(229) 16 August (16.08.)
శ్రీ శారాద శ్యామ సందేశం: 16 Aug
ఏ పని అయినా
తెలుసుకొని చేయాలి. లేదంటే చేస్తూ, చేస్తూ పోవడం వలన అదే తెలుస్తుంది.
దేవాలయాలు ప్రశాంతతకు, ప్రాయశ్చిత్తములకు, పశ్చాత్తాపములకు నిలయాలు.
Any
work should be done knowingly. Otherwise it will be known by doing and
doing. Temples are abodes of tranquility, Atonements and penitence.
229) విశ్వాసముతో నుండుము (16.08.)
విశ్వాసముతో నుండుము -
వినయముతో నడయాడుము
ఓర్పుతో చరియించుము -
ధైర్యోత్సాహముల ఎపుడు వీడకుము
ధైర్యము నెపుడు వీడకుము -
ఉత్సాహము వీడకుము
1.విశ్వాసము కలిగించును
వివేక విజ్ఞానములను
విశ్వాసము మది పెంచును
ప్రేమాభిమానములను
ఓర్పు యున్న వారికే
సత్ఫలితము స్వంతమగును
విశ్వాసము ఓర్పులున్న
సద్గురు కృప సులభమగును
ll విశ్వాసము ll
2. అచంచలము ఆనందము
అమోఘము విశ్వాసము
దుర్గుణముల పారద్రోలు
బ్రహ్మాస్త్రము ఓర్పు
త్రికరణ శుద్ధిగ జేసెడి
కార్యములకు మూలమవియే
సాయి దేవుడు అందించిన
సులభమైన సూత్రములు
ll విశ్వాసము ll
3. శాస్త్రములు, సాధనలు,
యోగా భ్యాసములు
వాదములు ,వేదములు
భేదములు, తర్కములు
ఐహిక ఆముష్కికముల
సంపదలను యోచనలు
నిరర్ధకము వ్యర్థములు
అనర్ధదాయకములగునట
ll విశ్వాసము ll
4.విశ్వాసము ఓర్పు లేక
ఏ పనియు నెరవేరదు
శబ్ద, స్పర్శ, రూప,
రస గంధాదుల దాటలేరు
త్రికరణ శుద్ధియే లేని
ఏ కార్యము ఫలించదు
సద్గురును ఆశ్రయించ కేమియు సాధించలేరు
ll విశ్వాసము ll
5.విశ్వాసము ఓర్పులతో
సద్గురువును సేవించిన
సర్వము శ్రీ గురుదేవుని
పరమొనరించి నిలచి యున్న
అందరి బాధ్యతలను
సద్గురువే భరియించి
సంతస మొసగి
సద్గతి నొసగి బ్రోచు గాదే
ll విశ్వాసము ll
6.శ్యామ నాయకుడు
పరమ కరుణామయుడు
శ్యామసేవితుడనంత
ప్రేమ మందిరుడు
శ్యామ నాయకుడు
అమోఘ కృపాకరుడు
శ్యామవందితుడే గదా
విశ్వనాయకుడు ll విశ్వాసము ll
Comments
Post a Comment