Posts

Showing posts from December, 2022

31 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: నిన్ను నీవు తెలిసికొనదలతువా? పరిపూర్ణమైన ప్రేమగా మారిపో, అంతట నీవు నిన్ను కనుగొందువు. దేవుని ప్రేమించు, పరులను సేవించు. Do you want to know yourself? Change to perfect love and you will find yourself. Love God, serve others. (31 Dec)

30 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 30 Dec శారీరక మానసిక బలహీనత ప్రమాదకరం, శ్రద్ధతో భగవంతుని ప్రార్థించు ఆయన నీ రక్షణకు రాగలడు. గతాన్ని మరచిపో, భవిష్యతుకు ప్రణాళిక వేసికో, నీవు మహాత్ముడవు కాగలవు. Physical and Psychological weakness is dangerous, pray to God diligently and He will come to rescue. Forget the past, plan for the future, you can be great. 

29 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 29 Dec దైవ కృపలేనిదే నీవు ఏమీ సాధించలేవు. కనుక ఆయన అనుగ్రహం కొరకై హృదయ పూర్వకంగా ప్రార్థించు. అందుకు అనుగుణంగానే ఆయన ప్రతిస్పందన ఉంటుంది. Without divine grace you can achieve nothing. So pray whole heartedly for His grace. His response will be accordingly. 

28 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 28 Dec ఆత్మ నిగ్రహం గల వ్యక్తి 1. క్షమా గుణం 2. సాధుస్వభావం కలిగి ఉంటాడు. ప్రార్థన దేవుని మార్చదు. "ప్రార్ధన" చేసే వారినే మారుస్తుంది. One with self restraint is has  1. Forgiveness 2. Holy Nature.  Prayer does not change God. It changes those who “pray”. 

27 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 27 Dec  సమగ్ర దైవ భక్తిలోనే అత్యున్నత స్వేచ కూడి ఉంటుంది. నీ సాధనను దైవంతో ఆరంభించి, దైవంతోనే ముగించు In the inclusive devotion towards God, the highest freedom is found. Begin your practice with God and end with God. 

26 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 26 Dec సృష్టికర్తయైన దేవుడు మన తల్లి కనుక, ఆయన్నే సుఖంలోను, దుఃఖంలోను నిష్కపటంగా, నిలకడగా అర్ధించు. God, the Creator, is our mother, express Him sincerely and steadfastly in happiness and sorrow.

25 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 25 Dec దైవనామం విశ్వాసంతో ప్రతిరోజు త్రికాలాల్లోను చప్పట్లు చరుస్తూ బిగ్గరగా పలుకు అది నిన్ను చక్కగా మలుచును. Everyday in the three quarters, Loudly by clapping praise the name of God and it will make you feel good. 

24 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 24 Dec సవ్యమైన భావాలను కలిగివుండు. దానివల్ల నీ జీవితం అన్ని విషయాల్లోనూ విజయం పొందగలదు. దేవుని ప్రార్థించు ఆయనకు పూర్ణ శరణాగతుడవు కమ్ము, ఆ తర్వాత నీ పరీక్షలను నీ సమస్యలను ధైర్యంగా ఎదుర్కో. Have the sense of decency. In that way you will be successful in all aspects in life. Pray to God and completely surrender to Him, then face your problems and challenges with courage. 

23 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 23 Dec ఎవని మనస్సు, వాక్కు, పరిశుద్ధమై అతని అధీనంలో ఉంటాయో అతడు వేదాంత ఫలాలను పొందుతాడు. మహాత్ముల చరిత్రలు మనలను మంచి బాటలో నడిపి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి.  Whose mind, words are under his control and pure. Those get the fruits of Theology (Vedanta). Studying the histories of the Divine People (Mahatmas) guide us on a good path and impart knowledge. (Vedanta is Upanishads, fruits of is of Non-Duality/Uni State). 

22 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 22 Dec నీ అనుభూతులను, ఆవేశాలను, అణచవద్దు, ఎవరి వద్ద నీవు స్వేచ్చగామనగల్గుదువో ఆయనతో హృదయంలోని భావాలను పంచుకో. Don't suppress your feelings, your anger, share your feelings with whom you feel free. 

21 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 21 Dec విశ్వాసంతోను, సహనంతోను మనం వేచివుండగలిగితే, మహాత్ములయెడ, పెద్దలయెడ, గురువులయెడ మనము చూపు వినమ్రపూర్వక గౌరవములు, మన పరిశుద్ధ భావములు, మనశరణాగతి, సరైన సమయంలో మనకు అనిర్వచనీయమైన ఆనందానుభూతిని గలుగజేస్తాయి. If we will wait with faith and patience,  Our humble honors, our surrendering and our pure perceptions we show to sages, elders, Guru will give us indescribable blissfulness at the right time. 

20 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 20 Dec  భౌతిక వస్తువులను ధనంతో పొందవచ్చు కాని దివ్యానుభూతి ఒక్కరుగ మాత్రమే పొంద వీలగును. Material things can be obtained with money, but the divine feeling can be obtained by one only. 

19 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 19 Dec ఆత్మ విశ్వాసం కలిగివుండు, నీ గురువు యొక్క మార్గదర్శకత్వంలో ధైర్యంగా సరైన మార్గంలో సాగిపో. Be confident, walk boldly on the right path under the guidance of your Sri Guru. 

18 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 18 Dec దైవానుగ్రహాన్ని అనుభవించడానికై నీకై నీవు శరణాగతితో ఆదైవ ఉపకరణంగా అనుభూతినొందు. అప్పుడు దైవంలేక గురు సేవకునిగ - నీకు, నీ అభిప్రాయములకు, నీకార్యాలు మొదలైన వానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉండదు. ఆ అనంత శక్తి సలహాలను నిరంతరం అన్ని విధాల విధేయతతో అనుసరించడం ఒక్కటే నీకు మిగిలివున్న స్వేచ్ఛ. In order to Enjoin in the Divine Euphoria, Surrender yourself and experience as a divine tool. Then as God/Guru servent, You have no freedom for you, for your opinions, your deeds, etc. The only freedom you have left is to constantly follow in those infinite power suggestions obediently in all ways. 

17 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 17 Dec నీ గురువు నీతోవుంటున్నాడని భావించి సాధనలో ధైర్యంగా ముందుకు సాగిపో. Feel that your Guru is with you and confidently move forward in the practice. 

16 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 16 Dec ఈ దివ్యసందేశాలను ఆసక్తితో అధ్యయనంచేస్తూ వాని అంతరార్ధాన్ని అవగాహన చేసికొను శక్తిని ప్రసాదింపుడని గురువును ప్రార్దించు. Study the divine messages with interest, and Pray the Guru to get power of understanding the intuition of it. 

15 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 15 Dec కర్తవ్య కర్మలన్నీ నీ గురువే నీకు అప్పగించారనీ, ఆయన నిరంతరాయంగా నిన్ను కనిపెట్టుకొని వుంటున్నారని భావించు. Assume that all the duties are given to you by your Guru and he is constantly watching over you. 

14 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 14 Dec మన జీవితాలు దైవ సంకల్పంతో నడపబడ్డవి కనుక మన కోర్కెల మేరకు, మన సంకల్పం మేరకు, మన భావాల మేరకు నెరవేరాలని కాంక్షించకు. Our lives were driven by divine will, so we do not wish to fulfill our life, according to our desires, according to our will, according to our feelings. 

13 December

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 13 Dec 1. అనుకున్నది నిజమని భ్రమించక నిజమేదో తెలుసుకో. 2. ఇష్టమైన దానికి దూరము గాక తప్పదు. అఇష్టమైన దానిని అనుభవించక తప్పదు.  3. దేనిని అసహ్యించుకున్న, ద్వేషించిన ఏదో ఒక నాటికి వాటిని అనుభవించక తప్పదు. 4. మనసే మనిషికి ప్రధమ శత్రువు. 5. సచ్ఛీలమే సర్వేశ్వరుని తెలుసుకొను మార్గము చూపగలదు. 1. Do not assume that what you think is true, but know the truth 2. You have to get away from what you like. You have to experience what you don't like. 3. Whatever one disgusts, that one has to experience that disgust someday. 4. The mind is Human's first enemy. 5. Only Good Character can show the way to know the Almighty

12 December

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Dec ఈ నెలలు చాల విశేషమైనవి. పవిత్రమైనవి. ఫిబ్రవరి వరకు తలచిన ఉద్దేశాలు పలు ఫలితాలనిస్తాయి. దయచేసి మీ సంకల్పాలను, చర్యలను, నిర్మలంగా వుంచుకొండి. దైవంతో గాని గురువుతోగాని సత్సంబంధాన్ని ఏర్పరచుకోండి. భవిష్యత్తుకు పథకం వేసికోండి, అవసరమైన సద్గుణాలని సంతరింపచేసికోండి, తల్లిదండ్రులను మరువకండి అందరిని సేవించండి. These months are very special and sacred.   Intentions that are set up until February will yield many results. Please keep your intentions, actions, serene. Establish a happy relationship with God or Guru. Plan for the future, cultivate the necessary virtues, do not forget the parents and serve everyone. 

11 December

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: నిన్ను నీవు ఎన్నటికీ చులకన చేసుకొనకు, దైవ సూచనలను పాటించు, నీ అంతర్వాణి ప్రభోధాన్ని ఆలకించి నడచుకో, నీవిధులను సక్రమంగా నిర్వర్తించు. నీ భావాలను అశాశ్వత విషయాల నుండి మరల్చి శాశ్వత విషయాలపై నిలుపు, సర్వులు దేవుని బిడ్డలే, ఎవరు ఎవరిని శాసించ జాలరు, తటస్థ పద్ధతి ఉత్తమమైనది. మనం దైవానుగ్రహానికి, బ్రహ్మానందానికి పాత్రులం కావాలి. సత్యము, సహాయ స్వభావము, మాతా పితరుల సేవ, పరుల దోషాలు మన్నించి మరచుట, అనేవి దైవగుణములు. Never underestimate yourself, obey God's instructions, listen to your intuition and go, and perform your duties properly. Turn your feelings away from the impermanent and hold on to the eternal. All are children of God, No one can judge anyone, neutral method is the best.We all should be part of God's grace and bliss. Truth, helpful nature, service to parents, forgiving and forgetting the faults of others are the divine qualities. 

10 December

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Dec సత్సంగము (నిజమగు సత్పురుషులతో వుండటం) నిరంతర భగవన్నామ జపము, ప్రేమతో దైవాన్ని రూపముతోగాని, రూపము లేకుండా గాని పూజించడం త్వరగా తరించడానికి మార్గములు. Good Companionship (being with true virtuous men), Constant Chanting of divine name, With Love worshiping God, with or without form, is a quick way to emancipation. 

9 December

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 9 Dec ఏకాగ్ర హృదయంతో అచంచలంగా నన్ను ఎవరైతే స్మరిస్తూ ఆరాధిస్తారో, వారికి నేను రక్షణ పొందే శక్తిని ప్రసాదిస్తాను. If you admire me with progressive concentrated heart I will grant them the power of protection. 

8 December

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Dec దేవుడు గొప్ప దయాళువు. దైవ ప్రార్ధన మన అర్హతను బట్టి ఆయన సంకల్పాన్ని బట్టి మంచి ఫలితాలనిస్తుంది. ఉత్తమ ప్రార్ధన అత్యంత శక్తివంతమైన ఆయుధం. కనుక నిర్భయంగా ఎంతటి కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొ. God is Great Kind-hearted. "Prayer gives good results according to Our eligibility and His will. The prayer is the most powerful weapon, so bravely face any difficulty with courage. 

7 December

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Dec లోక విషయాలయందు మనకు ఆసక్తి నశించి, భగవత్ ప్రీతికరములగు కార్యక్రమముల యందు ఆసక్తి జనించినపుడే మనకు బాగుపడే అవకాశము కలుగుతున్నదని గ్రహించాలి. We should realize that there is a chance to recover when we lose interest in worldly affairs and are interested in God's activities. 

6 December

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Dec వ్రాసినదానిని, చదవడం వలన, వినడం వలన మన పరిమిత బుద్ధికి తోస్తుంది కొంత. అది మాత్రమే నిజం కాదు. నిజమేమిటో అనుభవజ్ఞుల వలన, శ్రీగురుని సన్నిధిలోన మాత్రమే అనుగతమౌతుంది. అవగాహన ఆచరణ రూపం ధరించినప్పుడే ఆనందమును అనుభవించడం తరించడం సుసాధ్యము. By reading and listening to what is written, pushes the intellect limitedly. That is not the only truth. The truth will be perceived only by the veterans, in the presence of Sri Guru. It is possible to experience happiness only when awareness is applied to practice.

5 December

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 5 Dec లోక కోరికలను, ఆశలను కొనసాగనివ్వక ఆనందాన్ని ప్రసాదించే పరమాత్మునికి సంబంధించిన కార్యక్రమములలో మనస్సును లగ్నం చేస్తే శ్రీ గురుని కృప అనుభవమునకు వస్తుంది. Without perpetuate the desires and hopes of the world. Engage the mind in activities related to the Supreme Lord, which bestows happiness. then you will experience the grace of Sri Guru. 

4 December

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Dec త్రుప్పును లేదా మైలను తుడిచివేసి మెరుగు పెట్టే "పాలిష్" ప్రతి దానికి ఉంది. అలానే హృదయానికి ఆ “పాలిష్” దైవ స్మృతి. Each has its own "Polish" that wipes away rust or dust. Like all things Heart also "Polish" that is "Divine memory". 

3 December

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 3 Dec వద్దనుకున్నా, విదలించినా, వదలించుకుందామనుకున్నా తప్పించుకోలేక తలకు, కాళ్లకు చుట్టుకున్నట్లు ఉండే స్థితియే ప్రారబ్ధము. శ్రీ గురుని కృపతో (శరణాగతి చెందిన వారి విషయంలో) ఆ ప్రారబ్ధము కూడ దగ్ధమై పోతుంది. (అనేక రీతులలో).  Fate is the state of being wrapped around the head and legs, unable to escape, whether you want to let go, or want it to let go.  By the grace of Sri Guru (in the case of those who surrendered) that fate also gets burnt.  (in many ways). 

2 December

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 2 Dec అనవసరమగు ఆలోచనలే అశాంతికి కారణములు: గతించిన దానిని గురించి, భవిష్యత్తును గురించి గానీ ఆలోచించక, వర్తమానాన్ని గురించి ఆలోచిస్తూ చేయవలసిన కార్యక్రమాన్ని త్రికరణ శుద్ధిగా చేస్తూ గతాన్ని, భవిష్యత్తును శ్రీ గురునికి అప్పగించి, వర్తమానంలో శ్రీ గురు స్మరణతో జీవించడమే శాంతికి, ఆనందమునకు మార్గములు: తృప్తి అపారమగు శాంతికి నిలయము. Unnecessary thoughts are the cause for disturbance: without thinking about past and future, think about present and work whole heartedly. Submit your past and future Sri Guru. In present live with Sri Guru's memory. This is the pathway to endless peace and satisfaction 

1 December

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 1 Dec అంతా దైవం మీదే ఆధారపడివున్నదన్నట్లుగా ప్రార్ధించు. అలానే అంతా మనిషి మీదే ఆధారపడివున్న అన్నట్లుగా శ్రమించు. నమ్రత కలిగి ఉండు. నీ ప్రార్ధన అన్ని అడ్డంకులను చీల్చుకొని భగవంతుని చేరుతుంది. Pray as, everything depends on God. And work as everything depends on you. Be humble. Your prayer breaks every obstacle and reaches God.