(7) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (151 నుండి 175)

  శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం - 6

1వ భాగం (1 నుండి 25): https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/1-01-25.html 
2వ భాగం(26 నుండి 50):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/2-25-50.html
3వ భాగం (51 నుండి 75):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/3-51-75.html
4వ భాగం (76 నుండి 100):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/4-76-100.html
5వ భాగం (101 నుండి 125):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/5-101-125.html
 6వ భాగం (126 నుండి 150):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/6-126-150.html
7వ భాగం (151 నుండి 175):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/06/7-151-175.html
 

7వ భాగం: 

151) శ్రీ సాయి నామములకు నిత్య జయ మంగళం
152) శిరిడి పురమున నీ శరీరమును దర్శించితినో లేదో
153) శ్రీకరా... శ్రీ శిరిడీశ్వరా
154) శిరిడీ వాసా దీన జనావనా
155) శిక్షయో - నీ శిక్షణ యో !

151) శ్రీ సాయి నామములకు నిత్య జయ మంగళం
శ్రీ సాయి నామములకు నిత్య జయ మంగళం
ప్రభు శ్రీ సాయి రూపములకు నిత్య శుభ మంగళం

1. శ్యామా తాత్యాలు, దీక్షిత్ నరసింహ,
దాసుగణులు కృష్ణా, భాగోజీ,
రాధాకృష్ణ మాయిలు గొలిచే //శ్రీ సాయి//

2. పురందర, విట్టలు, సాధే,
బడేబాబా, మహల్సాపతి, ఉపాసనీ,
మేఘశ్యాములు, నానా, నార్కెలు గొలిచే //శ్రీ సాయి//

3. నిమోన్కర్, బూటీ, దేవు,
హనుమ, సాంబ, పార్థసారథి,
కేశవయ్య, భరద్వాజ, బాలాసాహెబు గోలిచే //శ్రీ సాయి//

4. తారాబాయి, చంద్రా బాయి, మెహర్ బాబా,
కృష్ణా భాయి, ఉమాబాయి , ద్వారకామాయి
వరమ్మ, కళ్యాణి గొలిచే //శ్రీ సాయి//

5. భక్తిగ దైవమునే నమ్మి భజనలతో
కీర్తించుచూ సద్గురు దేవుని సత్ కృప గోరుచు
శ్యామదేవుడు సతతము తలచే //శ్రీ సాయి//

152) శిరిడి పురమున నీ శరీరమును దర్శించితినో లేదో
శిరిడి పురమున నీ శరీరమును దర్శించితినో లేదో
గడచిన జన్మలలో నీ సేవల జేసుకుంటినో లేదో
నేడు నీదు చిత్తరువును జూచుచు వేడు కొనుట - వినరాదా -

అంతటి భాగ్యము ఎన్నడు కలుగునో
ఎన్నడు నీదరి జేరుదునో యని నేడు

లోకులు పలుగాకుల వలె దూరగా
బాధల వలలు సంకెలలు బిగించగ
భవ భంధముల దిగ్భంధనమున
కుములుచు నిను శరణాగతి వేడితి // శిరిడి //

2. తల్లివి నీవై లాలించెదవు
తండ్రివి నీవై పోషించెదవు
సద్గురు నీవై నడిపించెదవు
దైవము నీవై దరి జేర్చెదవు // శిరిడీ //

3. నీ రూపమునే సందర్శించెడి
నీ పలుకుల నే విని పులకించెడి
నీ సేవలనే జేయ గలిగెడి
భాగ్యము నీయుము శ్యామ సన్నుత // శిరిడీ//

153) శ్రీకరా... శ్రీ శిరిడీశ్వరా
శ్రీకరా... శ్రీ శిరిడీశ్వరా
ప్రేమగ నను కావారా... సాయీశ్వరా‌//శ్రీకరా //

1. గురుడవు నీవనీ, దైవము నీవనీ,
గురువే దైవమని సత్యము ధర్మము
సత్పధ మర్మము తెలుపగ వేడిమి
నీ నామామృత పానము చేయుచు

నీవే శరణమని పిలచి పిలచి
నిన్ను కొలచి కొలచి నే నలసిపోయితిని
లేరా దయను చూపి నీ దరిశన మొసగి
హృదయ మందిరము నందు నిలువరా.. పలకరించరా //శ్రీకర //

నిష్ట సబూరుల శిక్షణ నొసగగ
ఇక్కట్టుల కలిగించితివా
సుఖ దుఃఖములలో సమ భావము
కలుగునటుల కరుణించితివా

మొహంబు నెప్పుడు గూల్చెదవో మోదంబు
నెపుడు గూర్చెదవో ఎటుల నీ దరికి జేర్చెదవో
ఎప్పుడు నీలోన నిలిపెదవో నే నెరుగ లేను రా
శ్యామ సన్నుతా... సాయి
//శ్రీకర //

154) శిరిడీ వాసా దీన జనావనా
శిరిడీ వాసా దీన జనావనా శాంతస్వరూపా సాయిరాం అభయ ప్రదాతా జ్ఞానప్రదాతా పావన చరిత సాయిరాం //శిరిడీ// 1. ఏసువు నీవే అల్లావు నీవే శివుడవు మాధవుడవు నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గురుడవు దైవము నీవే మాయా జనిత ముని జన సన్నుతా మహిత చరిత సాయిరాం //శిరిడీ// 2. నిన్నే మదిలో నమ్మిన వారికి కష్టము లుండవు ఎన్నడూ నీ నామము జపించు వారికి పాపము లుండవు ఎన్నడూ యుక్తి ప్రదాతా భక్తి ప్రదాతా ముక్తి ప్రదాతా సాయిరాం //శిరిడీ// 3 . సత్యము ధర్మము తొలగిన వేళ, పాపములు చెలరేగిన వేళ భువిలో నీవు అవతరించితివి, మానవ రూపము దాల్చితివి భవ భయ హర పాహి పరాత్పర పరమ దయాకర సాయిరాం //శిరిడీ//

155) శిక్షయో - నీ శిక్షణ యో !
శిక్షయో - నీ శిక్షణ యో !
పరిరక్షణయో సాయీ - ఇది నీ //శిక్షయో//

1. అక్షయముగ నీ అభయ ప్రధానము ఆశ్రితుల నెల్ల గాచుచు నుండగ
నీ రక్షణతో భక్తులెల్లరూ బ్రహ్మా నందము నందు మునుగుచు నుండగ
నీ శిక్షణలో సమర్థ సద్గురు దేవులెందరో 
లోకముల పాలించుచుండగ
మంద బాగ్యుడై మోహా వేశుడై మూర్ఖునిగా చరియించు వీనికిది //శిక్షయో//

2.  నీతినియమములతో చరియించాలని న్యాయ ధర్మముల నడయాడాలని
సకల విశ్వమున సాయిని చూచి సంతసమున సేవించ వలయునని 
కోరికలెన్నో ఆశలు ఎన్నియో అంత రంగమును అధివసించగా 
దేనిని చేయక ఎందుకు చెందక మూర్ఖునిగా చరియించు వీనికిది   //శిక్షయో//

156) అది దేవా అమర వినుత
అది దేవా అమర వినుత 
అప్రమేయం పాహిమాం.

అఖిలలోక సంచారకా 
వినాశనాశక రక్షమాం.

మంత్రరూపా మహా మోపేతా 
మూలధార పాహిమాం 

మహాదేవా మధురానాథా 
వినోద నాయక రక్షమాం

విశ్వరూపా విజ్ఞానదాయక 
విమల చరితా పాహిమాం

ప్రణవ రూప ప్రేమమందిరా 
ప్రాణ నాయక రక్షమాం

సామగాన విలోల శివ 
ప్రియనందనా గురు పాహిమాం.

శ్యామ వందిత శ్రీ గజాననా 
శ్రీ గురు ప్రభు రక్షమాం .!

Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)