
ద్వైతము ఉద్భోదించును రా ॥ఏదిరా॥
ఉన్నది లేదని దేవుడు కలడని
అతడే మూలంబని యందురురా
ఉన్నది కలదని దేవుడు లేడని
ఉన్నది కలదని దేవుడు లేడని
మనోరోగ మది యని అందురు రా
॥ఏదిరా॥
వాక్కుకు మనసుకు అందని స్థితి యని
అదియే దైవంబని యందరు రా
ఊహాజీవుల సోమరి పోతుల
పిచ్చి భావమది యని అందురురా
వాక్కుకు మనసుకు అందని స్థితి యని
అదియే దైవంబని యందరు రా
ఊహాజీవుల సోమరి పోతుల
పిచ్చి భావమది యని అందురురా
॥ఏదిరా॥
మంచి చెడుగులను బేధ భావములు
లేని కాలమే లేదందురా
తర్కవాదములతో సత్యమును
మంచి చెడుగులను బేధ భావములు
లేని కాలమే లేదందురా
తర్కవాదములతో సత్యమును
తెలియుట సాధ్యము కాదందురురా
॥ఏదిరా॥
విశ్వమే తానై తానే దైవమై నిలచిన
విశ్వమే తానై తానే దైవమై నిలచిన
జ్ఞానిని చదువమందుదురు రా
అటు చదవకనే అహమని బలికిన
అవివేకం బది యని యందరురా ॥ఏదిరా॥
శ్యామనాథుడగు సాయినాధుడే
అట్టి దైవంబని యందురు రా
సాయిని ప్రేమతో సమాశ్రయించిన
సత్యము అనుభవమగు నందురు రా
అవివేకం బది యని యందరురా ॥ఏదిరా॥
శ్యామనాథుడగు సాయినాధుడే
అట్టి దైవంబని యందురు రా
సాయిని ప్రేమతో సమాశ్రయించిన
సత్యము అనుభవమగు నందురు రా
అదియేరా నిజమదియేరా
చివరకు నిలుచునది యేరా
అనుమానములను అంతము చేసి
అనంతమై నిలచెడి దది యేరా ॥ఏదిరా॥
చివరకు నిలుచునది యేరా
అనుమానములను అంతము చేసి
అనంతమై నిలచెడి దది యేరా ॥ఏదిరా॥
Comments
Post a Comment