(242) 29 August (29.08.)
శ్రీ శారాద శ్యామ సందేశం: 29 Aug
తనకు నచ్చింది చేయడం కాక, తన కర్తవ్య కర్మను ఇష్టముతో చేయడమే ఆనందముననుభవించుటలో గల రహస్యం.
The secret of happiness is not doing what one likes, but doing one's duty with love.
242) విశ్వమంత నిండి వున్న శ్రీ గురుదేవ (29.08.)
విశ్వమంత నిండి వున్న శ్రీ గురుదేవ
విశ్వాసము ఓర్పులను కలిగించలేవా
విశ్వమెల్ల నీ రూపమై నిలిచి యుండగా
బాలోన్మత్త పిశాచ వేషము లేలా
1.నిన్ను గుర్తించు శక్తి లేదని తెలిసియు
ఇటు నటు త్రిప్పుచు, నన్ను ఊపుదు వేల, రోశెద వేలా
ప్రేమకు ప్రతిరూపం కరుణానిలయం
నీ దివ్య సన్నిధియే శాంతికి వలయం
ll విశ్వమంతా ll
2. పతితులను పావనలుగా మార్చెడి శ్రీ గురుదేవా
దయ చూపి ప్రేమతోడ కృప చూపవా
విశ్వాసము కలదో లేదో నీ నామమే స్మరియింతునే
అహరహము గాచెదవని నీ నామమే భజియంతునే
దీనోద్ధారకుడ వంచు నిన్ను నమ్ముకుంటినే
నీ కృప కలిగిన శ్యామ నిన్ను వదులునే
ll విశ్వమంతా ll
3.వదిలినంత భూవిలోన బ్రతుక కలుగునే
శ్రీ గురుదేవ దత్త, అవధూత చింతన
శ్రీపాద వల్లభ నరసింహయతివర
సద్గురు దేవా బాబా సచ్చిదానంద
సకల విశ్వరూప శ్యామ పోషకా
శ్యామ రక్షకా ౼ శ్యామ సన్నుతా
ll విశ్వమంతా ll
(22.02.1987) (రా.1.20 గం.కు)
Comments
Post a Comment