21 February (21.02.) (52)
శ్రీ శారదా శ్యామ సందేశం:
నైతికమనేది, మనల్ని మనం ఎలా సంతోషవంతులుగా చేసుకోవాలో తెలియజెప్పే సిద్ధాంతం కాదు. మనం ఆనందాన్ని అనుభవించడానికి మనల్ని ఎలా అర్హులుగా చేసుకోవాలో తెల్పేదే అది.
సంతోషము - భౌతికమైనది మరియు ఇంద్రియాధీనము, నశించేది.
ఆనందము - పారమార్ధికమైనది, ఇంద్రియాతీతము, శాశ్వతమైనది. కావున దైవాన్ని స్మృతియందుంచుకొని ప్రార్థించు.
Morality is not a theory that tells us how to make ourselves happy. It tells us how we deserve to experience happiness.
Gleefulness - material and sensual, perishable.
Happiness - transcendental, phenomenonal, eternal. So remember God and pray. (21 Feb)
52 ) శరణం శరణం శ్రీ శ్యామ చరణం
శరణం శరణం శ్రీ శ్యామ చరణం
హృదయా భరణం సంకటహరణం
శరణం శరణం శరణం శరణం
గురుదేవా నీ గుణముల త్రోవ నిత్యము నడువా శక్తినీయవా ॥2॥
మహదేవా నీ మహిమను కొలువ
వాక్కు నొసగవా ప్రేమ చూపవా
నీవు నిండిన మనసు కెన్నడు చేటేరాదయ్యా
వాక్కు నొసగవా ప్రేమ చూపవా
నీవు నిండిన మనసు కెన్నడు చేటేరాదయ్యా
నిన్ను నమ్మిన బ్రతుకు ఎప్పుడు లోటేరాదయ్యా
కామ క్రోధ మద లోభ హరణమౌ
దివ్య స్మరణం శ్రీ శ్యామ చరణం
శ్రీ శ్యామ చరణం ॥శరణం శరణం॥
రాగ ద్వేషమే పదముల పూజ చేసి తరించ కరుణించవయ్యా
దివ్య తేజ నీ దర్శన కాంక్ష భవముల తీర్చ మన్నించవయ్యా
నిరతము
నిన్నే భక్తిని కొలిచితి
దయ చూపగ రావా సతతము
నీకై తపమునరించితి నన్ను
బ్రోవగ రావా
ధర్మ ,అర్థ ,కామ ,మోక్ష ,మంత్రమౌ దివ్యస్మరణం
శ్రీ శ్యామ చరణం
శ్రీ శ్యామ చరణం ॥శరణం॥
Comments
Post a Comment