(234) 21 August (21.08.)
శ్రీ శారాద శ్యామ సందేశం: 21 Aug
మనిషి శాంతం చేత కోపాన్ని, మంచితనం చేత చెడును జయించాలి.
Humans should conquer anger with peace and evil with goodness.
234) యాడబాయ కున్నా మాయా (21.08.)
యాడబాయ కున్నా మాయా
ఎందు బోయనో తెలియ దాయా
పుడమిలో సద్గురు రాయా
బోధామృతము పానము చేయా… ll
1.పుట్టుల కాధార మాయ
పొత్తుకూడి ఉన్నట్లాయ
గుట్టు తెలియగనే నిలిచి పోయ
శ్రీ గురు చంద్రోదయ మాయ ౼॥
2.పట్టరాని రిపులార్గురిని
పట్టి బంధించి న్నట్టులాయా
బట్టబయట చూడగ తానే
బ్రహ్మమనుచు నిలకడాయా ౼॥
3.బిందువే బీజమైన దాయా
సంధి తెలియ సమరస మాయా
ఎందుచూచినను ఏక మాయా
ఎరుకతానే బ్రహ్మ మాయా ౼॥
4.మనసు చెదరగానే నిలిపి
అహంకార మమతల విడిచి
తనలో తానే తనువును మరచి
ద్వైత భావమును కిందు పరచి౼॥
5.నన్ను నాలోనే చూచితిని
నామరూపముల యెడ బాసితిని
చెన్నుమీర పాలలోనే
వెన్న విధమని తెలియనాయా ౼॥
6.భావ భావములేవేనీ
సద్భావమే బ్రహ్మ భావమాయా
జీవుడే గురు మృత్యుంజయుడు
దేవుడని తెలియనాయా ౼॥
(18.01.1987, ఇది, రా.7.00 గం.కు)
Comments
Post a Comment