(223) 10 August (10.08.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Aug
నీకు చక్కటి అనుభవమును కలిగించి నీ నుంచి దేనినీ కోరక, నీ శ్రేయస్సునే కోరేదాన్ని నమ్ముకో. అదే సక్రమముగా మార్గములో నడిపిస్తుంది.
The one who give you a good experience, and wants nothing but your well-being. Trust them. They leads in the right way.
223) ఆనందామృత సాగరా ! (10.08.)
ఆనందామృత సాగరా !
ఆశ్రిత పోషక కృపాకరా !
ఆనందామృత సాగరా !
ఆశ్రిత పోషక కృపాకరా_ll
సాయిరాం ! సాయిరాం ! సాయిరామ్ !!
సాయిరాం ! సాయిరాం ! సాయిరామ్ !!
1.ఒకపరి ఆర్తితో "సాయి" అనగనే
పరిపరి విధముల పరిరక్షింతువు
భక్తుడో కాడో గణుతింపకనే
బాధ్యతల నెల్ల మోయుచున్నావు
llఆనందామృతll
2.ఎవరి సేవను ఉచితముగా...
పొందవలదని బోధించితివి
అనుక్షణము నన్ను కాపాడుచున్న
నీకేమి చేతును దేవాధి దేవా
llఆనందామృతll
3.నీ దయయే గద ఈ జీవితము
నీకరుణయే గద కల్మషహరము
కాదని యేది లేదని తెలిపిన
తెలుసుకోలేని శ్యామచరణుడను
నాదని యేది లేదను నిజము
తెలుసుకోలేని శ్యామచరణుడను
llఆనందామృతll
(08.06.1986. ఆది, రా.11.11 గం. నుండి రా.11.20 గం. వరకు)
Comments
Post a Comment