(225) 12 August (12.08.)

 శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Aug

మనలను గురించి ఎవరేమి అనుకున్నా మనము మాత్రము మౌనంగా ఉండాలి. మనలను అందరూ మంచిగా చూడాలని అనుకోవడం వలన శ్రీ సాయి కృపకు, కరుణకు దూరమవుతాము.
No matter what anyone thinks about us, we must remain silent. Because we want everyone to see us as good, we get away from Sri Sai's grace and mercy.


225) లౌకిక రుణముల తీర్చుట కొరకై (12.08.)

లౌకిక రుణముల తీర్చుట కొరకై 
సతమతమయ్యెడి మనిషినయా
నీ ఋణమెటుల తీర్చుకోగలను 
నిరుపమ, నిర్మల, ప్రేమమయా అ ...ఆ ...

1.నేనూ నాదను స్వార్థ చింతనలు
సంకుచితముగ నను నడుపుచున్నవి
నిస్వార్ధ సేవల నెపుడు జేయుదునో
నీ దయ కెటుల పాత్రుడ నగుదునొ  llలౌకిక ll

2.అరిషడ్వర్గపు దిగ్భంధనమున
అస్తవ్యస్తముగ నడుచుచుంటిని
అందరి శ్రేయము నెపుడు కోరుదునో
నీ ప్రేమ కెటుల పాత్రుడ నగుదునో  llలౌకిక ll

3.తార్కిక వాదముల వలలో బడితిని
తత్వ విచారమునకు దూరమైతిని 
శ్యామయే లేడని ఎపుడు తెలియునో
నీ కృప కెటుల పాత్రుడ నగుదునో llలౌకిక ll
(09.06.1986 రా.11.40 గం.కు)

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)