9 February (09.02.) (40)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

నిర్ణీత సమయంలో ఒక గంట మౌనం పాటించాలి. మిగతా 23 గంటలలో అవసరమైన వరకే మాట్లాడుట, కోపము లేకుండా వినయముగా మాట్లాడుట, గౌరవము, శాంత స్వభావంతో ఉండుట, ఇతరులను గురించి మాట్లాడకుండుట, అనవసర విషయములలో జోక్యము చేసుకోకుండా ఉండుట - సాధనానుకూలమునకు అనుసరించవలసిన మార్గము.

At the scheduled time, one hour silence should be followed. The rest of the 23 hours speak when its need. Speak humbly without anger, being respectful, calm in nature, not talking about others, not interfering in unnecessary things. It is Practice compatible path to follow. (9 Feb)
 


40) ఉయ్యాలలూగవయ్య ...

ఉయ్యాలలూగవయ్య ...
రామా రామా రామాభిరామ
సీతారామా శ్రీ సాయి రామా
సీతమ్మతో గూడి - ఉయ్యాలలూగుచు

ఆర్తులను గాచుచు అభయముల నొసగుచూ
విశ్వకళ్యాణమున కవతరించిన రామా
హాయిగా, ఠీవిగా ఉయ్యాలలూగుమా 
||ఉయ్యాల ||

నీకు నీవే సాటి - లేరెవరు నీ పాటి
శరణన్న వారలను కావగల మేటి
కళ్యాణ ధామా కళ్యాణరామా
సీతమ్మతో గూడి - ఉయ్యాలలూగుమా ||ఉయ్యాల ||

లోకములు శ్రేయమై విశ్వామానందమై
సకల శుభములు కలుగ కన్నులకు పంటయై
శ్యామాదులను పరిశుభ్ర మార్గమున
నడిపించ కరుణతో ఉయ్యాలలూగుమా ||ఉయ్యాల ||

Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)