Birthday Blossom Blissfulness

నాన్నఅమ్మల నుంచి నాలో నైరుప్యంగా 
నైతికత నింపిన నంద్యాల నాథ... 
పరోక్షంగా పరమానందానికి ప్రీతి ప్రతి 
పాటలతో పరవశింపజేసిన ప్రత్యక్ష ప్రసాదం 
సాయి సన్నిహిత శ్యామ సామ్రాట్.... 

శ్యామ్ చరణ్ బాబా 🙏🙂🙏

సాయి సహవాసంతో సమాధానాలు సాధించి
సత్సంగ సంగీత సాహిత్యంతో సాధారణ స్థాయివారికి 
సంసార సాగరం సర్వేశ్వరునిలో సంగమం సేయుటకై 
సాధన సేతువును స్థాపించిన ‌
సాయి శిష్య శ్యామ గురు "శ్యామ్ చరణ్ బాబా" 

💭 ⚖️ 🙂📝 (💎)
Bharghav Shyam
--------------------------
We fondly remember our Pujya Guruji Sri Shyama Charan Baba who was the guiding light for his disciples. We are blessed by his inspiring talks. We respectfully remember Baba on his birthday today. 
-Sama Rao-
-----------------------------
మీరు లేరన్న వెలితి మాకసలులేదు
మదిలోన శివజ్యోతి మీరై వెలిసితి రి గాన!
మీ నా మము మీధ్యానము. మీరు మాకురక్ష!
శరణు నీవంటిమి సద్గురు శ్యామ చరణా!
--సీత రామ శర్మ-
-----------------------------
Rama Krishna Swami 
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మాత్రే నమః
పరమం పవిత్రం బాబా విభూతిం
పరమం విచిత్రం లీలా విభూతిం
పరమార్థ ఇష్టార్థ మోక్షాప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి
శ్యామావిభూతిం ఇదమాశ్రయామి.
శ్రీ శ్యామచరణ సద్గురు మహరాజ్ వారి జన్మ దినము మనందరికీ ఎంతోపుణ్యప్రదము వారి అనుగ్రహ అమృతమును పొందిన/పొందుతున్న/అలానే కొనసాగే ఈ అమృత ఘడియలలో  
*తేరా తేరే‌అర్పణ్ మేరా క్యాలావు* 
*దారి చూపిన గురువరా నీకేమి సేవలు సేతురా*
సద్గురు దేవతా మీది మీకే‌ అర్పిస్తున్నాను నాది ఏమున్నదని తేను అన్నారు సద్గురుదేవులకంకితమయిన మహనీయులు.
అటువంటి సద్గుపరమాత్మ తన చల్లని నీడలో అమోఘ కరుణా సముద్రంలో మనలందరినీ ఎప్పుడో ఎక్కడో అని అనుకోకుండా ఎవరి అర్హత యోగ్యతలను బట్టి వారి వారికి మనస్సు లో కొదవలేకుండా ఎవరికి వారికే తాను/తానే సొంతమయి పాటలేనా పద్యాలేనా అమృత మీరు ఉపదేశాలేనా
  *సకలశాస్త్ర నిగమాగమ సారం*
లా నింపి మనలందరినీ ఎంతో ధన్యులను చేసిన/చేస్తున్న ఆ శ్రీశ్యామ చరణ సద్గురుదేవుల దివ్య పాదారవిన్దములకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములతో
నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును
నితాంతాపార భూతదయయును
తాపసమందార నాకు(మాకు) దయసేయగదే అని ప్రార్థించి
వారి అడుగు జాడలలో నడిచే శక్తిని అనుగ్రహించమని వేడుకుందామా!
బాబాజీ ఎప్పుడూ అనేవారు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటున్నదే నీవే దాన్ని అందుకో ఉపయోగించుకో... అంటూ
"శ్రీశారదరమణ శ్రీశ్యామచరణ సద్గురు మహరాజ్ కీ జై"
----------
పరమం పవిత్రం బాబా విభూతిం
ఆ తండ్రి విభూతి‌ అనగా వారి అనుగ్రహము ఎంతో పవిత్రమైది 
(విభూతి భస్మం అనికూడా కదా
ఏవస్తంవైనా తగలబడి తగలబడి బూడిదగా మారుతుంది ధరిస్తే తెల్లగా ఉంటుంది కదా తనని ఆశ్రయించిన వారిని కర్మలను భస్మీభూతం చేసే అవ్యాజ కరుణామూర్తి ఆసద్గురు పరమాత్మ)
*పరమం విచిత్రం లీలా విభూతిం*
ఎంతమంది తననాశ్రయించిన వారికి(ఆశ్రయించని వారికీ కూడా) లిలా విభూతి ఎంతవిచిత్రంగా అనుభవిపజేస్తారో ఆ సద్గురు పరమాత్మ.
*పరమార్థ ఇష్టార్థ మోక్షాప్రదాతం*
కేవలం మోక్షమే కాదు ఇహములో కావలసినవీ సమకూర్చుతూ వాటినుంచి విడివడజేసే దాత, పరమకృపాళువు ఆ సద్గురు పరమాత్మ.
అటువంటి పరమార్థము ఇష్టార్థము లతో మోక్షాన్ననుగ్రహించే సద్గుపరమాత్మను ఆశ్రయించి ధన్యత చెందుదామా.
--------








Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)