20 February (20.02.) (51)
శ్రీ శారదా శ్యామ సందేశం:
అహంకారం శాశ్వత ధర్మాలను, సత్సంగాన్ని అనుమతించదు మరియు దుఃఖాన్ని కలిగిస్తుంది. నిరహంకారం బలాన్ని, ధైర్యాన్ని, సమగ్ర తృప్తిని ఆహ్వానిస్తుంది.
Arrogance does not allow eternal virtues, True Companionship and causes misery. Selflessness invites strength, courage, and inclusive satisfaction. (20 Feb)
51) శరణు శరణు రఘు రామా
శరణు శరణు రఘు రామా సాయి రామా.
సాయి దత్త గురు నామా సద్గుణ సాయి ధామా ప్రభో సాయిరామా
సాయి సాయి యని స్మరియించిన చాలు
సకల పాపంబులే సమసి పోవు
సాయి సద్గురు కరుణే సదా తోడు నీడయై
గాచి రక్షించి ప్రేమ మీర బ్రోచు గాదా
సకల దైవ స్వరూపములు సాయియే
సకల ప్రాణి స్వరూపములు సాయియే
ఎవ్వరెటుల గొలిచినా ఎవ్వరెటుల పిలచినా
ఆలకించి సర్వము సమకూర్చు గాదా.
Comments
Post a Comment