(5) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (101 నుండి 125)

 శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం - 5
1వ భాగం (1 నుండి 25): https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/1-01-25.html 
2వ భాగం(26 నుండి 50):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/2-25-50.html
3వ భాగం (51 నుండి 75):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/3-51-75.html
4వ భాగం (76 నుండి 100):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/4-76-100.html
5వ భాగం (101 నుండి 125):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/5-101-125.html
6వ భాగం (126 నుండి 150):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/6-126-150.html
7వ భాగం (151 నుండి 175):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/06/7-151-175.html


5వ భాగం: 

101) సాయి రాముని భజన జేయండి

102) ప్రభో ఏసునాథా….. పరాకేలనయ్య

103)  హరి గురు నామమే

104) పవళించ ప్రార్థింతు పనగ శాయి

105) వైభోగము చూడగ రారండి


106) ఏమి కర్మముల జేసితినో

107) దయను జూపుమా సాయీ

108) దిక్కెవరు ఉన్నారురా 

109) ద్వారకా మాయీశా దరి జేర్చగా రావా

110) దయ గనవే సాయీ మమ్ముల


111) గురుదేవ గురుదేవ గురుదేవ రారా

112) కనుగొను మదిగో మనసా

113) రామ రామ యని రోమ రోమమున

114) ధుని ముందు కూర్చున్న సాయి

115) దయ రాదా? నీ దరికి చేర్చవా !


116) దత్త దిగంబర సాయి దేవా !

117) నీ పవిత్ర దివ్య సమాధి మందిరము నందు

118) నీ నామమే మాకు మంత్రము సాయీ

119) నీ సరి గలరా సాయీ

120) నిన్ను చూడని కనులేల


121) రామ నామము గానము ఎందున్న

122) నీదు లీలలు నేరుగ జాలను

123) సాయీ - రామా- రామా -కావ రావా

124) నీ పవిత్ర పద పద్మముల పైన

125) నిరామయా నిరంజనా నిర్గుణా


101) సాయి రాముని భజన జేయండి

సాయి రాముని భజన జేయండి …  ఓ భక్తులారా


సాయి నామామృతము గ్రోలండీ

సాయి రాముని భజన చేయుచు

సాయి నామామృతము గ్రోలుచు

సాయి సాయీ యని సతతంబు

సంతస మందు మునగగ ॥ సాయి॥


జన్మలెన్నియో గలవు తెలియండి

ఆ జన్మలందున మనిషి జన్మమే గొప్పదౌ నండీ

జన్మలెన్నియో గలిగి యున్ననూ

మనిషి జన్మమే గొప్పదనుచును

మరీ మరీ గుర్తించుకొని సద్గురుని పాదము లాశ్రయించుచూ ॥సాయి॥


భక్తిశ్రద్ధలు గలిగియుండండి

వినయంబుగా శ్రీ సద్గురువుల సేవ జేయండి

భక్తి శ్రద్ధలు గలిగియుండి వినయముగ

సద్గురుని సేవలు చేయుచుండెడి వారే

ధన్యులు, పుణ్యలు మహితాత్ములనుచును ॥సాయి॥


పేదలకు దానము జేయండి

కడు ఆదరంబున సాధువుల పోషణల జేయండి 

పేదలకు దానంబు జేయుచు సాధువుల పోషించు చుండిన

శ్యామదేవుని గాచు సాయియే సద్గతుల నందించగలడని  ॥సాయి ॥


102) ప్రభో ఏసునాథా….. పరాకేలనయ్య

ప్రభో ఏసునాథా….. పరాకేలనయ్య

దయను జూపి మమ్ము.. దరికి చేర్చవయ్యా ॥ ప్రభు ॥


నిన్నేరుగ లేక నింద మోపినారు

నిజము నెరిగి నంత నిట్టూర్చినారు

నీ ప్రేమయే దైవమై దారి జూపే ॥ ప్రభు ॥


జీవకోటి నెల చేర దీసినావు

పతిత మానవాళి నుద్దరించినావు

నీ ప్రేమయే జ్యోతియై దారి జూపె ॥ప్రభు॥


కృష్ణ రాము లీవే… క్రీస్తు మౌలా లివే….

శ్యామ సాయి వీవే….సద్గురుడ వీవే

ప్రభో కావరా.   వేగమే దేవ దేవా ॥ప్రభు॥

------

103)  హరి గురు నామమే

హరి గురు నామమే మధురము మధురము

 హరి గురు నామమే మధురాతి మధురము

 గురు దరిశనమున కదే సోపానము    || హరి గురు||


1.  హరియే గురుడట  గురుడే హరియట

 హరి గురువులకు బేధము లేదట

మానవాళిని ఉద్ధరించుటకు 

హరియే గురువుగ అవతరించునట ||హరి గురు||


2 . మానవ రూపమున నుండెడి గురువును

గుర్తించుటయే  బహు దుర్లభమగు నట

అహము వదలినచో హరియే గురుడను

సత్యము దెలుయుట సులభమగునట  || హరి గురు ||


3 . సద్గురు నామము స్మరియుంచుటకు

సద్గురు కృపయే కారణమగునట

శ్యామనాధుడగు సాయినాధుని 

కృపతో సర్వము సులభ మౌనట ||హరి గురు||


4 . పరులకు అపకారములను జేయక 

ఉపకారములను జేయుచునుండిన

 సర్వజీవులలో దైవము గలడని

 వినయము తో సేవించు చుండినను

 

శ్రీ హరి నామపు మధురము దెలియును

హరి గురు లొకటను అనుభవమగును || హరి గురు ||


104) పవళించ ప్రార్థింతు పనగ శాయి

పవళించ ప్రార్థింతు పనగ శాయి
శయనించ వేడెదను శ్రీ శేష సాయి || సాయి ||

పట్టు పానుపు మీద పరిమళము వెదజల్లు
మల్లె మాలతి జాజి సంపెంగలను బరచి
శ్యామ హృదయంబున అమరించి నాడయ్యా
శయనించి కరుణ శ్యామను ఏలవయ్య

భక్తులను రక్షించి బాధ్యతల భరియించి
ఆలించి లోకముల పాలించినావూ
అలసిపోయితివేమో దేవాది దేవా
శయనించి కరుణ శ్యామను ఏలవయ్యా

తెరవేయు తనలోని తెరలు తొలగించగా
పాదములు సేవించు మాయ తొలగించగా
అర్ర్చించు నీలోన తానైక్య మొందగ
ప్రార్ధించు ప్రేమ నీ విపుడు శయనించగ


105) వైభోగము చూడగ రారండి

వైభోగము చూడగ రారండి
శ్రీ సాయి రాముని వైభోగము
చూడగ రారండి ||

1 .సకల బాధలు సమసిపోవునట
సర్వజీవులకు శాంతి కలుగునుట
సకల దేవతల దర్శనమగునట
సంతస మంతట వెల్లివిరియునట

||వైభోగము చూడగా రారండి||

2 . షిరిడి గ్రామము నందు కనిపించి
ద్వారకమాయి నందు నివసించి
సకల జీవులను సమాదరించి
ప్రేమ రూపమై వెలసిన సాయి

||వైభోగము చూడగ రారండి||

3 . భక్తులందరికి అభయ మొసగుచు
బాధ్యతల నెల్ల తానే భరియించుచు

ఇహపర సుఖముల కరుణ నొసంగుచు
వాత్సల్యంబున గాచెడి సాయి
||వైభోగము చూడగ రారండి||

4. వెనుక వైపున ఒక చిన్న రథమును
కుడి వైపున తులసి బృందావనమును
మధ్యన భజనల భక్త బృందమును
ఎదురుగ సాయి కూర్చొని యుండెడి
||వైభోగము చూడగ రారండి||

5 . తాళ మృదంగ భేరి నినాదముల
సంతసమిడు సంగీత స్వరములతో
నిండిన సాయి నామ కీర్తనలు
తిలకించెడి సాయి రాముని
|| వైభోగము చూడగ రారండి||

6. భక్తి భావములు మనసులు నిండగ
నుండగ తనువులే నాట్యములాడగ

మహోత్సాహమున భక్త బృందము
సాయి నామమునే పలుకుచు నుండెడి
||వైభోగము చూడగ రారండి||

7 . తాత్యా తదితర భక్తులను కూడి
ద్వారకమాయి వాసుని చేరి

బయలుదేరుటకు సిద్ధమగుమని

వినయముగా ప్రార్థించుచుండెడి
||వైభోగము చూడగ రారండి||

8 . తాత్యా సాయిని లేవదీయగా
కుడికాలి తోడన ధునిని సవరించి
కుడిచేతి తోడ దీపమునార్పి
మెల్లగ ముందుకు అడిగిడు సాయి
||వైభోగము చూడగ రారండి||

9 . అలంకరించిన శామకర్ణియును
వెండి పల్లకి యు ముందుగ నడువగ
భక్తులు పరిచెడి వస్త్రంబులపై
మెల్లగా ముందుకు అడుగిడు సాయి
|| వైభోగము చూడగ రారండి||

10 . ఎడమవైపున తాత్యా పటేలు
కుడి వైపున శ్రీ మహాల్సాపతి
వెనుక చత్రమును జోగుసాహెబ్
పట్టుకొనుచుండ నడిచెడి సాయి
||వైభోగము చూడగ రారండి||

11. రకరకముల దీపముల కాంతిలో
రంగురంగుల తోరణములతో
వీనుల విందగు సంగీతములతో
షిరిడీ నెలర మైమరిపించడి
|| వైభోగము చూడగ రారండి||

12. సాయినాధునికి జయము జయమనుచు
భక్తినిండార నృత్యం చేయుచు
సర్వభారముల సాయికి వదలుచు
సంతోషంబున భక్తులుండగ
||వైభోగము చూడగా రారండి||

13 . దివ్య తేజముతో మోము వెలుగొంద
సర్వశక్తి స్వరూపము తానై
ఏమియు నెరుగని సామాన్యుని వలె
చావడి చేరగ అడుగిడు సాయి
|| వైభోగము చూడగ రారండి||

14 . చక్కని ఆసనములమరించి
కనుల కింపుగా అలంకరించి
చావడి లో అడుగిడిన సాయిని
సుఖాసీనునిగా చేయుచునుండెడి
|]|వైభోగము చూడగ రారండి||

15 . పురంధరుడు హారతుల నీయగ
భక్తులందరూ సేవలు చేయగ
ప్రతి ఒక్కరు ప్రణామమొనరింప
చిరునవ్వులతో చూచెడు సాయి
|| వైభోగము చూడగ రారండి||

16. భక్తులందరి కోరిక మేరకు
వారి సేవలను ప్రేమగా భరియించి
ప్రేమ కరుణలతో నెల్లర గాచుచు
పరమాత్మ పరబ్రహ్మ తానై నిలచిన

|| వైభోగము చూడగ రారండి||

17 . ఎల్లరు బాబా ఆశీస్సులగొని
ఆనందముగా వెడలుచు నుండగ
ప్రాణికోటిని పరిరక్షించుచు
చావడిలో పవళించిన సాయి
|| వైభోగము చూడగ రారండి||


106) ఏమి కర్మముల జేసితినో

ఏమి కర్మముల జేసితినో నేనేమి పాపముల నొనరించితినో
ఈ భూవిలో పలు బాధల వలలో జిక్కి దిక్కుతోచక యున్నాడను

1. నిన్ను నమ్మితిని, ఓర్పుగ నుంటిని నీవేదో మేలొన గూర్తువనీ
ఎన్నడు నీ దయ ప్రసరించునో యని ఎదురుతెన్నులు జూచుచు నుంటిని ‌//ఏమి //

2. ఎటు నేను వేడిన కరుణించెదవో, ఎటు ప్రార్ధించిన మొరలాలింతువో
ఎరుగని వాడను సాయి దేవా, ఎటునను బ్రోతువో దేవా దేవా //ఏమి //

3. తండ్రివి నీవే దయమాలిన ఇక దీనజనులకు దిక్కెవరయ్యా
మా మొరలను విని వేదనలను గని సరగును బ్రోవుము శ్యామ సన్నుత //


107) దయను జూపుమా సాయీ

దయను జూపుమా సాయీ - నీ దరిశన మొసగుము సాయీ
కనికరించుమా సాయీ - నను కరుణతో గనుమా సాయీ //దయ //

1. నమ్మితి నిన్నే సాయీ - నను వీడకు నెప్పుడు సాయీ
దిక్కువు నీవే సాయీ- నా దిగులు తొలగించు సాయీ

2 . అభ్యర్థించెద సాయీ- నాక భయమొసంగుము సాయీ
ఆరాధించెద సాయీ- నా ఆర్తిని బాపుము సాయీ

3. చింతన జేతును సాయీ- నా చిక్కుల దీర్పవే సాయీ
సతతము దలతును సాయీ - సద్భక్తిని నొసగవే సాయీ

4 . పదముల బట్టితి సాయీ - వరము నీయవే సాయీ
శ్యామ దేవుని సాయీ - సద్గతి నొసగవే సాయీ // దయ //


108) దిక్కెవరు ఉన్నారురా

దిక్కెవరు ఉన్నారురా
సాయినాథుడు తప్ప

మనకు ఈ భూవి లోన //దిక్కు//


1. తోడు నీడై నిలిచి యుండెడి
బాధ్యతలను భరియించు చుండెడి
శ్రేయముల నొన గూర్చు చుండెడి
ప్రేమ మయుడగు సాయి దప్ప //దిక్కు//

2. భక్తి విశ్వాసముల పెంచెడి
జ్ఞాన వైరాగ్యముల నొసగడి
సద్దతి సంతసముల నొసగిడి
సద్గురుండగు సాయి దప్ప //దిక్కు//

3 .తలచినంతనే దర్శనంబిడి
బిలచి నంతనే పలుకుచుండెడి
విశ్వమంతా నిండియుండడెడి
శ్యామ హృదయుడు సాయి దప్ప //దిక్కు//


109) ద్వారకా మాయీశా దరి జేర్చగా రావా

ద్వారకా మాయీశా దరి జేర్చగా రావా సాయి రామా
నీవు కరుణించ కున్ననూ కాపాడె వారెవరు సాయిరామా

1. నియమ నిష్టల తోడనూ పూజించగా లేను సాయి రామా
మీకు పంచ భక్ష్యంబుల భోజనం బిడలేను సాయిరామా

2. పన్నీటి స్నానము చేయించగా లేను సాయిరామా
పట్టు వస్త్రము లిచ్చి పూజించగా లేను సాయిరామా

3. తాంబూల దక్షిణల నర్పించగా లేను సాయిరామా
హారతుల నొసగి అర్ర్చించగ లేను సాయిరామా

4. సతతంబు నీ నామ స్మరణ జేయగ లేను సాయిరామా
నీ లీలలను గాన మొనరింపగా లేను సాయిరామా

5. ఆర్భాటముగా భజన లేమీ చేయగ లేను సాయిరామా
నీ మహిమలను గూర్చి వర్ణించగా లేను సాయిరామా

6. నీ రూప మెటులుండు ? నీ వేష మెటులుండు ? సాయిరామా
నీ రూప వేషముల దెలియగా లేనయ్యా సాయిరామా

7. నిను నమ్మి పిలచిన పలికెద వని వింటి సాయి రామా
పనిలికి భక్తుల నెల్ల రక్షింతువని వింటి సాయిరామా

8. దెలిసి దెలియక నిన్ను పిలుచుచచూ నుంటి సాయి రామా
నా పిలుపునకు పలికి నన్ను రక్షింపగా రావే సాయి రామా

9. నీ పాలబడిన నన్ను వదలకు మని నిన్ను సాయిరామా
మరి మరీ వేడుచు మ్రొక్కుల నిడుచుంటి సాయి రామా

10 . శ్యామ చరణాదులను కృప జూపి బ్రోవగా సాయిరామా
వేగ అరుదెంచ వేడెద కరుణాంతరంగ శ్రీ సాయి రామా....


110) దయ గనవే సాయీ మమ్ముల

దయ గనవే సాయీ మమ్ముల
దయ గనవే సాయీ ద్వారకామాయి
దరిశన మీయవే శేష సాయీ //దయ//

1. పరమ ధర్మమును ఇల నెలకొల్పగ
పరమత సహనము పాదు కొలపగ
భక్త జనులకు అభయ మొసంగగ
సాయి దేవునిగ అవతరించితివి //దయ//

2. నిష్టయే మనసును నిలుప గలుగు నని
ఘన సబూరియే నడిపించు ననీ
ప్రేమ స్వరూపమే పరమాత్మ యనీ
దెలుపగ ధరలో అవతరించితివి //దయ//

3. సద్గురు దేవుడే సకల మొసగునని
సద్గుతులను కలిగించ గలడనీ
దెలిపి మానవుల తరింప జేయగ

శ్యామ సన్నుత అవతరించితివి // దయ//


111) గురుదేవ గురుదేవ గురుదేవ రారా

గురుదేవ గురుదేవ గురుదేవ రారా
కృప జూపి నా మనసు నిండుగా నుండరా // గురు //

1. భక్తితో నిను గొలచి తరియించ దలచితే
బలహీనమగు మనసు క్రింద మీదకు లాగు
నీ కృపయే లేకున్న నిన్ను గొలువగ లేను
నిన్ను చింతించుచూ నన్ను మరువగ లేను //గురు//

2 . పారాయణము చేయ పరుగులెత్తును మనసు
పాడు సోమరితనము పడక మీదకు చేర్చు
జపము చేయగా ఎంతో ఆశపడు నా మనసు

తప్పింప జేయు నా నీచ సంస్కారము //గురు//

3 . దయ జూపి కరుణించి దరి జేర్చు దైవమా
నా శక్తి యుక్తులు నిరుపయోగములు
నీవు ప్రేమను చూపి నన్ను లాగకున్న
శ్యామాదులకు శాంతి సౌఖ్యములు సున్న //గురు//


112) కనుగొను మదిగో మనసా

కనుగొను మదిగో మనసా
శ్రీరామ భక్తుడగు హనుమ దేవుని //కను //

1. రామరామ శ్రీ రామ రామ రఘురామ రామ
కౌసల్య రామ కోదండ రామ సీతారామ
పట్టాభి రామ ఘనమేఘ శ్యామ //కనుగొను//

2. సాకేత సార్వభౌమా శ్రీరామా యనుచు
రోమ రోమముల రామ నామమే వీనుల విందుగ
వినబడు చుండెడి రామ చరణార వింద సేవకుని //కనుగొను //

3. భక్తి భావమున నృత్యము జేయుచు
తన్మయత్వమున తాళము వేయుచు
మేను మరచి అరమోడ్పు కన్నులతో
ఆనందాశ్రువులు జాలు వారగా //కను//

4 .రామా రామా రామా రామా రామా శ్రీరామా
రామా రామా యనుచు రామ నామ ధ్యానంబున
మునిగిన శ్యామ చరణ సన్నుత శ్రీ హనుమను //కను//


113) రామ రామ యని రోమ రోమమున

రామ రామ యని రోమ రోమమున
ధ్వని యించు హనుమ జయహో
రామనామ సుధామృత పానమును
రమియించు హనుమా జయహో // రామ //

1. శ్యామ సన్నుత జయ హనుమా
శ్యామ వందిత జయ హనుమా

సకల క్లేశ సంహారక నామము
సకల సిద్ధి ప్రదాయక నామము

సకల సౌభాగ్య దాయక నామము
రామ నామమని దెలిపిన హనుమా // రామ //

2. శ్యామ సన్నుత జయ హనుమా
శ్రీరామ నామాంకితుడుగా హరి
నీలో నిలిచెను నీ వశమాయెను
రామనామ మహిమ లోకముల
నీమూలముననే నిశ్చయ మాయెను // రామ //


114) ధుని ముందు కూర్చున్న సాయి

ధుని ముందు కూర్చున్న సాయి దేవా
నన్ను ధుని లోని కర్రగా మార్చుకోలేవా !
ద్వారకా మాయీశ సాయి దేవా
నన్ను నీ చేతి సటకగ చేర్చుకోలేవా !

లెండి తోటకు బోవు సాయి దేవా
నన్ను నీ పాదరక్షలుగ కూర్చుకోలేవా !
మార్చుకోలేవా ! చేర్చుకోలేవా ! కూర్చుకోలేవా ! //ధుని//

భిక్షాటనము చేయు సాయి దేవా
నన్ను దయతో నీ జోలెగా మార్చుకోలేవా !
రేకు పాత్రగా నన్ను మలచుకోలేవా !
దర్బారు నందుడు సాయి దేవా

నన్ను నీ ఆసనముగా తీర్చుకోలేవా !
చిలుము సేవించడి సాయి దేవా
నన్ను చిలుము గొట్టముగా కూర్చుకోలేవా !
మార్చుకోలేవా ! తీర్చుకోలేవా ! కూడ్చుకోలేవా ! //ధుని //

భక్తులను దీవించు సాయి దేవా
నన్ను భక్త సేవకునిగా నొనరించలేవా !
లోకముల పాలించు సాయి దేవా
నన్ను లౌకికమ్ముల నుండి తొలగించలేవా !

శామసన్నుత చరణ సాయి దేవా
నన్ను నీ పాద రేణువుగ నిలుపుకోలేవా !
నొనరించలేవా! తొలగించ లేవా !! నిలుపుకోలేవా ! //ధుని //


115) దయ రాదా? నీ దరికి చేర్చవా !

దయ రాదా? నీ దరికి చేర్చవా !

దయా స్వరూపా దీన బాంధవా //దయ//

1. తెలిసియో దోషముల నొనరించితి
క్రోధముతో పరదూషణ జేసితి
మిడిమిడి జ్ఞానముతో మిడిసి బడితిని
అహాము తోడ నిను అపహసించితిని //దయ //

2 . మానవుడను మాయా బద్ధుడను
మంచిని తెలియని పరమ మూర్ఖుడను
మహిలో బ్రతుకును ఈడ్చు చుంటిని
మద మత్సరముల బ్రతుకు చుంటిని //దయ //

3 . సత్సంగములను జేయగ నైతిని
సన్మార్గంబుల నడువ నైతిని
సతతము నిన్నే దలపక యుంటిని
ధ్యాన సాధనల జేయగ యుంటిని / దయ //

4 . నీ సంకల్పమే నా బ్రతుకు గద
ఎందుకు యిటుల శోధించెదవు
బాధించెదవు ? వేధించెదవు
కరుణను చూపి నను కడ తేర్చవు //దయ //

5 . శ్యామాదులు నీ బానిసలే కదా
అరిషడ్వర్గము లన్నియు ద్రుంచవే
బవ బంధముల బాధల మాన్పవే
శ్రీ చరణ భవ భయ హరణ //దయ//


116) దత్త దిగంబర సాయి దేవా !

దత్త దిగంబర సాయి దేవా !
దీనులను నొకపరి కరుణ తో గనుమా
తెలిసి తెలియక జేసిన దోసములను
దలచి మము వేధించకురా! శోధించకురా ! బాధించకురా ! //దత్త //

1. అమాయకులమై అర్థము దెలియక
అనర్థములను కొని దెచ్చుకొనుచు

ఆవేదనలలో పడి వుంటిమిరా

ఆధారమునే కనజాలమురా //దత్త //

2. లౌకిక వాంఛల వలలో పడితిమి
దురాశ పాల్పడి దూర్తుల మైతిమి
ఇది మా కర్మమొ ! నీ అనుగ్రహమొ !
దెలియక శాంతికి దూరమైతిమి //దత్త //

3 . ప్రేమ స్వరూపము నీవే గాదా
దయా సముద్రుడవు నీవే గాదా
కన్నతల్లి వలె కరుణతో గాచి
శ్యామాదులను చల్లగా నేలుము //దత్త //


117) నీ పవిత్ర దివ్య సమాధి మందిరము నందు

నీ పవిత్ర దివ్య సమాధి మందిరము నందు
అడుగిడిన వారే ధన్యులు ---
రామా సాయీ ----- రామ శ్యామా సాయి---

శ్యామ రామా సాయి మేఘ శ్యామా సాయి. //నీ//

1 .నీ పవిత్ర పద పద్మముల యందు
మనసుంచి శిరముంచు వారే ధన్యులు---
రామా సాయీ. //రామ//

2 . నీ దివ్య సమాధికి ప్రదక్షిణములను
భక్తిగ చేసెడి వారే ధన్యులు ----
రామా సాయీ //రామ//

3 . నీ దివ్య రూపమును నిరతము
మదిలో నిలిపి ధ్యానించు వారే ధన్యులు ----
రామా సాయీ //రామ//

4 . నీ దివ్య నామమును సతతము
హృదిలో చింతన చేసెడి వారే ధన్యులు----
రామా సాయీ //రామ//

5 . నీ దివ్య సమాధికి అభిషేకంబుల
శ్రద్ధగ చేసెడి వారే ధన్యులు ----
రామా సాయీ //రామా//

6 . నీ దివ్య సమాధిని సుగంధములతో
నలంకరించెడి వారే ధన్యులు----
రామా సాయీ //రామా//

7. నీ దివ్య సమాధిని మధుర సుమములతో అలంకరించెడి వారే ధన్యులు -----
రామా సాయీ //రామా//

8. నీ దివ్య సమాధికి పట్టు వస్త్రముల
నలంకరించెడి వారే ధన్యులు -----
రామా సాయీ //రామా//

9. నీ దివ్య సమాధికి సుగంధ ధూపము లిచ్చి
పూజించు వారే ధన్యులు -----
రామా సాయీ //రామా//

10. నీ దివ్య సమాధికి అటు నిటు అనేక
దీపముల నుంచు వారే ధన్యులు ----
రామా సాయీ //రామా//

11. నీ దివ్య రూపమును అనేక నామముల
తోడ నర్చించు వారే ధన్యులు----
రామా సాయీ //రామా//

12. నీ దివ్య రూపమున కనేక
నైవేద్యముల నర్పించు వారే ధన్యులు----
రామా సాయీ //రామా//

13. నీ దివ్య లీలలను తలచుచు,
పొగడుచు స్మరించు చుండెడి వారే ధన్యులు ----
రామా సాయీ //రామ//

14. నీ దివ్య మహిమలను ఆనందముగా
మరి మరి దలచెడి వారే ధన్యులు-----
రామా సాయీ //రామా//

15. నీ పవిత్ర దివ్య నామా మృత పానము జేసి
పులకించు వారే ధన్యులు -----
రామా సాయీ //రామా//

16. నీ దివ్య రూపమున కత్యంత
భక్తి చిలుము నొసంగెడి వారే ధన్యులు ----
రామా సాయీ //రామా//

17. నీ దివ్య తేజమున కానందముగా
హారతుల నొసగు వారే ధన్యులు----
రామా సాయీ //రామా//

18. నీ దివ్య నామమున కనవరతము
జయ జయమని బలికెడి వారే ధన్యులు------
రామా సాయీ //రామా//

19. నీ దివ్య తేజమున కెప్పుడు
మంగళం బనుచు కీర్తించు వారే ధన్యులు------
రామా సాయీ //రామా//

20. నీ దివ్య రూప నామంబులే
సతతము దిక్కని నమ్మిన వారే ధన్యులు----
రామా సాయీ //రామా//

నీ పవిత్ర పద పద్మంబులే దిక్కని
నమ్మిన శ్యామను గావుము ---
రామా సాయీ //రామా//


118) నీ నామమే మాకు మంత్రము సాయీ

నీ నామమే మాకు మంత్రము సాయీ
నీ రూపమే మాకు ధ్యానము సాయీ //నీ నామమే//

1 .రామ భక్తులకు రామ చంద్రుడవు
శివ భక్తులకు పరమేశ్వరుడవు
కృష్ణ భక్తులకు పండరీశుడవు
హనుమ భక్తులకు ఆంజనేయుడవు //నీ నామమే//

2. ఏ దైవము నారాథించిననూ
ఆ రూపము గనే కనిపించెదవు
మనసారా నిను నమ్మిన మాకు
సకల దేవతల రూపము నీవే //నీ నామమే//

3. తారక నామ మంత్రము నీవే
పంచదశి, శ్రీవిద్యలు నీవే
అష్టాక్షరి, బీజాక్షరము లీవే
ఆది మూలమగు ఓంకార మీవే //నీ నామమే//

4. ఏ మంత్రము నుపాసించిననూ
నియమ నిష్టలతో సేవించిననూ
ఫలిత మొక్కటని తెలిపిన దేవా
శ్యామ సన్నుత సత్కృప జూపుము //నీ నామమే//


119) నీ సరి గలరా సాయీ

నీ సరి గలరా సాయీ
నీ నామమే గూర్చును హాయీ

1. నిను నమ్మిన ఆశ్రితుల నెల్లప్పుడు
అనునయించుచు అభయ మొసంగుచు
గాచుచు నుందువు కరుణ రూపమై
సాయి శ్యామ చరణ సన్నుత // నీసరి //

2. ప్రాపంచికమగు సుఖముల నెన్నో
కలుగజేయుచూ పరిపాలించుచూ
వక్ర మార్గముల జననీయవు గదా
సాయి శ్యామ చరణ సన్నుత // నీసరి //

3. కోరకయే సకలము సమగూర్తువు
శాంతి సౌఖ్యముల నందించెదవు
నీ భక్తులకు నొసగెదవు ముక్తిని
సాయి శ్యామ చరణ సన్నుత // నీసరి //


120) నిన్ను చూడని కనులేల

నిన్ను చూడని కనులేల
నీ గీతి పాడని గళమేల
షిరిడి వాసా సాయినాథా //నిన్ను//

1. నిన్ను తలచని మనసేలా
నిన్ను పొగడని నాలుకేల
నిన్ను పూజించని కరము లేల
నీ కరుణ పొందని భక్తేల //నిన్ను//

2. నీ పదముల నుంచని శిరసేల
నీ కథలు వినని శ్రవణము లేల
నీ కర్పించని ప్రాణమేల
నీలో కలువని ఆత్మయేల //నిన్ను//


121) రామ నామము గానము ఎందున్న

రామ నామము గానము ఎందున్న
అందునే నుందు నున్న దైవమా
నా వందనముల గొనుమా
వాయునందనా హనుమా --- హనుమా. // రామ //

శివుడవు భవుడవు భవభయ హరుడవు
హరుడవు ధవుడవు మాధవ హితుడవు

హితుడవు నుతుడవు అంజని సుతుడవు
ఆనంద కరుణను అప్రమేయుడవు //రామ//


122) నీదు లీలలు నేరుగ జాలను

నీదు లీలలు నేరుగ జాలను
సగుణ నిర్గుణ రూపా సాయి
నెరుగ జాలని శ్యామను
కరుణతో బ్రోవ వేడెదను బాబా సాయి //నీదు//

శరణు సద్గురు దేవా సాయి-
పాహి సద్గురు దేవా సాయి. //నీదు//

1. శివ భక్తులకు శివుడవు నీవే
రామ భక్తులకు రాముడ నీవే
హనుమ భక్తులకు మారుతి నీవే
కృష్ణ భక్తులకు రంగడి నీవే //నీదు//

2. చూడ గలిగిన వారికి అంతట
దరిశన మొసగిడి దైవము నీవే
వినగలిగిన వారికి మధురముగా
మాటల వినిపింతువు నీవే // నీదు //

3. ఎవరే తీరుగ కొలచిన వారిని
ఆయా తీరుల గనే గా చెదవు
ప్రాణికోటికి పరమాప్తుడవు
పవిత్రాత్మలకు పరమాత్ముడవు //నీదు//


123) సాయీ - రామా- రామా -కావ రావా

సాయీ - రామా- రామా -కావ రావా //సాయి//

1. నీ కోసమై కనులు వెదకి వెదకి
చాలా అలసి పోయినవయ్యా దేవా
కరుణాంతరంగ నా కనుల కగపడ రావే
ప్రేమగా నిమిరి నను దీవించరావే // సాయి //

2. జీవించ లేక నీ పంచ చేరగా
ప్రాకు లాడుచు నుంటి దేవా
ప్రాపంచికములగు కోర్కెలను
దనుమాడి సచ్చిదానందము నీవా // సాయి //

3. జపము చేయగ లేని తపము
చేయగ లేని సోమరిగ నుంటినో దేవా
సర్వభారములు నీ పరము జేసుకొని
శామాదుల ప్రేమతో కావరావే //సాయి //


124) నీ పవిత్ర పద పద్మముల పైన

నీ పవిత్ర పద పద్మముల పైన
నా శిరము నుంచ దయ చూడుమయా

నీ దివ్య కరముతో ప్రేమగా నిమిరి
దీవించి కరుణించవయా //నీ పవిత్ర //

ఆశ్రిత పోషక అనాధ రక్షక
దీన బాంధవా పాహిమాం
భక్తవత్సల భవ భయ నాశక
బాబాసాయి రక్షమాం //నీ పవిత్ర//

1. సుభద్రమగు నీ ఒడిలో శిరముంచి
కౌగిలించుకొన నీయుమయా
అరిషడ్వర్గములను సంహరించి
వాత్సల్యంబున గావుమయా //నీ పవిత్ర//

2. సచ్చిదానంద మొసగు నీచరణ
కమలముల సేవ నొసగుమయా
సతతము నీ నామ రూపములు
మనసున నిలువగ బ్రోవుమయ్యా //నీ పవిత్ర//

3. సర్వాభీష్ట ప్రదాయకమౌ
నీ చరితమునే చదివించుమయా
సూనృత మగు నీ దివ్య లీలలను
గాన మొనరింప నీయుమయా //నీ పవిత్ర //

4. నీ సేవకులకు సేవలు జేసేడి
మహాత్భాగ్యము నొసగుమయా
సుమధుర మధురంబగు నీ పలుకుల
విని తరియింపగ జేయుమయా //నీ పవిత్ర//

5 . నిష్ట సబూరుల నా ఊపిరిగా
జేసి నన్ను గ్రహియింపుమయా
నీ దివ్య రూప సందర్శనమును
సర్వావస్థల నొసగుమయా //నీ పవిత్ర//

6. సుఖదుఃఖంబుల మంచి చెడుగులలో
నా మదిలోనే నిలుపు నిలుపుమయా
నీ దరికి జేరు మార్గంబుననే నిరతము
నన్ను నడుపు మయా //నీ పవిత్ర//

7. తెలిసీ తెలియక చేసిన దోస గుల
క్షమియించి దయను చూపుమయా
ప్రేమమయా నీలో నైక్య
మొనరించుమయా శ్యామహృదయా //నీ పవిత్ర//


125) నిరామయా నిరంజనా నిర్గుణా

నిరామయా నిరంజనా నిర్గుణా సనాతనా
నిగమాగమ వేదవేద్య శ్రీ చరణ మోహన //నిరామయా//

1. సంశయ భవభయ నాశక సద్గతీ ప్రదాయకా
సత్య ధర్మ పరిరక్షక సద్గురు వినాయకా
సకల దైవ సకల సాధు సకల ప్రాణి రూపకా
సుఖదాయక సుజన మనో మందిరాది దాయకా //నిరామయా//

2. నమో లక్ష్మీనారాయణ, సాయినాధాయ
నమో రామకృష్ణ శివ మారుతీ దత్తాయ
నమో గోదావరి తట శిరిడీ నివాసాయ
నమో శేష సాయి భక్త హృదలాయాయ //నిరామయా//

3. భూతా వాసాయ నమో సర్వహృనిల యాయా
భూత భవిష్యత్ భావ వర్జితాయ నమో నమో
కాలా తీతాయ కాలాయ నమో నమో
కాల కాలాయ కాలదర్ప దమనాయ నమో //నిరామయా//

4. మృత్యుంజయాయ నమో అమర్త్యాయ నమో నమో
మత్యాభయ ప్రదాయ జీవాధారాయ నమో
భక్తా మన సమర్దాయ సర్వాధారాయ నమో
భక్తావన ప్రతిజ్ఞాయ అన్న వస్త్రదాయ నమో //నిరామయా//

5 . ఆరోగ్య క్షేమదాయ నమో అద్భుతాయ
ధన మాంగల్య ప్రదాయ ప్రీతి వర్ధనాయ నమో
బుద్ధి సిద్ధిదాయ నమో ప్రేమ ప్రదాయ
పుత్రమిత్ర కళత్ర బంధు దాయ నమో నమో //నిరామయా//

6 . యోగక్షేమ వహాయ నమో సచ్చిదాత్మాయ
ఆపద్బాంధవాయ నమో మార్గ బంధువాయ
భుక్తి ముక్తి స్వర్గాప వర్గదాయ నమో నమో
సర్వాంతర్యామినే నమో పరమ సుఖదాయ //నిరామయా//

7. ప్రియాయ నమో నిత్యానందాయ నమో
పరబ్రహ్మణే పరమేశ్వరాయ నమో నమో
భక్తానం మాతృ ధాతృ పితా మహాయ నమో
పరమాత్మ జ్ఞాన స్వరూప జగత్ ప్రభువాయ నమో //నిరామయా//

8. జగన్మాత జగత్ పిత జగద్గురవాయ నమో
భక్తాభయ ప్రదాయ నమో భక్తవస్యాయ
భక్తానుగ్రహ కరాయ నమో భక్తి శక్తిదాయ
శరణాగత వత్సలాయ నమో భాస్కరాయ //నిరామయా//

9. హృదయ దౌర్భాల్య పాపకర్మ నాశకాయ నమో
సంశయ విచ్చేదకాయ నమో సులభ గమ్యాయ
హృదయ గాంధి భేద కాయ నమో కర్మ ధ్వంసకాయ
శుద్ధసత్వ స్థితాయ నమో గుణాతీతాయ //నిరామయా//

10. అంతర్యామి నమో భక్త పరాధీనాయ
జ్ఞాన వైరాగ్యదాయ నమో పుణ్య తీర్థాయ
పుణ్య శ్రవణ కీర్తనాయ నమో అచింతాయ
సర్వాంతర్యామి నమో మనో వాగతీతాయ నమో //నిరామయా//

11. అనంత కళ్యాణ గుణాయ నమో గుణాత్మాయ
అమిత పరాక్రమాయ నమో దుర్దర్శ కోభ్యాయ
జయాయ నమో అపరాజితాయా నమో నమో
త్రిలోకేశు అవిఘాత పతాయ నమో నమో //నిరామయా//

12. అశక్య రహితాయ నమో సర్వశక్తి మూర్తాయ
సురూప సుందరాయ నమో సులోచనాయ
బహు రూప విశ్వముర్తయే సూక్ష్మాయ నమో
అరూప వ్యక్తాయ ఆనందాయ నమో //నిరామయా//

13 . మనోవాగ తీతాయ నమో ప్రేమ మూర్తయే
సర్వాంతర్యామి నమో సులభ దుర్లభాయ నమో
అసహాయ సహాయాయ నమో అనంతాయ
అనాధనాథ దీన బాంధవాయ నమో హరాయ //నిరామయా//

14. సర్వభార భరితాయ నమో వాసుదేవాయ
అకర్మనేక కర్మ సుకర్మిణే నమో నమో
సత్పరాయణాయ నమో లోకనాధాయ
సతాంగతయే నమో భాస్కర ప్రభాయ //నిరామయా//

15. అమృతాంశవే నమో పావనాన ఘాయ
బ్రహ్మచర్య తప చర్య సువృతాయ నమో నమో
సత్య ధర్మ పరాయణా సిద్దేశ్వరాయ నమో
సిద్ధ సంకల్పాయ నమో శ్రీకరాయ //నిరామయా//

16. యోగేశ్వరాయ నమో భక్తవత్సలాయ
భగవతే సత్పురుషా పురుషోత్తమాయ నమో
సత్య తత్వ బోధకాయ నమో సత్వరూపాయ
కామాది షడ్వైరి ధ్వంసకాయ నమో నమో //నిరామయా//

17. అభేదానందాను భవప్రదాయ నమో
సమ సర్వమత సమ్మతాయ సాయి నమో నమో
దక్షిణామూర్తి నమో వెంకటేశ రమణాయ
అద్భుతానంత చర్యాయ నమో అప్రమేయ //నిరామయా//

18. సంసార సర్వ దుఃఖ క్షయకరాయ నమో నమో
ప్రఫన్నార్తి హరాయ నమో పాపరహితాయ
సర్వవిత్ సర్వతో ముఖాయ నమో నమో
సర్వాంతర్బహి స్థితాయ నమో శ్రీకరాయ //నిరామయా//

19. సర్వమంగళ కరాయ నమో సౌమ్య గుణాయ
సర్వాభీష్ట ప్రదాయ నమో నమో బలాయ
సమరస సన్మార్గ స్థాపనాయ నమో శివాయ
సమర్థ సద్గురు శ్రీ సాయినాధాయ నమో //నిరామయా//

20. సాయి రామా నమో సాయి కృష్ణా నమో సాయి
సాయి హనుమ నమో సాయి దత్త నమో సాయి
సాయి శ్యామ నమో సద్గురు
శ్యామ సన్నుతాయ నమో శ్యామ హృదయాయ //నిరామయా//

Comments

Post a Comment

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)