11 February (11.02.) (42)
శ్రీ శారదా శ్యామ సందేశం:
బ్రహ్మచర్యము - నిరంతరము భగవంతుని విషయములతో చరించుట బ్రహ్మచర్యము.
Celibacy - Celibacy is the constant contact with the things of God. (11 Feb)
Celibacy - Celibacy is the constant contact with the things of God. (11 Feb)
42) ఎంత చిత్రమైనదో నీ లీల
ఎంత చిత్రమైనదో నీ లీల
మరెంత చిత్రమైనదో మా గోల ॥ఎంత॥
నీదు లీల నెరుగకయే మా గోలల వినిపింతుము
విసుగు గొనక వినుచుంటివా కరుణాలోలా॥ ఎంత॥
ఆనందము నందు గానక అందరినీ రమ్మనుచు
ఆదర మోవ్వగ ప్రేమతో బిలుచుచు, నుండగ
ఆనందమున కర్దము తెలియలేని మా బ్రతుకుల
ఆకారమే అహమును పెంచును అల్పుని జేయునే మనసా
వినయ వివేకములు, లేని ఎడల అది విషముగా మారునే మనసా
అనుకున్నది నిజమని బ్రభమియక, నిజము తెలియవే మనసా
నిను నీ వెరిగిన శ్యామనాథుని నిక్కము తెలియవే మనసా ॥ఎంత॥
Comments
Post a Comment