(3) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (51 నుండి 75)
51) శరణు శరణు రఘు రామా
52 ) శరణం శరణం శ్రీ శ్యామ చరణం
53 ) పావన గుణ నామ హరే
54) హరి నారాయణ, హరి నారాయణ
55) వందనం వినాయకా.....
56) అంబా భవాని జగదంబ భవాని
57) గోవింద గోపాల నీలమేఘశ్యామ్
58 ) ప్రబోవేగ రావా ప్రేమ స్వరూప
59) అవధూత చింతన గురుదేవ దత్త
60) ఆత్మా రామ ఆనంద రమణ
61) భగవన్నామమే తరుణోపాయము
62) గురుదేవా జయదేవ సాయి దేవా దయామయా
63) ప్రభో సాయి రామ రావా.....మమ్మేలు కోరా
64) ఇది ఏమి ఆటరా తండ్రీ ! ఇది ఏమి వేడుక దేవా!
65) గురుదత్త దిగంబర తవ శరణం
66) పాహి పాహి యనుచు నీదు
67) రమణ రమణ భగవాన్
68) అత్రి నందన అనసూయత్మజ
69) సాయి నామమను మధురామృతము
70) సాయి నన్ను బ్రోవ భారమా
71) ఏ ప్రాంత మందున జనన మందితివో
72) దయ చూపి ప్రేమతో దరి చేర్చుకోవా!
73) ప్రేమ ముదిత మనసె కహో సాయిరామరాం
74) శ్రీకరా ! శ్రీ షిరిడీశ్వరా
75) అవో సాయి నారాయణ దర్శన దియో
51) శరణు శరణు రఘు రామా
శరణు శరణు రఘు రామా సాయి రామా.
సాయి దత్త గురు నామా సద్గుణ సాయి ధామా ప్రభో సాయిరామా
సాయి సాయి యని స్మరియించిన చాలు
సకల పాపంబులే సమసి పోవు
సాయి సద్గురు కరుణే సదా తోడు నీడయై
గాచి రక్షించి ప్రేమ మీర బ్రోచు గాదా
సకల దైవ స్వరూపములు సాయియే
సకల ప్రాణి స్వరూపములు సాయియే
ఎవ్వరెటుల గొలిచినా ఎవ్వరెటుల పిలచినా
ఆలకించి సర్వము సమకూర్చు గాదా.
52 ) శరణం శరణం శ్రీ శ్యామ చరణం
శరణం శరణం శ్రీ శ్యామ చరణం హృదయా భరణం సంకటహరణం శరణం శరణం శరణం శరణం గురుదేవా నీ గుణముల త్రోవ నిత్యము నడువా శక్తినీయవా॥2॥ మహదేవా నీ మహిమను కొలువ
వాక్కు నొసగవా ప్రేమ చూపవా
నీవు నిండిన మనసు కెన్నడు చేటేరాదయ్యా నిన్ను నమ్మిన బ్రతుకు ఎప్పుడు లోటేరాదయ్యా కామ క్రోధ మద లోభ హరణమౌ దివ్య స్మరణం శ్రీ శ్యామ చరణం శ్రీ శ్యామ చరణం ॥శరణం శరణం॥ రాగ ద్వేషమే పదముల పూజ చేసి తరించ కరుణించవయ్యా దివ్య తేజ నీ దర్శన కాంక్ష భవముల తీర్చ మన్నించవయ్యా నిరతము నిన్నే భక్తిని కొలిచితి దయ చూపగ రావా సతతము నీకై తపమునరించితి నన్ను బ్రోవగ రావా ధర్మ ,అర్థ ,కామ ,మోక్ష ,మంత్రమౌ దివ్యస్మరణం శ్రీ శ్యామ చరణం శ్రీ శ్యామ చరణం ॥శరణం॥
53 ) పావన గుణ నామ హరే
పావన గుణ నామ హరే పరమ దయా నిలయా హరే మాయా మానుష రూపా మాయాతీత మంగళ ధాత వేదాంత వధూ హృదయ విహారా వేదమయా పరమానంద రూప॥ పావన॥ కరుణారస భర నయనా
దరహాస మనోహరవదనా నవ తులసీదల మాలా భరణా నానా జీవన నాటక కారణ॥ పావన॥
54) హరి నారాయణ, హరి నారాయణ
హరి నారాయణ, హరి నారాయణ, హరి నారాయణ గోవిందా॥॥ అచ్యుత, కేశవ, మాధవ, మురహరి హరి నారాయణ గోవిందా ॥ హరి ॥ వామన, నృసింహ, జనార్ధన, శ్యామ హరి నారాయణ గోవిందా ॥హరి ॥ భక్తి ప్రదాతా , ముక్తి ప్రదాత , హరి నారాయణ గోవిందా ॥హరి॥
55) వందనం వినాయకా.....
56) అంబా భవాని జగదంబ భవాని
57) గోవింద గోపాల నీలమేఘశ్యామ్
గోవింద గోపాల నీలమేఘశ్యామ్ నీల మేఘశ్యామ భజో సాయి గణేష్ శ్యామ్ సాయి గణ శ్యామ్ మేర సాయి గణ శ్యామ్ మురళీమనోహర సాయి గణ శ్యామ్ గోవింద హరి గోపాలహరి గోవర్ధన గిరిదారి శ్యామ సుందర మదన మోహన బృందావన సంచారి
58 ) ప్రబోవేగ రావా ప్రేమ స్వరూప
59) అవధూత చింతన గురుదేవ దత్త
అనసూయత్మజ దిగంబరా
60) ఆత్మా రామ ఆనంద రమణ
61) భగవన్నామమే తరుణోపాయము
అందురు కామాదులలో పరిభ్రమించుచు
అశాంతితో కూడా తోడ జీవించు వారికి ॥భగవన్నామమే ॥
62) గురుదేవా జయదేవ సాయి దేవా దయామయా
గురుదేవా జయదేవ సాయి దేవా దయామయా విభూతి సుందర శశాంక శేఖర॥2॥
సాయి శంకర దయాకరో॥2॥ దయాకరో దయాకరో దయాకరో ప్రభు దయాకరో సాయి శంకర దయాకరో॥ గురుదేవా జయదేవ ॥ గోపిక రంజన సాయి గోపాల రఘుకుల తిలక సాయిరామ దీన జనావన దయాకరో ప్రభు దయాకరో దయాకరో దయాకరో ప్రభుదయాకరో ॥గురుదేవా జయదేవ॥
63) ప్రభో సాయి రామ రావా.....మమ్మేలు కోరా
ప్రభో సాయి రామ రావా.....మమ్మేలు కోరా షిరిడి నివాసా శ్రీనివాసా॥ ప్రభు॥ తల్లివి నీవే తండ్రివి నీవే గురువు దైవము నీవే రాముడు నీవే కృష్ణుడు నీవే దత్తమారుతి నీవే శివ నాగ సాయి నీవే శ్యామ సాయి నీవే జయహో సాయిశా.... జయహో సాయిశా .....॥ప్రభొ॥ నీవే దిక్కని నిరతము నమ్మి కొలిచే వారము దేవా కరుణను చూపి కడదేరిడి మార్గములను చూపగా రావా రంగనాథ సాయి నీవే రామదాస నీవే జయహో సాయిశా ....జయహో సాయిశా....॥ ప్రభో॥ సుఖదుఃఖములకు చెదరని మనసును కరుణనొసంగుము స్వామి సద్భక్తులమై నీ పద సన్నిధి చేరగ చేయుము స్వామి మము దయ గనవే సాయి ద్వారకామాయి ఈశ మహేశా సాయి నటేశా శామసన్నుతా॥ ప్రభు॥
64) ఇది ఏమి ఆటరా తండ్రీ ! ఇది ఏమి వేడుక దేవా!
ఇది ఏమి ఆటరా తండ్రీ ! ఇది ఏమి వేడుక దేవా!
ఇటు నటు నూపుచు అటు నిటు జేర్చక ఆడించుచున్నావు సాయి.... ॥ఇది ॥
భక్తితోడ నిన్ను తలచ దలంచిన భవ బంధములు బంధములాయెను నీదు లీలలను గానము జేయగా నెంచిన నా మది నిలువక పోయెను లోకవాసనల వ్యామోహములతో మంచి చెడుగుల విచక్షణ లేక గుడ్డివానిగా బతుకుచు నుంటిని పిచ్చివానిగా వాగుచు నుంటిని ॥ఇది॥ పరబ్రహ్మమే నీ వనెడి నిజము పరిపూర్ణముగా తెలియగ నైతిని బాధ్యతలను భరియంచెడి నిన్ను భక్తిగ నెపుడు గొలువ నైతిని సర్వము నీదని అనుకొనుచు నాది యనుచునే భ్రమ పడుచుంటిని జ్ఞానము నొసగక శ్యామను ఈ భువి అవివేకముతో బ్రతుకగ జేయగా ॥ఇది॥
65) గురుదత్త దిగంబర తవ శరణం
గురుదత్త దిగంబర తవ శరణం దత్త దత్తా దిగంబర తవ శరణం గురుదత్త దిగంబర తవ శరణం సాయి దత్తా దిగంబర తవ శరణం॥గురు॥ అత్రిసుత అనసూయ నందన
యోగిరాజ గురు తవ శరణం ॥గురు॥
శ్రీపాద శ్రీవల్లభ యతివర
నరసింహ సరస్వతి తవ శరణం ॥గురు॥
కార్తవీర్య గుత్తి ముక్తి ప్రద పింగళ పూజిత తవశరణం ॥గురు॥ ఘోరక గర్వ వినాశక దత్త
అవధూత నిరంజన తవ శరణం॥ గురు॥ హీన దీన తారక పురుషోత్తమ
వాసుదేవ గురు తవ శరణం ॥గురు॥ ఏకనాథ జనార్ధన స్వామి
అక్కలకోట గురు తవశరణం॥ గురు॥ పూర్ణ పరాత్పర సగుణ గుణేశ్వర
నిరాకార గురు తవ శరణం ॥గురు॥ నారాయణ భైరవ మాణిక్య ప్రభు
రంగతార గురు తవ శరణం॥ గురు॥ నీలకంఠ ఆలమ బకనూరి
సాయినాథ గురు తవశరణం॥ గురు॥ దాసోపంతు యవన నుఁప
తారక సిద్ధ సరస్వతి తవ శరణం ॥గురు॥
66) పాహి పాహి యనుచు నీదు
పాహి పాహి యనుచు నీదు వెంట నేను
బడుచు నుండ పారిపోవనుంటివా సాయి
దేహి దేహి యనుచు నిన్ను కోరికలతో
దేవురించ రాలేదు లే నేను సాయి..... సాయి.. బాబా... బాబా ...సాయి... కామ క్రోధ లోభ మోహ మద మత్సరముల
వలలో చిక్కి నిన్ను వేధింతునా సాయి .... నీకోసమే నిన్ను నేను ప్రేమించి సేవించు
భయము లేదనుచు సాయి సాయి ...
బాబా ....బాబా.. సాయి...
ఎంతటి కష్టములనైన భరియంచెడి
శక్తి నొసగి కృప చూపి బ్రోవుమా సాయి అంతట నీవు నిండి ఉన్నావను
సత్యమును శ్యామ హృదయ చేయుమా సాయి...
67) రమణ రమణ భగవాన్
రమణ రమణ భగవాన్ రమణ రమణ రమణ
రమణ రమణా యనరే॥ మరణ మనిన చింతించే
మనసును గనరే
మాయ మనసును గనరే మన మనసును గనరే॥ భగవాన్ రమణ రమణ
రమణ రమణ రమణా యనరే ॥
నేనెవరని పరికించెడి మార్గము
గనరే దివ్య మార్గము గనరే
రమణ మార్గము గనరే సులభ మార్గము గనరే సాయి మార్గము గనరే ॥ నేను నీవు నశించెడి భావము గనరే సద్భావము గనరే సాయి భావము గనరే రమణ భావము గనరే రమణ రమణ రమణ రమణ రమణాయనరే॥ ప్రారబ్దము నడిపించెడి తీరును గనరే లోకతీరును గనరే లోకేశ్వరు సేవించడి పదమును గనరే దివ్య పదమును గనరే రమణ రమణ భగవాన్ రమణ రమణ భగవాన్ రమణ రమణ రమణ రమణ రమణాయనరే ॥ అరిషడ్వర్గములు వర్గములు
జేయు వింతలు గనరే
వింత వింతలు గనరే వింతల నశింపజేయు చరణము
గనరే రమణ చరణము గనరే శ్యామాదులు సేవించడి
చరణము గనరే రమణ చరణము గనరే॥ రమణ రమణ భగవాన్ రమణ రమణ భగవాన్ రమణ రమణ రమణ రమణ రమణాయనరే॥
68) అత్రి నందన అనసూయత్మజ
అత్రి నందన అనసూయత్మజ
శ్రీ గురుదేవా దత్త గురూ...
దత్త గురు దత్త గురు
దత్త గురు దత్త గురు అవధూత నిరాకారి
దత్త గురు త్రిభువనాధ కేళి...
త్రిమూర్తి రూపా త్రిగుణాతీతా
దత్తాత్రేయ గురు దేవా .....
అవధూత నిరాకారీ
దత్త గురు త్రిభువనాధ కేళి ..... దిగంబరా దిగంబరా
దిగంబరా దిగంబరా.... శ్రీపాద వల్లభా
దిగంబరా దిగంబరా.... దిగంబరా దిగంబర
దిగంబరా దిగంబరా అవధూత చింతన
దిగంబరా దిగంబరా
69) సాయి నామ మను మధురామృతము
సాయి నామమను మధురామృతమును
గోలగ రండి జనులారా.........
శాంతి సౌఖ్యముల నందు కొనుచు
ఆనందము నందుడు జనులారా..... ॥ శ్రీ సాయి॥
దైహిక బాధల దాడి ఐరుంగని
స్థితిని చేరుడోజనులారా
లౌకిక వాంఛలను తప్పుకొని
స్థిరత్వమెందుడు జనులారా
స్థిరతను బొందుడు జనులారా॥ శ్రీ సాయి॥
కాంతా కనకపు కామమోహముల
వలలో బడకుడు జనులారా
శాంతి కొరకు శ్రీనాధుని మదిలో
చింతన చేయుడు జనులారా.... సాయి॥
ప్రగాఢమగు విశ్వాసము నోర్పుల
గలిగి యుండుడో జనులారా
బహు దుర్లభమగు ముక్తి పదమును
శ్యామచరణుని సూక్తులను ఆసక్తిగా
వినుడోజనులారా (ముందుగా దెలియుడు జనులారా)
(బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే) రాగం)
70) సాయి నన్ను బ్రోవ భారమా
సాయి నన్ను బ్రోవ భారమా
రామ సాయి నన్ను బ్రోవ భారమా
శివ సాయి నన్ను బ్రోవ భారమా
కృష్ణ సాయి నన్ను బ్రోవ భారమా
శ్యామ సాయి నన్ను బ్రోవ భారమా //సాయి//
మంచి చెడుగులను భేదము
మది నెంచక యుండుట నా నేరమా
సాయిరామ నన్ను బ్రోవ భారమా...
కామ క్రోధాదుల తోడను...
కలహించి జీవించుట నా నేరమా... ॥సాయి॥
దానధర్మంబుల జేయక
నీచ స్వార్థంబు నడతలు నా నేరమా... ॥సాయి ॥
ఈర్ష్య అసూయలతోడను
భక్తులందరినీ దూరట నేరమా...॥ సాయి॥
తప్పులన్నీ తెలిసి కృంగుచు
నీకు చెప్పుకొనుటయే నేరమా ...॥సాయి॥
మెప్పుదనముగా నే పొంగుచు
నా గొప్పదనము గోర నేరమా...॥ సాయి॥
చేయరాని పనులు చేసితి,
మరి వినగరాని మాటలాడితి నని ..॥సాయి ॥
శ్యామచరణుని నన్ను దూరము చేయకుమని
వేడుకొందును నిన్ను దైవమా ..॥సాయి॥
71) ఏ ప్రాంత మందున జనన మందితివో
ఏ ప్రాంత మందున జనన మందితివో
కులమేమో ? మతమేమో? నీదు పేరేమో?
తెలియగ లేరయ్యా ! రూప గుణ రహితా
రామ శివ మారుతి దత్త గురు సాయి...
పత్రి గ్రామము నందు జనన మందితి వంట
జమునా భాయ్ నందలాలు తనయుడవు నీవంట
బాల్యమునందే ఒక ముస్లిం ఫకీరు కడ
ప్రేమ వాత్సల్యముల పొంది పెరిగితివంట...
నీదు సంకల్పమున వేంకుసా గురుజేరి
శుశ్రోషలను చేసి కర్తవ్య మెరిగి
గురుని ఆజ్ఞల బొంది గోదావరిని చేరి
ఆ చెంతనే నున్న షిరిడీ చేరితివంట....॥ ఏ ప్రాంత॥
బాధితుల నందరిని బాగుపరిచితివంట
సద్భక్తులకు ముక్తి పథము నిచ్చితివంట
నమ్మి నిను జేరడి భక్తులందరగాచి
నిన్నే కొలుచు శ్యామచరణుని గాచి
రక్షించి బ్రోచుచు నిలిచి ఉన్నావంట ॥ఏ ప్రాంత॥
72) దయ చూపి ప్రేమతో దరి చేర్చుకోవా !
దయ చూపి ప్రేమతో దరి చేర్చుకోవా !
నీ పాదముల చెంత పడి ఉండనీవా!...
చాలు నీ సంసారము సాయిరామా !..
ఆదరించగ రమ్ము ఆత్మాభిరామ !..
శ్రీరామ రఘురామ శృంగార రామా
జయ రామ జయ రామ జానకి రామా...॥ దయ ॥
సంసారమును జేయ సకల వ్యామోహములు
బంధించి బాధించి కృంగజేయుచునుండె
ధర్మ మార్గములను తప్పించు చుండె
దైవ భావములను దరి చేర్చకున్నాయి..॥ దయ॥
సకల విశ్వమునందు నీవున్న గాని
చూడగలిగెడి శక్తి నాకు లేదయ్యా
అవతార రూపమే ఆరాధనము చేసి
అందుకో దలిచితినయ్యా నీ దీవెనలు ..॥దయ ॥
భక్తిశ్రద్ధల తెలియలేని మూర్ఖుడనయ్యా
నిష్ట సబూరులను నిలుపుకోలేనయ్య
పూజ చేయగలేని పరమ నీచుడనయ్యా
ప్రతితుడను నీ పాల బడితి నేనయ్య
నాకేమీ కావలెను నేనెరుగలేను
నేనేమి చేయదునో తెలియలేను
నీ పరము చేసుకొని నన్నేలుకోవా
శ్యామచరణుని నీలో కలుపుకోలేవా..॥ దయ॥
73) ప్రేమ ముదిత మనసె కహో సాయిరామరాం
ప్రేమ ముదిత మనసె
కహో సాయిరామరాం సాయి రామ రాం
సాయి రామ రాం
బాబా సాయి రామరామ్
పాపమిటే దుక్కకటే లేకె సాయినాం భవ సముద్ర సుఖ ధనావ ఏక్ సాయిరాం పరమ శాంతి సుఖనిదాన మంత్ర సాయి నామ్ నిరాధార కోవధార ఏక్ సాయి నామ్
పరమ గోపయ పరమ దివ్య మంత్ర సాయి నామ్ సంతహృదయ సదా వసతు ఏక్ సాయి నామ్ మాతా పితా బంధు సఖ సబ్ కి సాయి నామ్ భక్తజనర జీవన ధన ఏక్ సాయి నామ్
74) శ్రీకరా ! శ్రీ షిరిడీశ్వరా
శ్రీకరా ! శ్రీ షిరిడీశ్వరా ప్రేమగ నను గావరా ! సాయిశ్వరా! ॥శ్రీకర ॥ గురుడవు నీవని, దైవము నీవని, గురువే దైవమని, సత్య ధర్మము సత్పథ మర్మము తెలుపగా వేడితిమి
నీ నామామృత పానము చేయుచూ నీవే శరణమని పిలిచి పిలిచి నేను గొలిచి గొలిచి నేనలసిపోతిని రా దయను చూపి నీ దర్శనము నొసగి
హృదయ మందిరము నందు నిలువరా! పలుకరించరా ! ॥ శ్రీకర॥ నిష్ట సబూరుల శిక్షణ నొసగగ ఇక్కట్టుల కలిగించితివో ! సుఖదుఃఖంబులలో సమభావము కలుగునటుల కరుణించితివా మోహము నెప్పుడు కూల్చెదవో మోదమునెప్పుడూ కూర్చెదవో ఎటుల నీ దరికి చేర్చెదవో ఎప్పుడు నీలోన నిలుపెదవో నేనెరుగలేను రా శ్యామ సన్నుత సాయి॥ శ్రీకర॥
75) అవో సాయి నారాయణ దర్శన దియో
అవో సాయి నారాయణ దర్శన దియో
తుమ్ హో జగతికే త్రాతా !.....
తుమ్ హో భాగ్యవిధాతా....॥ ఆవో ॥
త్వమేవ మాతా పితా త్వమేవా
త్వమేవ విశ్వవిధాతా .....
త్వమేవ సర్వవిధాతా......॥ ఆవో॥
త్వమేవ బ్రహ్మ త్వమేవ
విష్ణు త్వమేవ శంకర రూపా........
త్వమేవ దత్త స్వరూపా ......॥.ఆవో॥
త్వమేవరామ త్వమేవ కృష్ణ
త్వమేవ షిరిడి సాయిబాబా......
త్వమేవ సత్య సాయి బాబా..... ॥ ఆవో ॥
Comments
Post a Comment