(244) 31 August (31.08.)

 శ్రీ శారాద శ్యామ సందేశం: 31 Aug

జాగ్రత్త! జాగ్రత్త! నీ కర్మలే వెనుతిరిగి నీ నెత్తినే పడతాయి. 

నీవు చేసిన కర్మల ఫలితములనే నీవు అనుభవించక తప్పదు.

Beware! Beware! Your deeds will backfire on you. 

 You must experience the results of your deeds.



244) గురుదేవ గురుదేవ గురుదేవరారా (31.08.)
గురుదేవ గురుదేవ గురుదేవరారా
కృప చూపి నా మనసు నిండుగా నుండరా 

1.భక్తితో నిను గొలచి తరియించ దలచితే
బలహీనమగు మనసు క్రింద మీదకు లాగు
నీ కృపయే లేకున్న నిన్ను కొలువగలేను 
నిన్ను చింతించుచూ నన్ను మరువగలేను
 llగురుదేవ ll

2.పారాయణము చేయ పరుగులెత్తును మనసు
పాడు సోమరితనము పడక మీదకు చేర్చు
జపము చేయగ ఎంతో ఆశపడు నా మనసు
తప్పింపచేయు నా నీచ సంస్కారము 
llగురుదేవ ll

3.దయజుపి కరుణించి దరిజేర్చు దైవమా 
నా శక్తి యుక్తులు నిరుపయోగములు
నీవు ప్రేమను జూపి నన్ను లాగకున్న 
శ్యామాదులకు శాంతి సౌఖ్యములు సున్నా
ll గురుదేవ ll
(19.01.1987 రా.11.30 గం.కు)

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)