(238) 25 August (25.08.)
శ్రీ శారాద శ్యామ సందేశం: 25 Aug
“నీవు ఇతరుల పట్ల దైవంలా
ప్రవర్తిస్తే అందరూ దైవభక్తి పరాయణులు గాను మరియు ప్రతివారు దైవంలాను
ప్రవర్తిస్తారు." అనునది సత్యవచనము. మన ఊహలు, భయాల ఫలితములే మన బాధలకు,
అనారోగ్యములకు కారణములు.
"If you act like a god towards others,
everyone will be a stranger to godliness and everyone will act like a
god." That is the truth. The results of our imaginations and fears are
the causes of our sufferings and illnesses.
238) కృప కనుమా శ్రీమాతా శారదా (25.08.)
భీమ్పాస్ రాగం
కృప కనుమా శ్రీమాతా శారదా
నీవారల మము వీడకు మమ్మా
కృప కనుమా శ్రీ మాత శారదా (దే)
1. జపతప సాధనలు చేయగలేను
సత్యమార్గమున నడువగలేను
దానధర్మముల చేయగలేను
నీకై నీవే మము నడిపించుమా
ll కృప గనుమా ll
2. భ్రమలకు చిక్కి మాయలొ బడితిని
మంచి చెడుగులను తెలియనైతినే
సదాలోచనలు చేయగ నైతినే
ప్రేమతో మమ్ముల చక్కగ నడపవే
ll కృప గనుమా ll
3. నేనను భావము వదలకున్నది
నాదను భావము వీడకున్నది
నీ మార్గములో ఎటుపయనింతునో
నీ శ్యామగ నే నెప్పుడు నిలుతునో
llకృప గనుమాll

Comments
Post a Comment