(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)

 శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం - 6
1వ భాగం (1 నుండి 25): https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/1-01-25.html 
2వ భాగం(26 నుండి 50):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/2-25-50.html
3వ భాగం (51 నుండి 75):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/3-51-75.html
4వ భాగం (76 నుండి 100):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/4-76-100.html
5వ భాగం (101 నుండి 125):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/5-101-125.html
 6వ భాగం (126 నుండి 150):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/6-126-150.html
7వ భాగం (151 నుండి 175):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/06/7-151-175.html
 

6వ భాగం: 

126)  నీ సేవకునిగ నీ బానిసగ
127) నీ లీలల తెలియగ తరమే
128) నీ నామము వినుటయే నా భాగ్యము
129) నీ లీలల కంతము కలదా
130) నీ లీలల కంతము కలదా

131) ప్రేమ తోడ గావుమయ్యా
132) పవిత్రునిగ నుంతువో పతితునిగా
133) పాపికి నిష్కృతి ఎన్నడు ?
134) భాగ్యము నొసగుమురా సాయి
135) ప్రసన్న వదనా సాయీ

136) బాబా నిను నమ్ముకుంటి
137) భేద భావము తొలగ జేయుము
138) బాబా నిను నమ్మిన బాధలు కలుగునా ?
139) మోహనమే సాయి నామం
140) వందనములను గొనుమా

141) వ్యర్థపు యోచన లెందుకు మనసా
142) వలదయ్యా - నను వదలకు మయ్యా
143) వలదు - వలదు సాయీ !
144) శ్రీ స్వామిని సేవించుటలో
145) శరణు శరణు రఘురామా...

146) శరణము శరణము రామా సాయి
147) మంగళం జయ మంగళం
148) శ్రీరామ జయరామ - జయ జయ రామా
149) శిరిడీ వాసా... శ్రీ సాయీశా...
150) శిరిడీ నుంచి వచ్చినావా సాయి రామయ్యా

126)  నీ సేవకునిగ నీ బానిసగ
నీ సేవకునిగ నీ బానిసగ
నీ సేవలోన నిరతము
నిలుపుము సాయి //నీ సేవ//


1. సర్వము నీ కర్పణ జేయుచు
సకలము నీదే యని మది దలచుచు
సకల విశ్వమున నిన్ను జూచుచు
సంతోషంబును పొందగ జేయుము //నీ సేవ//

2 . నీ నామామృత పానము జేయుచు
నీ లీలలను గానము జేయుచు
నీ సేవకులకు సేవలు జేయుచు
నిరతము సంతస మందున నుంచుము //నీసేవ//

3 . ఆశయ మీవై ఆశలు నీవై
ఆచరణ ఆలోచన నీవై
అంతట నీవై అన్నియు నీవై
ఆనందమున నిలుపుము సాయి //నీ సేవ//

4. నీవే నేనై నేనే నీవై
నిశ్చయ నిశ్చల మనుగతి నేనై
నిరూపమానంద ధామము నేనై
నుండగ జేయుము శ్యామ సన్నుత //నీ సేవ// 

 

127) నీ లీలల తెలియగ తరమే

నీ లీలల తెలియగ తరమే
నీ మహిమల పొగడగ వశమే
నిర్గుణ సగుణ సచ్చిదానంద
సద్గురు దేవా సాయీ //నీ లీలల//

1. అవాంగ్ మానస గోచరుడవు
ఆది మధ్యంత రహితుడవు
ఆదిదేవుడవు అధి దేవుడవు
అప్రమేయుడవు అపాంతరాత్ముడవు // నీ లీలల//

2. సంతతా నంద సంధాయకుడవు
సద్గురుడవు సర్వోన్నతుడవు
సంసార దుఃఖ వినాశకుడవు
సత్య రూపుడవు సత్య రూపుడవు //నీ లీలల//

3 . సద్భక్తుడవు సంరక్షకుడవు
సకల సంశయ విచ్చేధకుడవు
వివేక విజ్ఞాన ప్రదాయకుడవు
శ్యామ హృదయడవు శ్యామ నాథుడవు //నీ లీలల// 


128) నీ నామము వినుటయే నా భాగ్యము

నీ నామము వినుటయే నా భాగ్యము
నీ రూపము జూచుట నా పుణ్యము
నీ నామము స్మరించుట యే జ్ఞానము
నీ రూపము ధ్యానించుటయే మోక్షము //నీ నామము//

1. నామము వినగ మనసు కలగదు
రూపము జూడగ బుద్ధి నిలువదు
నామ స్మరణకు తీరిక కలుగదు
ఎందుకిట్టుల జేతువో
ఎందుకీ వీధి ఆడించెదవో
దోషములన్నియు దయతో మన్నించి
కనికరముతో నను గావుము సాయి //నీ నామము//

2. అనేక యిడుముల కలిగించెదవు
వాటిని తొలగించగ నిను ప్రార్థించెదను
లౌకిక విషయము లందు నిలిపెదవు
పరమార్థమునకు జేరనీయవు //నీ నామము//


129) నీ లీలల కంతము కలదా

నీ లీలల కంతము కలదా
నీ ప్రేమ అనంతము కాదా? //నీ//

1 . వింత వింత అనుభూతులలో
మది ఎంతో పొంగి పోవునురా
సుంతయేని నిను నమ్మి
జీవించు వారికి చింత గలదా //నీ//

2. సాయి సాయి యని బాబా బాబా యని
ఎప్పుడెటుల నిను బిలచిన గానీ
వెనువెంటనే నీ కరుణను బరపి
ఆలన పాలన జేతువు గాదా

3. తల్లి దండ్రి గురు దైవము లీవై
సత్య ధర్మము శాంతియు నీవై
జ్ఞాన మార్గమున మము నడపించుచు
సద్గతి నొసగెడి శ్యామ వందితా //నీ//


130) నీ లీలల కంతము కలదా

నీ లీలల కంతము కలదా నీ ప్రేమ అనంతము కాదా // నీ // వింత వింత అనుభూతులలో మది ఎంతో పొంగిపోవును రా సుంత యేని నిను నమ్మి జీవించు వారికి చింత గలదా // నీ // సాయి సాయి యని బాబా బాబా యని ఎప్పుడు ఎటుల నిను బిలచిన గాని వెను వెంటనే నీ కరుణను బరపి ఆలన పాలన జేతువు గాదా // నీ // తల్లి తండ్రి గురు దైవము లీవై సత్య ధర్మము శాంతియు నీవై జ్ఞాన మార్గమున మము నడిపించుచు సర్గతి నొసగెడి శ్యామ వందితా // నీ //


131) ప్రేమ తోడ గావుమయ్యా

ప్రేమ తోడ గావుమయ్యా పరమాత్మ సాయి నీ పద పంకజములే నమ్మియున్న వారమనీ ప్రేమగ మము గావుమయ్యా పరమాత్మ సాయి //ప్రేమ// 1. ప్రతిక్షణము నీ నామమే మా మనసుల పలుకుచుండ అనుక్షణము నీ రూపమే మా కనులలో కదలు చుండ అహరహము నీ దయయే మమ్మెలర నడుపు చుండ క్షణక్షణమూ నీ కరుణయే మా కభయము నొసగు చుండ //ప్రేమ// 2. బాధ్యతల నేమో అధికము జేసి మా మనసుల కెంతో బాధల కలిగించి దారి తెలియక దిరుగు చుండగా కూర్చొని హాయిగా నవ్వుచూ వున్నావు ఇపుడి దేహమున కెందుకో బాధల కల్పించుచూ వున్నావు నీవే దిక్కని నమ్మిన వారమనుచు ఆ బాధల తొలగించుము సాయి //ప్రేమ//


132) పవిత్రునిగ నుంతువో పతితునిగా

పవిత్రునిగ నుంతువో పతితునిగా నొనరింతువో నీ పాల బడితినయ్య పతిత పావనా సాయీ //పవిత్ర// 1. సత్యమునే బలుక మనుచు ధర్మముగనే బ్రతుక మనుచు సకల మానవాళికీవు సందేశము లొసగితివి అసత్యములనే బలికెడి అల్పునిగా నిలిపితివి అధర్మముగనే బ్రతికెడి అజ్ఞాని జేసితివి //పవిత్రు// 2. పరులను దూషించకుమని పరమార్ధము నెరుగుమనీ పదేపదే నీ భక్తుల కాదేశము లోసగితివి పర దూషణ చేయు పరమ మూర్ఖునిగా నుంచితివి పరమార్ధము మెరుగలేని పాపిగనను నిలుపితివి //పవిత్రు// 3. విశ్వాసము నోర్పులను కలిగియుండు మంటివి అవియే సకలాభీష్టము లోసగి గాచు చుంటివి విశ్వాసము కలుగ నట్టి అవివేకిగా జేసితివి ఓర్పులేని మందమతిగా మహిలో నను బెంచితివి //పవిత్రు// 4. దుర్మార్గుల సన్మార్గుల గావించగా వెలసితివి మతములన్ని ఒకటే అని మానవులకు దెలిపితివి నీ లీలల నెరుగ లేను నీ మహిమల దెలియగ లేను శ్రీ చరణా భయ హరణా శ్యామ చరణ సన్నుతా //పవిత్రు //


133) పాపికి నిష్కృతి ఎన్నడు ?

పాపికి నిష్కృతి ఎన్నడు ? నీ పద సన్నిధిని చేరు టెన్నడు? పతితునిగా ఈ పవిత్ర భువి లో మసలుచు నుండెడి మందభాగ్యుడగు- ఈ- //పాపి// 1. తలచున దొకటి చెప్పేడి దొకటి చేసేడి దొకటిగ బ్రతుకుచు నుండెడి అహము మోహముల ఈర్ష్యాసూయల తోడ దుర్భాష లాడుతూ నుండెడి //పాపి// 2. కామముతోడ కన్నులు గానక కనరాని పనులు చేయు చుండెడి మహితాత్ములగు దైవ భక్తులను హీనముగా పరికించు చుండెడి //పాపి // 3. అధర్మ మన్యాయములతో నడుచుచు ఆస్తి కొరకు ఆరాటము చెందెడి స్వార్ధము కొరకై నయ వంచనముతో నరులను బహుగ పొగడుచుండెడి //పాపికి // 4. పుణ్యము సంపాదించుట కొరకై భక్తి శూన్యమగు పూజలు చేసి పలువుర లోన భక్తుడు వీడని నటియుంచు చుండెడి //పాపికి // 5. పూజల చేయగ సేవల చేయగ నీ దయ కొరకై చూచుచు నుండెడి దానధర్మముల చేయక సతతము సద్గతి నందక అభిలషించెడి //పాపికి// 6. ప్రేమభావమున ప్రాణుల జూడక శ్రీ గురుదేవుని ఆశ్రయించక శ్రీ గురుదేవుల ఆదేశములను అణుమాత్రమైన ఆచరించక సత్ఫలితములనే సదా కోరుచు స్వార్థ చింతనతో నడుచుచుండెడి శ్రీ గురుదేవుని కృపను కోరెడి హీన మనస్కుడగు శ్యామచరణుడు //పాపికి //


134) భాగ్యము నొసగుమురా సాయి

భాగ్యము నొసగుమురా సాయి -

నీ దరిశన భాగ్యము నొసగుమురా ------ //భాగ్యము // 1. నీ పద పంకజములనే నమ్ముచు నీ రూపమునే ధ్యానము చేయుచు నీ లీలలనే గానము చేయుచు

నీ నామమునే పలికెడి వారికి //భాగ్యము // 2. అన్న వస్త్రముల నందింతు వినీ ఈతి బాధలను బాప గలవనీ

జీవికి సద్గతి నొసగ గలవనీ నమ్మి

నిను గొలుచు శ్యామ చరణునకు // భాగ్యము //


135) ప్రసన్న వదనా సాయీ

ప్రసన్న వదనా సాయీ - పతిత పావనా సాయీ పరమ కృపాకర - పాపనాశకర -

పావన నామా - సాయీ సద్గురు దేవా

పాహిమాం సాయినాధా రక్షమాం // ప్రసన్న// 1. నీకును నీ చిత్రమునకు భేదము లేదనుచు మాకు తెలిపితివి నీ చిత్రమునకు చేసిన సేవలు నీకే చెందుననుచు తెలిపితివి భక్తి శ్రద్ధ విశ్వాసములున్నవో, లేవో కానీ

నీ సేవలు చేయుచుంటి గ్రహించెదవో,

ఆగ్రహించెదవో నెరుగని అవివేకిగా నేనుంటిని

మౌనముగా నుందువో లేక మాటాడెదవో

నెరుగ లేనయ్యా సాయి // ప్రసన్న //

2. నిరతము నీ చరణముల దరి నే విడువక నివసించగ నెంచితి సాయి నామ స్మరణము తోడనే సతతము జీవించ దలచితిని //ప్రసన్న// 3. సాయి సేవకుల సద్భక్తులకు సేవలు జేయుచు సచ్చిదానంద మొంద నెంచి తిని కరుణ బరపి ఈ దీనుని మొరలను విని దయ చూపుము - దరికి జేర్చుము //ప్రసన్న//


136) బాబా నిను నమ్ముకుంటి

బాబా నిను నమ్ముకుంటి నీకే మ్రొక్కుచు నుంటి
ప్రేమ గాచెదవన నీవే నా శరణ మంటి
బాబా శ్రీ సాయి బాబా //బాబా//

1. సత్యమునే బలుక కుంటి- ధర్మమున నడవకుంటి
దానముల చేయకుంటి - ఎందుకో నేనిట్లుంటి //బాబా//

2. సచ్చింతన చేయకుంటి - సన్మార్గము నడవకుంటి
సత్సంగము చేయకుంటి - ఎందుకో నేనిట్లుంటి //బాబా//

3. నీ లీలల చదవకుంటి - ధ్యానము చేయకుంటి
భజనలో పాల్గొన కుంటి - ఎందుకో నేనిట్లుంటి //బాబా//

4. మోసంబుల చేయుచుంటి - మోహంబున తిరుగుచుంటి
మహాత్ముల జూడకుంటి - ఎందుకో నేనిట్లుంటి //బాబా//

5. మనసును నిలపకుంటి- మమతలను విడవకుంటి

మాయలను దాటుకుంటి- ఎందుకో నేనిట్లుంటి //బాబా//

6. తల్లివై లాలించు - తండ్రివై నను పోషించు
గురుడవై నను నడిపించు - దైవం బై దరిజేర్పించు //బాబా//

7. పాపముల జేయనీకు- పెడమార్గముల బోవనీకు
పర దూషణ జేయనీకు - సచ్చింతన వదల నీకు //బాబా//

8. దైవ ప్రేమను బెంచి - ఈర్ష్యాసూయల ద్రుంచి
నీ బంటుగా నన్ను గావించి - కరుణించు వరము నిచ్చి //బాబా//

9. సాయి నామది నివసించు- నీ నామమునే పలికించు
నీ చరితమునే చదివించు - నీలోన నన్నిమిడించు //బాబా//

10. నిష్ట సబూరుల బెంచు -నీ సేవల చేయగ నుంచు
సంతోషములో నన్నుంచు - నీ సన్నిధి నా కందించు //బాబా//

11. నాలోన మాయను ద్రుంచు -మమతానురాగము
పెంచు నాకు సద్గతులందించు - సన్మార్గముతో నడిపించు //బాబా//

12. దోసంబుల సంహరించు - పాపంబుల పరిహరించు
నీ పాద భక్తిని బెంచు - నీలో నన్నైక్యమొనరించు //బాబా//

13. దుర్గుణములను పోగొట్టి- అసత్యమును మానిపించి
మంచిగ నను నీవు బెంచి - నీతి నియమాలను బోధించి //బాబా//

14. పరాకు జేసే వేల - కరుణించి కాపాడవేల
జాగు సేయ కోపమేల - నను బ్రోవ వేగ రావేల //బాబా//

15. నీ రూపమును జూడగలేదు- నీ సమాధిని దర్శించగలేదు
నీ చరితమును చదవగలేదు- నీ నామమునే వినగలుగుదు //బాబా//


137) భేద భావము తొలగ జేయుము

భేద భావము తొలగ జేయుము
బ్రహ్మానందము కలుగ జేయుము
భావమందున గాన మందున నిలచి

మమ్ముల నుద్దరింపుము

బాబా సాయి నా బాబా సాయి //భేద//

1. సత్యమేదోతెలియజేయుము
నిత్యమందున నిలిపివేయుము
భక్తి యను భత్యమును వేయుము
ముక్తి పదమును వాస వేయుము //భేద//

2. అణువు అణువున నీవు గలవను
అనుభవముల కలుగ జేయుము
ఆత్మ జ్ఞానము పొంద గలిగెడి
మార్గ మందున నడువ జేయుము //భేద//

3. సుఖము దుఃఖము లనెడి భావన ఎన్నడైనను
కలుగ జేయకుము సుఖము దుఃఖములనెడి
భావనలన్నీ దాటెడి స్థితికి చేర్చుము సచ్చిదానందంబు
నందున శ్యామచరణుని ముంచి వేయుము //భేద//


138) బాబా నిను నమ్మిన బాధలు కలుగునా ?

బాబా నిను నమ్మిన బాధలు కలుగునా ?
సాయీ నిన్ను నమ్మిన శోకము నిలుచునా ?
త్రికరణ శుద్ధిగ భక్తిగ నిన్ను పిలువక యుండిన పలికెదవా
శ్రద్ధతోడ నీ సేవలు చేయక ఆరాధించిన నిలిచెదవా //బాబా//

1. భక్తి శ్రద్ధ విశ్వాసము లుండక
ఎంతగ నిను పిలచినను
పలికెదవా కనిపించెదవా
దయ చూచెదవా- కరుణించెదవా //బాబా//

2. భక్తిగ పిలచిన పలికెద నంటివి
శ్రద్ధగ పిలిచిన నిలిచెద నంటివి
భక్తిశ్రద్ధలు లేని మూర్ఖుడను
నిన్ను ఎప్పుడు చూచెదనో ఎటుల తరియింతునో //బాబా//

3. భక్తి శ్రద్ధలను ఒసగి గావుము
నిష్ట సబూరుల నొసగి బ్రోవుము
ప్రేమ భావమును పెంపొందించుము
దర్శనం మోసగి పలకరించుము //బాబా //

4. సర్వాభీష్ట ప్రదాయక సాయీ
సచ్చిదానంద సద్గురు సాయీ
సర్వమత సమ్మత శ్రీ సాయీ
శ్యామృదయాధివాసా సాయీ //బాబా//


139) మోహనమే సాయి నామం

మోహనమే సాయి నామం
సమ్మోహనమే సాయి రూపం

1. సకల వ్యాధులకు దివ్య ఔషధము
సమస్యలకు అది పరిష్కారము
సచిన్తనలకు ఆలంబనము
సన్మార్గంబున కది ఆధారము //మోహనమే//

2. భక్తి జ్ఞానముల కదియే మూలము
వైరాగ్యమునకు తరుణోపాయము
శాంతి సుఖములకు అది సాధనము
సద్గతు లందుట కదియే మార్గము //మోహనమే//

3. కలియుగమున కది కర్మనాశకము
సత్పురుషుల కది సోహం నాదము
సకల జీవులకు శాంతి దాయకము
శ్యామాదులకు ముక్తిదాయకము //మోహనమే//


140) వందనములను గొనుమా

వందనములను గొనుమా
వాయునందన హనుమా

1. శరణు శరణంటి హనుమా
సద్భక్తి నొసగవే హనుమా
వినుతించెద జయ హనుమా
వీడక బ్రోవుము హనుమా //వందనము//

2. అభ్యర్థించెద హనుమా
నన్ను ఆదరించవే హనుమా
అర్ర్చించెద జయ హనుమా
ఆశీస్సుల నొసగవే హనుమా

3. సన్నుతి జేసెద జయ హనుమా
సద్గతుల నోసగవే హనుమా
సతతము దలచెద హనుమా
శ్యామాదుల గావవే హనుమా //వందనము//


141) వ్యర్థపు యోచన లెందుకు మనసా

వ్యర్థపు యోచన లెందుకు మనసా
వ్యామోహంబులు ఎందుకె మనసా
నిరతము చింతన చేయుచు నుందువు
జనన మరణ చక్రంబున నుందువు //వ్యర్థపు//

1. పంచ భూత సమ్మేళ మగునది దేహంబని నీ వెరుగుదువే
పుట్టుట గిట్టుట లన్ని జీవులకు సహజంబని నీ వెరుగుదువే
అశాశ్వతంబౌ ఆస్తి సంపదలు మోహమయంబని దెలియుదువే
దెలిసి దెలిసియు దెలివి లేక పెడ మార్గములందున దిరిగేదవే //వ్యర్ధపు//

2. ఆశయే సర్వ దుఃఖంబులకు మూలంబని
నీ వెరుగుదువే అహంకార మమకార పరంపర

లంధకారమని దెలియదువే దెలిసి దెలిసియూ
దెలివి లేక పెడమార్గము లందున దిరిగేదవే //వ్యర్థపు //

3. పరబ్రహ్మమున మనసును నిలుపగ ప్రయత్నించవే మనసా
సత్య ధర్మ పధ గమనము లందున సాగుచుండవే మనసా
నిష్ట సబూరుల గలిగి యుండి నిజ మార్గము తెలియవే మనసా
శ్యామ చరణ సన్నుతుడగు సాయిని సతతము దలచవే మనసా //వ్యర్థపు//


142) వలదయ్యా - నను వదలకు మయ్యా

వలదయ్యా - నను వదలకు మయ్యా
పాపాత్ముడనని నాపై కోపము //వలదయ్యా //

1. పవిత్రతయు యిసుమంతయు లేదని
పరమ భక్తి నలుసంతయు లేదని
సదాలోచనలు సుంతయు లేవని
సదా చరణ శూన్యంమని - అలుక //వలదయ్యా //

2. దురాచారుడని దుర్మార్గుడనని
సాధు పోషణలు సేవలు లేవని
సమయాను కూలముగ నుండునని
స్వార్థ పరాయణుడని - అలుక //వలదయ్యా //

3. ధర్మ న్యాయముల దలచు ననుచుననీ
నీతి నియమముల పాటించనని
సత్య మార్గమున సంచరించని
సజ్జన దూషణ జేయుదుననీ - అలుక //వలదయ్య //

4. సద్గురువులను సరకు జేయనని
సత్సంగముల పాల్గొనననీ
సద్భక్తుల సహవాసము లేదని
సద్భాషణలను జేయనని - అలుక //వలదయ్య //

5. పూర్వ పుణ్యమున నిన్ను దలచితిని
రక్షించెదని మది నమ్మితిని
నీ దరికి లాగ నిను శరణంటిని
శ్యామదేవుని కరుణించ మంటినని - అలుక //వలదయ్య//


143) వలదు - వలదు సాయీ !

వలదు - వలదు సాయీ !
నను వదల వలదు సాయీ !
నను వదిలిన నాశనమై
నరకములో బడి పోవుదు _ //వలదు //

1. ధర్మమే దహనమై
నీతియె నిర్మూలనమై
న్యాయమే నశియించు చున్న
స్థితి గతులలో నన్నుంచ //వలదు //

2. ప్రేమయే నశియించు చున్న
ద్వేషమే పెరుగుచున్న
స్వార్థము సంసారమున్న
మనసులతో నన్నుంచ //వలదు//

3 .ఆడంబర మధికమైన
ఆలోచన తక్కువైన
ఆచరణయే శూన్యమైన
మనుషులలో నన్నుంచ //వలదు//

4. నయవంచనతో నిండిన
దయా రహితమౌ బ్రతుకుల
ఢంభముతో గడుపుచున్న
సంఘములో నన్నుంచ //వలదు//

5. అజ్ఞానం అధికమై
నిను వదిలిన నను వదలక
నను వదిలిన నిను వదలను
మన మధ్యన భేదముంచ //వలదు//

6. దెలిసి దెలియక గడచిన జన్మలలో
జేసినట్టి కర్మములకు ప్రతి ఫలముగ
ఈ జన్మము కలిగేనేమో అటులికపై

జేయించక జన్మములను కలిగించక గావ వేడెద
శ్యామ చరణేశ్వరా -దేవా //వలదు//


144) శ్రీ స్వామిని సేవించుటలో

శ్రీ స్వామిని సేవించుటలో
శ్రీనాధుని భజియించుటలో
కలుగులే ఆనందము
తొలగులే మన పాపము //శ్రీ స్వామి //

1. రామకృష్ణుల రమ్య స్వరూపం
శ్యామ సుందర విగ్రహ రూపం
కరుణ మమతలు కలిసిన రూపం
మన కనుల కగపడు సద్గురు రూపం // శ్రీ స్వామి //

2 .మన ఆత్మల కోసగును అనంతశక్తి
మనసుల పెంచును మరింత భక్తి
ముసలెడి తీరుల తెలుపును యుక్తి
చివరకు కూర్చును మన కిల ముక్తి
ఈ మాయల నుండి విముక్తి --- //శ్రీ స్వామి//


145) శరణు శరణు రఘురామా...

శరణు శరణు రఘురామా...
సాయిరామా.. సాయి దత్త గురునామా
సద్గురు ధామ... ప్రభో సాయి రామ //శరణు//

1. సాయీ.. సాయీ‌.... అని స్మరించిన చాలూ
సకల పాపంబులే సమసి పోవూ...
సాయి సద్గురు కరుణే... సదా తోడు నీడయై
గాచి రక్షించి ప్రేమ మీర బ్రోచు గాదా... //శరణు//

2. సకల దైవ స్వరూపములు సాయియే
సకల ప్రాణి స్వరూపములు సాయియే
ఎవ్వరెటుల బిలచినా... ఎవ్వరెటుల గొలిచినా...
తానే ఆలకించి సర్వము సమకూర్చు గాదా... //శరణు//


146) శరణము శరణము రామా సాయి

శరణము శరణము రామా సాయి
నీ దివ్య చరణమే శరణము సాయి //శరణము//

1. మ్రొక్కెద మ్రొక్కెద రామా సాయి
మోద మలర మము గావుము సాయి //శరణము//

2. వేడెద వేడెద రామా సాయి
వేదనలను తొలగించుము సాయి //శరణము//

3. పూజించద పూజించద సాయి
పుణ్యాత్ములలో కలుపవే సాయి //శరణము//

5. అర్చించెద అర్చించద సాయి
అనవరతము నను బ్రోవుము సాయి //శరణము//

6. ధ్యానించద ధ్యానించెద సాయి
దరైశన మొసగుము దత్త గురు సాయి //శరణము//

7. సేవించద సేవించెద సాయి
సమాధి నిష్ట నోసంగుము సాయి //శరణము//

7. వినుతించెద వినుతించెద సాయి
వినయ వివేకముల పెంచుము సాయి //శరణము//

8. విశ్వాసంబును పెంచుము సాయి
నిష్ఠ సబూరుల బెంచుము సాయి //శరణము//

9. నుతియించెద నుతియించెద సాయి
సద్గదులను కలిగించవే సాయి //శరణము//

10. ప్రార్ధించెద ప్రార్ధించెద సాయి
పరమ పదము నా కొసగవే సాయి //శరణము//

11. సమర్థ సద్గురు దేవా సాయి
శ్యామచరణ సన్నుత శ్రీ సాయి //శరణము//


147) మంగళం జయ మంగళం

మంగళం జయ మంగళం
మంగళం శుభ మంగళం

శ్రీ సాయినాధునకు శిరిడీ నివాసునకు //మంగళం //
ప్రేమ స్వరూపునకు - పరమాత్మ రూపునకు //మంగళం//
శివరామ కృష్ణునకు - మారుతి రంగనికి //మంగళం//
దత్త గురునాథునకు - ధర్మావతారునకు //మంగళం//

సాఫల్య దాతకు - సద్గతి ప్రదాతకు‌‌ //మంగళం//
కాల నిర్ణేతకు - కైవల్య దాతకు //మంగళం//
కులమత రహితునకు - శ్యామ దేవునకు //మంగళం//
జగమేలు తండ్రికి - జయ చిద్విలాసునకు //మంగళం//


148) శ్రీరామ జయరామ - జయ జయ రామా

శ్రీరామ జయరామ - జయ జయ రామా
జయ జయ రామ - జయ రామ శ్రీరామా //శ్రీరామ //

మనసున నిలిచి శ్రీరామా - మాయ తొలగించు శ్రీరామా

భక్తిని పెంచుము శ్రీరామా -‌మా బాధల మా బాపుము శ్రీరామా //శ్రీరామ//

దిగులు తొలగించు శ్రీరామా - దిక్కు నీవయ్య శ్రీరామా
దారుల జూపుము శ్రీరామా - దయ జూపమయ్య శ్రీరామా // శ్రీరామ //

కామితము దీర్చు శ్రీరామ - కరుణను చూపి శ్రీరామ

శామసన్నుతా శ్రీరామ -సద్గతి నీయవే శ్రీరామ //శ్రీరామ //


149) శిరిడీ వాసా... శ్రీ సాయీశా...

శిరిడీ వాసా... శ్రీ సాయీశా...
నీ పదముల నెర నమ్మితి మయ్య
మము దయ గనుమా పరమేశా //శిరిడి //

1. తల్లివి నీవై... తండ్రివి నీవై
గురుడవు నీవై.... దైవము నీవై
భక్త జనులను పరిరక్షించగ
ద్వారకా మాయి యందు వెలసిన //శిరిడి//

2. రాముడ నీవై... కృష్ణుడనీవై
ప్రేమ స్వరూపా... సత్య స్వరూపా
శివుడవు నీవై.... భవుడవు నీవై
సాధు స్వరూపా ---సత్య స్వరూపా
సకల దేవతా రూపుడ నీవై
శ్యామాదులనూ పరిపాలించెడి //శిరిడి//


150) శిరిడీ నుంచి వచ్చినావా సాయి రామయ్యా

శిరిడీ నుంచి వచ్చినావా సాయి రామయ్యా
ప్రేమ జూపి చిత్రముగ ఇంటికి దయజేసి నావయ్యా //శిరిడీ//

శిరిడీ క్షేత్రము చూడగలేదు శ్రీకర సాయిశా
ద్వారక మాయిన అడుగిడ లేదు భయహర శిరిడీశా
నీ సమాధిని తాకగ లేదు జయ హర జగదీశా
నీ పాదుకలను సేవింప లేదు రఘువర పరమేశా //శిరిడీ //

2. ఎప్పుడు దలచిన అప్పుడే మమ్ము అలరింతువయ్యా
ఎక్కడ దలిచిన అక్కడే మమ్ము రక్షింతువయ్యా
నీ చిత్రములో విచిత్రములనే జూపింతువయ్యా
నమ్మిన వారిని వదలక ఎప్పుడు ప్రేమింతువయ్యా //శిరిడీ//

3. నీ లీలలనూ తెలియగ లేని నీ పిల్లలమయ్యా
నీ మహిమల గుర్తించగా లేని జనులము మేమయ్యా
నీ చేతులకు అర్థము తెలియని ఆశ్రితులమయ్యా
శ్యామ సన్నుతుడె దిక్కు మా కనుచు నమ్మి నారమయ్యా //శిరిడీ//

Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)