12 February (12.02.) (43)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

త్యాగము - పోటీలు, వంతులు, కీచులాటలు లేకుండా భగవంతుని సేవగా భావించాలి. పోటీలు, వంతులు, కీచులాటలు మానుటయే త్యాగము.

Sacrifice - Without competition, shares, and shouts, should be feel as service of the God. Leaving competition, shares, and shouts is called the sacrifice. (12 Feb)
 


43) ఏ క్షణమున నీ కరుణ
ఏ క్షణమున నీ కరుణ ప్రసరింప చేతువో
ఏ క్షణములో నన్ను ప్రేమ గాచెదవో॥ఏ॥
సాయి....రామా.... సాయి.... రామా ॥ఏ॥

అయిన వారెవరయ్యా, కాని వారెవరయ్యా
ఉన్నదేదోనయ్యా ణలేనిదేదోనయ్య
ఏ తీరుగా నేను జీవించవలయునో
ఏమాత్ర మెరుగక నిన్ను నమ్మితినయ్యా ॥ఏ॥

క్రుళు కుత్సితముల నెరుగగా లేదయ్యా
వంచనల మోసముల దెలియగా లేనయ్యా
ఇచ్చికము లాడేడి మనసు లేదు గదయ్యా
లోకంబులో నేను బ్రతుకు విధమేదయ్యా ॥ఏ॥

పరుల సంపదలకు ఆశపడలేదయ్యా
మెప్పుదనముల గోరి మిడిసిపడ లేదయ్యా
కలిగినంతటిలోనే కాపుర మెనరింప
నీ ఆశ్రితుల కేల కలత లిచ్చితివయ్యా ॥ఏ॥

దీన జన బాంధవా దిగులు తొలగించుమా
ఆశ్రిత పోషకా నన్నాదు కొమ్మా
ద్వారకామాయశా దరి జేర్చరమ్మా
శామచరణానాధులకు సంతసమ్ములిమ్మా ॥ఏ॥

Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)