(239) 26 August (26.08.)

 శ్రీ శారాద శ్యామ సందేశం: 26 Aug
అత్యల్పమైన దానిని ఆనందంగా అనుభవించగలిగితే దేనినైననూ సులభముగా అనుభవించవచ్చును.
If you can experience the least with joy, you can easily experience anything.

239) రామకృష్ణ గురుదేవా శరణం (26.08.)
మాల్కోస్ రాగం
మధ్యమావతి రాగం

రామకృష్ణ గురుదేవా శరణం
శారదా దేవి మాతా శరణం 

శ్రీ గురుదేవ రామకృష్ణ పాహిమామ్ రక్షమామ్
శారదనాథ రామకృష్ణ పాహిమామ్ రక్షమామ్

1.పొట్టకూటి చదువును వదలి
తరించు మార్గము నందున తరలి
జప తప సాధన లెన్నో చేసి
విశ్వరూపిగా మా మది నిలిచిన 
ll శ్రీ గురుదేవ ll

2.నేనను భావన లేనివాడవై
అమ్మ శక్తిలో నీవు లీనమై
దివ్య సమాధిలో నిరతము నిలచి
జీవరాశిని నడిపెడి దేవా 
ll శ్రీ గురుదేవ ll

3.నవవిధభక్తి మార్గమ్ములలో
నడిచెడి వారికి తోడు నీడవై 
చక్కగ నడుపుచు సంతస మిచ్చుచు
సద్గతి నొసగెడి సద్గురు దేవ 
ll శ్రీ గురుదేవ ll
 
4 నీవే శరణని నమ్మిన వారల
బరువు బాధ్యతల భరియించెదవు
ప్రేమ మమతలతో కృపను చూపెదవు
శ్యామ హృదయమున నిలచి యుందువు 
ll శ్రీ గురుదేవ ll

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)