Posts

Showing posts from November, 2022

(335) 30 November (30.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 30 Nov ప్రార్థనలో, భక్తిలేని మాటలకన్నా మాటలులేని భక్తియే శ్రేష్టము. In prayer, the devotion without words is superior than the words without devotion. 

(334) 29 November (29.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 29 Nov విశ్వాసంతో భగవంతుని నామం గానం చెయ్యి. ధైర్యం కలిగి ఉండు. ఆ దైవానికి నీ సర్వస్వం అప్పగించు. మనకు ఏమీ తెలియదు. ఆయనే సర్వజ్ఞుడు. కనుక ఆయన్నే ప్రార్ధించు. Sing the name of God with faith. Have the courage. Surrender your all to the God. We know nothing. He is the Omniscient. So pray to Him. 

(333) 28 November (28.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 28 Nov నిరంతర దైవ స్మృతి సంపూర్ణ శరణాగతికి దారి తీస్తుంది. దీనివల్ల మనసు ఉన్నతి చెంది దైవ చేతనతో శృతి కలుపుతుంది. Constant divine remembrance leads to complete surrender. This causes the heart to be elevated and harmonized with the divine consciousness. 

(332) 27 November (27.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 27 Nov ఈరోజు నేను ఏదైనా తప్పులు చేసి ఉంటే క్షమించి ఆ తప్పులు మళ్లీ చేయకుండా చేయి తండ్రి. ఈ శరీరము నిద్రపోతోంది తండ్రీ అని చెప్పుకొని నిద్ర పోవాలి. Divine Father, forgive me if I have done any mistakes today and also make me to not do them again. Say to Divine father that, this body is going to sleep. 

(331) 26 November (26.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 26 Nov ఈ శరీరము నిద్ర లేచింది తండ్రి మీ ఆశయాలకు ఆదర్శాలకు అనుగుణంగా నన్ను నడిపించు తండ్రి అని నిద్రలేవాలి. This body is awakened from sleep. Divine Father guide me in accordance with your ambitions and ideals should sleep. 

(330) 25 November (25.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 25 Nov నిద్రపోయే ముందు నామము చెప్పుకుంటూ నిద్రపోయి, మెలుకువ రాగానే అంటే కళ్ళు తెరవక ముందే నామము గుర్తుకు వస్తే రాత్రి అంతా నామము చేసినట్లే అవుతుంది. Before going to sleep chant the name, When you wake up with remembering the name, means it will be like doing the chant for whole night. 

(329) 24 November (24.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 24 Nov ఉదయాన్నే నిద్ర లేవగానే కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థించి, ఈ శరీరం నిద్రలేచింది, నేను చేసే ప్రతి పనిలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి చూపులోనూ నీవే అనంతశక్తి రూపముగా ఉండి, నన్ను నడిపిస్తున్నావు తండ్రి అని అనుకొని ప్రార్థించి లేవాలి. When I wake up in the morning I close my eyes and pray to loved God, and think "Father this body waken up, And in its every work, in every word, in every look, you (God) are in the form of infinite power and making me to move." 

(328) 23 November (23.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 23 Nov ఓర్పు రావాలి అంటే తనకు ఇష్టమైన దైవమును/గురువును విశ్వసించి జరిగేదంతయూ దాని సంకల్పమేనని అది మన మేలునకేనని, ప్రతి విషయములోని మంచిని గ్రహించడానికి తీవ్రముగా ప్రయత్నించి, మంచిని గ్రహించగలిగే వివేకమును సంపాదించుకొనుట వలన భగవత్తత్వము/గురుతత్త్వము యొక్క శక్తిని గుర్తించుటకు వీలు అగును. To be patient, one must trust his/her loving God/Guru and have the perception of "Everything happened was for our good with the will of God/Gurudev". Try hard and realize the good in everything happens. The perception of gaining the recognition of good helps in understanding the power of the Divine/Guru philosophy. 

(327) 22 November (22.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 22 Nov సమర్ధుడైన సద్గురువు సరైన శిక్షణ ఇచ్చి పరిరక్షణతో గమ్యం చేర్చును కానీ ప్రయత్నం అంతయు ఆయా బుద్ధిజీవులదే. తీవ్రమగు జిజ్ఞాసతో సద్గురువు మార్గదర్శకములో పయనించిన సత్ఫలితములు త్వరగా చేకూరును. జిజ్ఞాస ధ్యాస తీవ్రతను బట్టి ఫలితములు త్వరగానో ఆలస్యంగానో సంప్రాప్తించును. A Competent Gurudev will give proper training and guide to achieve the goal with protection but all the effort is on the respective intellectuals. The good results of the journey are under the guidance of the Gurudev with intense knowledge, this will not come soon. The results will be achieved sooner or later based on the intensity of cognitive meditation. 

(326) 21 November (21.11.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 21 Nov నీ గురువర్యుని బోధనలను అనుభవమునకు తెచ్చుకుంటే, నీలోనే దాగియున్న ఆధ్యాత్మిక సంపదలను కనుగొనగలవు. If you experience the teachings of Gurudev, you can to discover the hidden spiritual treasures within yourself. 

(325) 20 November (20.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 20 Nov ఎల్లప్పుడు సత్సహవాసం ఏర్పరచుకో. మిత్రులను, పుస్తకాలను జాగ్రత్తగా ఎన్నుకో. పవిత్రులతో, గొప్పవారితో సంబంధం కల్పించుకో. అన్ని విధాలా చెడు సహవాసాన్ని విసర్జించు. Always establish good companionship. Choose friends and books carefully. Connect with the saints, the great. Abandon bad association by all means. 

(324) 19 November (19.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 20 Nov ఎల్లప్పుడు సత్సహవాసం ఏర్పరచుకో. మిత్రులను, పుస్తకాలను జాగ్రత్తగా ఎన్నుకో. పవిత్రులతో, గొప్పవారితో సంబంధం కల్పించుకో. అన్ని విధాలా చెడు సహవాసాన్ని విసర్జించు. Always establish good companionship. Choose friends and books carefully. Connect with the saints, the great. Abandon bad association by all means. 

(323) 18 November (18.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 18 Nov నామం పావనమైనది. అఖండ నామ స్మరణ తీరానికి చేరుస్తుంది అని నమ్మకం ఉంటే వేరే ఇతర సాధనాలు అవసరం లేదు. నామం మోక్షాన్ని కలిగిస్తుంది. నామముయందు శ్రద్ద గల వారికి సర్వ పాపాలు ప్రక్షాళన అవుతాయి. నామాన్ని సదా జపించెడివాడు గుణవంతులలో గుణవంతుడు. The name (Chant) is sacred. If you believe the Integrity Chant will reach the shore, No other tools are needed. The chant brings salvation. All sins will be purged of those who pay attention to the chant. The one who always chants the name is the best among the virtuous. 

(322) 17 November (17.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 17 Nov సత్య, ధర్మ, ధైర్య, తృప్తి, నియమ నిబంధనలకు అనుగుణముగా బ్రతుకుచు ఇతరులకు ఇబ్బందులను కలిగించక జీవించువారు దైవ/ గురు కృపకు పాత్రులు. Those who live according to the virtues of truth, righteousness, courage, contentment and discipline without causing trouble to others, deserve the grace of God/Guru. 

(321) 16 November (16.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: అన్ని అవరోధములను అధిగమించుటకు మానసిక మౌనమే అత్యున్నతమగు సాధనము. Mental silence is the supreme tool for overcoming all obstacles. 

(320) 15 November (15.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 15 Nov నీలో దైవం కొరకు ప్రేమ ఎంతెంతగా పెంచుకుంటూ పోతే అంతంతగా కామక్రోధాదులు వెనుదిరిగి పోతాయి. కనుక ఆయన్ను ప్రేమించడానికి నిన్ను ఆశీర్వదించమని ఆ దేవుణ్ణి ప్రార్థించు. The more you grow the love for God in you, the more the lust-angry will go away from you. So pray to God to bless you to love him. 

(319) 14 November (14.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Nov నైతికమనేది, మనల్ని మనం ఎలా సంతోషవంతులుగా చేసుకోవాలో తెలియజెప్పే సిద్ధాంతం కాదు. మనం ఆనందాన్ని అనుభవించడానికి మనల్ని ఎలా అర్హులుగా చేసుకోవాలో తెల్పేదే అది. సంతోషము - భౌతికమైనది మరియు ఇంద్రియాధీనము, నశించేది. ఆనందము - పారమార్థికమైనది, ఇంద్రియాతీతము, శాశ్వతమైనది. కావున దైవాన్ని స్మృతియందుంచుకొని ప్రార్థించు. Morality is not a theory that tells us how to make ourselves happy. It tells us how to qualify ourselves to experience happiness.  Gleefulness (Santhosham) - Material and sensual, perishable.  Happiness (Anandam)- Transcendental, phenomenon, eternal. So remember God and pray. 

(318) 13 November (13.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Nov భగవంతుని మీద భక్తి కావాలి అని భగవంతుడినే ప్రార్థించాలి. నీ సేవ చేసుకుని నిన్ను మరిచిపోకుండా చెయ్యి అని ప్రార్థించాలి. We should pray to God that we need devotion on God. I have to pray that let me do your service and do not make me forget you. 

(317) 12 November (12.11.)

Image
  శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Nov నీ గురు పాదపద్మములపై దృఢ దృష్టి నిలుపు. అమృత పానానందము కొరకై భక్తి ప్రపత్తులతో వారి పవిత్ర నామ సంకీర్తనం గావించు. Stay focused on your Guru lotus feet. For Elixir-Enjoyment, sing the hymn of holy name with devotion. 

(316) 11 November (11.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 11 Nov గురుపౌర్ణమి రోజు అయినా గురువుకి దగ్గరగా ఉండాలి. ఎవరిని నిందించరాదు, అనవసరంగా మాట్లాడ కూడదు. ఈ ఒక్క రోజు అయినా నన్ను నీ నామాన్ని చేసుకోనివ్వు తండ్రి అని ప్రార్థించాలి. Atleast on the day of Guru Purnima, Must be close to Gurudev. Pray to divine father that At least for this one day, I don't blame anyone, don't talk unnecessarily, I have chant your name. 

(315) 10 November (10.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Nov సద్గురువు దగ్గర వినయముగా ఉండవలెను.  వినయము వలన వివేకము,  వివేకము వలన విచారణ,  విచారణ వలన చింతన,  చింతన వలన సాధన ఎక్కువ అవుతుంది.  నిరంతర చింతనే సాధన. One should be humble near Sadguru.  Humility leads to wisdom,  wisdom leads to inquiry,  Inquiry leads to thought,  thought leads to practice.  Continuous thinking (On one subject) is the Divine Practice. 

(314) 09 November (09.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 9 Nov ఈ శరీరము నాది కాదు గురువుది లేదా భగవంతుని అని నిరంతరము చింతన చేయాలి. We should always think. This body is not mine, it is Guru's or the God's one. 

(313) 08 November (08.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Nov ఈ జీవితము మీది, ఈ జీతము (అంటే డబ్బులు) మీది అని చెప్పి భగవంతుని ముందర పెట్టి, నా అవసరాలకు ఖర్చు చేసుకుంటాను, ధర్మ కార్యాలకు వినియోగిస్తాను అని భగవంతునికి చెప్పుకోవాలి. I have to tell God that "This life is yours", this salary (i.e. money) is yours and I will spend it for my needs and use it for righteousness deeds. 

(312) 07 November (07.11.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Nov సద్గురుని సేవించుట అనగా గురువు మనకు విధించిన దినసరి కర్తవ్యాలను ప్రతిఫలాపేక్ష లేకుండా పరిపూర్ణముగా ఆచరించి ఆత్మ సంతృప్తి పొందుటయే. Serving Sadguru means, performing the daily duties assigned to us by the guru perfectly without any reward to get get self satisfaction. 

(311) 06 November (06.11.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: (6 Nov) నిరంతరం నామం చెప్తుంటే గురుసేవ చేస్తున్నట్టే. Constantly chanting the name, is like serving the Guru.

(310) 05 November (05.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 5 Nov సత్య, ధర్మ, ధైర్య, తృప్తి, నియమ నిబంధనలకు అనుగుణముగా బ్రతుకుచు ఇతరులకు ఇబ్బందులను కలిగించక జీవించువారు దైవ గురు కృపకు పాత్రులు. Those who live according to truth, dharma, courage, satisfaction, rules and not causing problems to others are the ones deserve the grace of the Divine Guru. 

(309) 04 November (04.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Nov మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను గురువుకు చెప్పుకుని ధ్యానం చేసుకోవాలి, భావనతో నామము చేస్తూ ఉండాలి . తర్వాత మనకే సమాధానం దొరుకుతుంది, లేదా ఎవరైనా ఆ సమయానికి వచ్చి మనకు సమాధానం చెప్తారు, లేదా ఏదైనా పుస్తకంలో సమాధానం దొరుకుతుంది. When we have any problem, we should convey that problem to the Gurudev. and meditate and keep chant with feel. Later we find the answer by ourselves or someone will come at that time and answer us, or find the answer in any book. 

(308) 03 November (03.11.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 3 Nov ఆవలింత,, అపానవాయువు, తుమ్ము వచ్చినప్పుడు కుడి చెవిని మూసి భగవన్నామం చెప్పుకోవాలి. (ఎందుకంటే కొన్ని అనుసంధాలు ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటాయి) When yawning, fart, sneezing are coming close your right ear and chant God name. (Because some connections are always make remember). 

(307) 02 November (02.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 2 Nov భగవంతుని ప్రేమను గురించి కానీ, దయ గురించి కానీ, తత్వాన్ని గురించి కానీ ఈరోజు చింతన చేశానా అని రోజు అనుకోవాలి. Think daily that, whether we are thinking about the God's love, mercy or principle. 

(306) 01 November (01.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 1 Nov సాధన అంటే ఎవరికి వారే వాళ్లే చేసుకోవాలి. సాధనలో భజనలు, కీర్తనలు, విశ్వాసము కలిగిన దాని యొక్క నామ జపము, రూపచింతన కలిగి ఉంటాయి. మన ఇంట్లో ఏకాంతంగా ఉన్నప్పుడు నామము గట్టిగా చెప్పుకోవాలి. చాలా మందిలో ఉన్నప్పుడు మానసికంగా చేసుకోవాలి. సాధన మానకూడదు. Sadhana (Practice) means that they have to do it themselves. The Sadhana Have form thinking which includes chorus (Bhajans), hymns (Kirthanaas), faithful chanting (Japam). When we are alone in our house, we need to say the name loudly. Mentally to do when there are many arround. Sadhana should not be stopped.