Posts

Showing posts from 2022

(366) 31 December (31.12.)

Image
  శ్రీ శారద శ్యామ సందేశం: నిన్ను నీవు తెలిసికొనదలతువా? పరిపూర్ణమైన ప్రేమగా మారిపో, అంతట నీవు నిన్ను కనుగొందువు. దేవుని ప్రేమించు, పరులను సేవించు. Do you want to know yourself? Change to perfect love and you will find yourself. Love God, serve others. (31 Dec)

(365) 30 December (30.12.)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 30 Dec శారీరక మానసిక బలహీనత ప్రమాదకరం, శ్రద్ధతో భగవంతుని ప్రార్థించు ఆయన నీ రక్షణకు రాగలడు. గతాన్ని మరచిపో, భవిష్యతుకు ప్రణాళిక వేసికో, నీవు మహాత్ముడవు కాగలవు. Physical and Psychological weakness is dangerous, pray to God diligently and He will come to rescue. Forget the past, plan for the future, you can be great. 

(364) 29 December (29.12.)

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 29 Dec దైవ కృపలేనిదే నీవు ఏమీ సాధించలేవు. కనుక ఆయన అనుగ్రహం కొరకై హృదయ పూర్వకంగా ప్రార్థించు. అందుకు అనుగుణంగానే ఆయన ప్రతిస్పందన ఉంటుంది. Without divine grace you can achieve nothing. So pray whole heartedly for His grace. His response will be accordingly.   

(363) 28 December (28.12.)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 28 Dec ఆత్మ నిగ్రహం గల వ్యక్తి 1. క్షమా గుణం 2. సాధుస్వభావం కలిగి ఉంటాడు. ప్రార్థన దేవుని మార్చదు. "ప్రార్ధన" చేసే వారినే మారుస్తుంది. One with self restraint is has 1. Forgiveness 2. Holy Nature. Prayer does not change God. It changes those who “pray”. 

(362) 27 December (27.12.)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 27 Dec సమగ్ర దైవ భక్తిలోనే అత్యున్నత స్వేచ కూడి ఉంటుంది. నీ సాధనను దైవంతో ఆరంభించి, దైవంతోనే ముగించు In the inclusive devotion towards God, the highest freedom is found. Begin your practice with God and end with God. 

(361) 26 December (26.12.)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 26 Dec సృష్టికర్తయైన దేవుడు మన తల్లి కనుక, ఆయన్నే సుఖంలోను, దుఃఖంలోను నిష్కపటంగా, నిలకడగా అర్ధించు. God, the Creator, is our mother, express Him sincerely and steadfastly in happiness and sorrow.

(360) 25 December (25.12.)

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 25 Dec దైవనామం విశ్వాసంతో ప్రతిరోజు త్రికాలాల్లోను చప్పట్లు చరుస్తూ బిగ్గరగా పలుకు అది నిన్ను చక్కగా మలుచును. Everyday in the three quarters, Loudly by clapping praise the name of God and it will make you feel good. 

(359) 24 December (24.12.)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 24 Dec సవ్యమైన భావాలను కలిగివుండు. దానివల్ల నీ జీవితం అన్ని విషయాల్లోనూ విజయం పొందగలదు. దేవుని ప్రార్థించు ఆయనకు పూర్ణ శరణాగతుడవు కమ్ము, ఆ తర్వాత నీ పరీక్షలను నీ సమస్యలను ధైర్యంగా ఎదుర్కో. Have the sense of decency. In that way you will be successful in all aspects in life. Pray to God and completely surrender to Him, then face your problems and challenges with courage. 

(358) 23 December (23.12.)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 23 Dec ఎవని మనస్సు, వాక్కు, పరిశుద్ధమై అతని అధీనంలో ఉంటాయో అతడు వేదాంత ఫలాలను పొందుతాడు. మహాత్ముల చరిత్రలు మనలను మంచి బాటలో నడిపి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. Whose mind, words are under his control and pure. Those get the fruits of Theology (Vedanta). Studying the histories of the Divine People (Mahatmas) guide us on a good path and impart knowledge. (Vedanta is Upanishads, fruits of is of Non-Duality/Uni State). 

(357) 22 December (22.12.)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 22 Dec నీ అనుభూతులను, ఆవేశాలను, అణచవద్దు, ఎవరి వద్ద నీవు స్వేచ్చగామనగల్గుదువో ఆయనతో హృదయంలోని భావాలను పంచుకో. Don't suppress your feelings, your anger, share your feelings with whom you feel free. 

(356) 21 December (21.12.)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 21 Dec విశ్వాసంతోను, సహనంతోను మనం వేచివుండగలిగితే, మహాత్ములయెడ, పెద్దలయెడ, గురువులయెడ మనము చూపు వినమ్రపూర్వక గౌరవములు, మన పరిశుద్ధ భావములు, మనశరణాగతి, సరైన సమయంలో మనకు అనిర్వచనీయమైన ఆనందానుభూతిని గలుగజేస్తాయి. If we will wait with faith and patience, Our humble honors, our surrendering and our pure perceptions we show to sages, elders, Guru will give us indescribable blissfulness at the right time. 

(355) 20 December (20.12.)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 20 Dec భౌతిక వస్తువులను ధనంతో పొందవచ్చు కాని దివ్యానుభూతి ఒక్కరుగ మాత్రమే పొంద వీలగును. Material things can be obtained with money, but the divine feeling can be obtained by one only. 

(354) 19 December (19.12.)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 19 Dec ఆత్మ విశ్వాసం కలిగివుండు, నీ గురువు యొక్క మార్గదర్శకత్వంలో ధైర్యంగా సరైన మార్గంలో సాగిపో. Be confident, walk boldly on the right path under the guidance of your Sri Guru. 

(353) 18 December (18.12.)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 18 Dec దైవానుగ్రహాన్ని అనుభవించడానికై నీకై నీవు శరణాగతితో ఆదైవ ఉపకరణంగా అనుభూతినొందు. అప్పుడు దైవంలేక గురు సేవకునిగ - నీకు, నీ అభిప్రాయములకు, నీకార్యాలు మొదలైన వానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉండదు. ఆ అనంత శక్తి సలహాలను నిరంతరం అన్ని విధాల విధేయతతో అనుసరించడం ఒక్కటే నీకు మిగిలివున్న స్వేచ్ఛ. In order to Enjoin in the Divine Euphoria, Surrender yourself and experience as a divine tool. Then as God/Guru servent, You have no freedom for you, for your opinions, your deeds, etc. The only freedom you have left is to constantly follow in those infinite power suggestions obediently in all ways. 

(352) 17 December (17.12.)

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 17 Dec నీ గురువు నీతోవుంటున్నాడని భావించి సాధనలో ధైర్యంగా ముందుకు సాగిపో. Feel that your Guru is with you and confidently move forward in the practice. 

(351) 16 December (16.12.)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 16 Dec ఈ దివ్యసందేశాలను ఆసక్తితో అధ్యయనంచేస్తూ వాని అంతరార్ధాన్ని అవగాహన చేసికొను శక్తిని ప్రసాదింపుడని గురువును ప్రార్దించు. Study the divine messages with interest, and Pray the Guru to get power of understanding the intuition of it. 

(350) 15 December (15.12.)

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 15 Dec కర్తవ్య కర్మలన్నీ నీ గురువే నీకు అప్పగించారనీ, ఆయన నిరంతరాయంగా నిన్ను కనిపెట్టుకొని వుంటున్నారని భావించు. Assume that all the duties are given to you by your Guru and he is constantly watching over you. 

(349) 14 December (14.12.)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 14 Dec మన జీవితాలు దైవ సంకల్పంతో నడపబడ్డవి కనుక మన కోర్కెల మేరకు, మన సంకల్పం మేరకు, మన భావాల మేరకు నెరవేరాలని కాంక్షించకు. Our lives were driven by divine will, so we do not wish to fulfill our life, according to our desires, according to our will, according to our feelings. 

(348) 13 December (13.12.)

Image
  శ్రీ శారద శ్యామ సందేశం: 13 Dec 1. అనుకున్నది నిజమని భ్రమించక నిజమేదో తెలుసుకో. 2. ఇష్టమైన దానికి దూరము గాక తప్పదు. అఇష్టమైన దానిని అనుభవించక తప్పదు.  3. దేనిని అసహ్యించుకున్న, ద్వేషించిన ఏదో ఒక నాటికి వాటిని అనుభవించక తప్పదు. 4. మనసే మనిషికి ప్రధమ శత్రువు. 5. సచ్ఛీలమే సర్వేశ్వరుని తెలుసుకొను మార్గము చూపగలదు. 1. Do not assume that what you think is true, but know the truth 2. You have to get away from what you like. You have to experience what you don't like. 3. Whatever one disgusts, that one has to experience that disgust someday. 4. The mind is Human's first enemy. 5. Only Good Character can show the way to know the Almighty

(347) 12 December (12.12.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Dec ఈ నెలలు చాల విశేషమైనవి. పవిత్రమైనవి. ఫిబ్రవరి వరకు తలచిన ఉద్దేశాలు పలు ఫలితాలనిస్తాయి. దయచేసి మీ సంకల్పాలను, చర్యలను, నిర్మలంగా వుంచుకొండి. దైవంతో గాని గురువుతోగాని సత్సంబంధాన్ని ఏర్పరచుకోండి. భవిష్యత్తుకు పథకం వేసికోండి, అవసరమైన సద్గుణాలని సంతరింపచేసికోండి, తల్లిదండ్రులను మరువకండి అందరిని సేవించండి. These months are very special and sacred.  Intentions that are set up until February will yield many results. Please keep your intentions, actions, serene. Establish a happy relationship with God or Guru. Plan for the future, cultivate the necessary virtues, do not forget the parents and serve everyone. 

(346) 11 December (11.12.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: నిన్ను నీవు ఎన్నటికీ చులకన చేసుకొనకు, దైవ సూచనలను పాటించు, నీ అంతర్వాణి ప్రభోధాన్ని ఆలకించి నడచుకో, నీవిధులను సక్రమంగా నిర్వర్తించు. నీ భావాలను అశాశ్వత విషయాల నుండి మరల్చి శాశ్వత విషయాలపై నిలుపు, సర్వులు దేవుని బిడ్డలే, ఎవరు ఎవరిని శాసించ జాలరు, తటస్థ పద్ధతి ఉత్తమమైనది. మనం దైవానుగ్రహానికి, బ్రహ్మానందానికి పాత్రులం కావాలి. సత్యము, సహాయ స్వభావము, మాతా పితరుల సేవ, పరుల దోషాలు మన్నించి మరచుట, అనేవి దైవగుణములు. Never underestimate yourself, obey God's instructions, listen to your intuition and go, and perform your duties properly. Turn your feelings away from the impermanent and hold on to the eternal. All are children of God, No one can judge anyone, neutral method is the best.We all should be part of God's grace and bliss. Truth, helpful nature, service to parents, forgiving and forgetting the faults of others are the divine qualities. 

(345) 10 December (10.12.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Dec సత్సంగము (నిజమగు సత్పురుషులతో వుండటం) నిరంతర భగవన్నామ జపము, ప్రేమతో దైవాన్ని రూపముతోగాని, రూపము లేకుండా గాని పూజించడం త్వరగా తరించడానికి మార్గములు. Good Companionship (being with true virtuous men), Constant Chanting of divine name, With Love worshiping God, with or without form, is a quick way to emancipation. 

(344) 09 December (09.12.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 9 Dec ఏకాగ్ర హృదయంతో అచంచలంగా నన్ను ఎవరైతే స్మరిస్తూ ఆరాధిస్తారో, వారికి నేను రక్షణ పొందే శక్తిని ప్రసాదిస్తాను. If you admire me with progressive concentrated heart I will grant them the power of protection. 

(343) 08 December (08.12.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Dec దేవుడు గొప్ప దయాళువు. దైవ ప్రార్ధన మన అర్హతను బట్టి ఆయన సంకల్పాన్ని బట్టి మంచి ఫలితాలనిస్తుంది. ఉత్తమ ప్రార్ధన అత్యంత శక్తివంతమైన ఆయుధం. కనుక నిర్భయంగా ఎంతటి కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొ. God is Great Kind-hearted. "Prayer gives good results according to Our eligibility and His will. The prayer is the most powerful weapon, so bravely face any difficulty with courage. 

(342) 07 December (07.12.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Dec లోక విషయాలయందు మనకు ఆసక్తి నశించి, భగవత్ ప్రీతికరములగు కార్యక్రమముల యందు ఆసక్తి జనించినపుడే మనకు బాగుపడే అవకాశము కలుగుతున్నదని గ్రహించాలి. We should realize that there is a chance to recover when we lose interest in worldly affairs and are interested in God's activities.   

(341) 06 December (06.12.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Dec వ్రాసినదానిని, చదవడం వలన, వినడం వలన మన పరిమిత బుద్ధికి తోస్తుంది కొంత. అది మాత్రమే నిజం కాదు. నిజమేమిటో అనుభవజ్ఞుల వలన, శ్రీగురుని సన్నిధిలోన మాత్రమే అనుగతమౌతుంది. అవగాహన ఆచరణ రూపం ధరించినప్పుడే ఆనందమును అనుభవించడం తరించడం సుసాధ్యము. By reading and listening to what is written, pushes the intellect limitedly. That is not the only truth. The truth will be perceived only by the veterans, in the presence of Sri Guru. It is possible to experience happiness only when awareness is applied to practice.

(340) 05 December (05.12.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 5 Dec లోక కోరికలను, ఆశలను కొనసాగనివ్వక ఆనందాన్ని ప్రసాదించే పరమాత్మునికి సంబంధించిన కార్యక్రమములలో మనస్సును లగ్నం చేస్తే శ్రీ గురుని కృప అనుభవమునకు వస్తుంది. Without perpetuate the desires and hopes of the world. Engage the mind in activities related to the Supreme Lord, which bestows happiness. then you will experience the grace of Sri Guru.  

(339) 04 December (04.12.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Dec త్రుప్పును లేదా మైలను తుడిచివేసి మెరుగు పెట్టే "పాలిష్" ప్రతి దానికి ఉంది. అలానే హృదయానికి ఆ “పాలిష్” దైవ స్మృతి. Each has its own "Polish" that wipes away rust or dust. Like all things Heart also "Polish" that is "Divine memory". 

(338) 03 December (03.12.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 3 Dec వద్దనుకున్నా, విదలించినా, వదలించుకుందామనుకున్నా తప్పించుకోలేక తలకు, కాళ్లకు చుట్టుకున్నట్లు ఉండే స్థితియే ప్రారబ్ధము. శ్రీ గురుని కృపతో (శరణాగతి చెందిన వారి విషయంలో) ఆ ప్రారబ్ధము కూడ దగ్ధమై పోతుంది. (అనేక రీతులలో). Fate is the state of being wrapped around the head and legs, unable to escape, whether you want to let go, or want it to let go.  By the grace of Sri Guru (in the case of those who surrendered) that fate also gets burnt.  (in many ways). 

(337) 02 December (02.12.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 2 Dec అనవసరమగు ఆలోచనలే అశాంతికి కారణములు: గతించిన దానిని గురించి, భవిష్యత్తును గురించి గానీ ఆలోచించక, వర్తమానాన్ని గురించి ఆలోచిస్తూ చేయవలసిన కార్యక్రమాన్ని త్రికరణ శుద్ధిగా చేస్తూ గతాన్ని, భవిష్యత్తును శ్రీ గురునికి అప్పగించి, వర్తమానంలో శ్రీ గురు స్మరణతో జీవించడమే శాంతికి, ఆనందమునకు మార్గములు: తృప్తి అపారమగు శాంతికి నిలయము. Unnecessary thoughts are the cause for disturbance: without thinking about past and future, think about present and work whole heartedly. Submit your past and future Sri Guru. In present live with Sri Guru's memory. This is the pathway to endless peace and satisfaction 

(336) 01 December (01.12.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 1 Dec అంతా దైవం మీదే ఆధారపడివున్నదన్నట్లుగా ప్రార్ధించు. అలానే అంతా మనిషి మీదే ఆధారపడివున్న అన్నట్లుగా శ్రమించు. నమ్రత కలిగి ఉండు. నీ ప్రార్ధన అన్ని అడ్డంకులను చీల్చుకొని భగవంతుని చేరుతుంది. Pray as, everything depends on God. And work as everything depends on you. Be humble. Your prayer breaks every obstacle and reaches God. 

(335) 30 November (30.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 30 Nov ప్రార్థనలో, భక్తిలేని మాటలకన్నా మాటలులేని భక్తియే శ్రేష్టము. In prayer, the devotion without words is superior than the words without devotion. 

(334) 29 November (29.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 29 Nov విశ్వాసంతో భగవంతుని నామం గానం చెయ్యి. ధైర్యం కలిగి ఉండు. ఆ దైవానికి నీ సర్వస్వం అప్పగించు. మనకు ఏమీ తెలియదు. ఆయనే సర్వజ్ఞుడు. కనుక ఆయన్నే ప్రార్ధించు. Sing the name of God with faith. Have the courage. Surrender your all to the God. We know nothing. He is the Omniscient. So pray to Him. 

(333) 28 November (28.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 28 Nov నిరంతర దైవ స్మృతి సంపూర్ణ శరణాగతికి దారి తీస్తుంది. దీనివల్ల మనసు ఉన్నతి చెంది దైవ చేతనతో శృతి కలుపుతుంది. Constant divine remembrance leads to complete surrender. This causes the heart to be elevated and harmonized with the divine consciousness. 

(332) 27 November (27.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 27 Nov ఈరోజు నేను ఏదైనా తప్పులు చేసి ఉంటే క్షమించి ఆ తప్పులు మళ్లీ చేయకుండా చేయి తండ్రి. ఈ శరీరము నిద్రపోతోంది తండ్రీ అని చెప్పుకొని నిద్ర పోవాలి. Divine Father, forgive me if I have done any mistakes today and also make me to not do them again. Say to Divine father that, this body is going to sleep. 

(331) 26 November (26.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 26 Nov ఈ శరీరము నిద్ర లేచింది తండ్రి మీ ఆశయాలకు ఆదర్శాలకు అనుగుణంగా నన్ను నడిపించు తండ్రి అని నిద్రలేవాలి. This body is awakened from sleep. Divine Father guide me in accordance with your ambitions and ideals should sleep. 

(330) 25 November (25.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 25 Nov నిద్రపోయే ముందు నామము చెప్పుకుంటూ నిద్రపోయి, మెలుకువ రాగానే అంటే కళ్ళు తెరవక ముందే నామము గుర్తుకు వస్తే రాత్రి అంతా నామము చేసినట్లే అవుతుంది. Before going to sleep chant the name, When you wake up with remembering the name, means it will be like doing the chant for whole night. 

(329) 24 November (24.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 24 Nov ఉదయాన్నే నిద్ర లేవగానే కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థించి, ఈ శరీరం నిద్రలేచింది, నేను చేసే ప్రతి పనిలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి చూపులోనూ నీవే అనంతశక్తి రూపముగా ఉండి, నన్ను నడిపిస్తున్నావు తండ్రి అని అనుకొని ప్రార్థించి లేవాలి. When I wake up in the morning I close my eyes and pray to loved God, and think "Father this body waken up, And in its every work, in every word, in every look, you (God) are in the form of infinite power and making me to move." 

(328) 23 November (23.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 23 Nov ఓర్పు రావాలి అంటే తనకు ఇష్టమైన దైవమును/గురువును విశ్వసించి జరిగేదంతయూ దాని సంకల్పమేనని అది మన మేలునకేనని, ప్రతి విషయములోని మంచిని గ్రహించడానికి తీవ్రముగా ప్రయత్నించి, మంచిని గ్రహించగలిగే వివేకమును సంపాదించుకొనుట వలన భగవత్తత్వము/గురుతత్త్వము యొక్క శక్తిని గుర్తించుటకు వీలు అగును. To be patient, one must trust his/her loving God/Guru and have the perception of "Everything happened was for our good with the will of God/Gurudev". Try hard and realize the good in everything happens. The perception of gaining the recognition of good helps in understanding the power of the Divine/Guru philosophy. 

(327) 22 November (22.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 22 Nov సమర్ధుడైన సద్గురువు సరైన శిక్షణ ఇచ్చి పరిరక్షణతో గమ్యం చేర్చును కానీ ప్రయత్నం అంతయు ఆయా బుద్ధిజీవులదే. తీవ్రమగు జిజ్ఞాసతో సద్గురువు మార్గదర్శకములో పయనించిన సత్ఫలితములు త్వరగా చేకూరును. జిజ్ఞాస ధ్యాస తీవ్రతను బట్టి ఫలితములు త్వరగానో ఆలస్యంగానో సంప్రాప్తించును. A Competent Gurudev will give proper training and guide to achieve the goal with protection but all the effort is on the respective intellectuals. The good results of the journey are under the guidance of the Gurudev with intense knowledge, this will not come soon. The results will be achieved sooner or later based on the intensity of cognitive meditation. 

(326) 21 November (21.11.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 21 Nov నీ గురువర్యుని బోధనలను అనుభవమునకు తెచ్చుకుంటే, నీలోనే దాగియున్న ఆధ్యాత్మిక సంపదలను కనుగొనగలవు. If you experience the teachings of Gurudev, you can to discover the hidden spiritual treasures within yourself. 

(325) 20 November (20.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 20 Nov ఎల్లప్పుడు సత్సహవాసం ఏర్పరచుకో. మిత్రులను, పుస్తకాలను జాగ్రత్తగా ఎన్నుకో. పవిత్రులతో, గొప్పవారితో సంబంధం కల్పించుకో. అన్ని విధాలా చెడు సహవాసాన్ని విసర్జించు. Always establish good companionship. Choose friends and books carefully. Connect with the saints, the great. Abandon bad association by all means. 

(324) 19 November (19.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 20 Nov ఎల్లప్పుడు సత్సహవాసం ఏర్పరచుకో. మిత్రులను, పుస్తకాలను జాగ్రత్తగా ఎన్నుకో. పవిత్రులతో, గొప్పవారితో సంబంధం కల్పించుకో. అన్ని విధాలా చెడు సహవాసాన్ని విసర్జించు. Always establish good companionship. Choose friends and books carefully. Connect with the saints, the great. Abandon bad association by all means. 

(323) 18 November (18.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 18 Nov నామం పావనమైనది. అఖండ నామ స్మరణ తీరానికి చేరుస్తుంది అని నమ్మకం ఉంటే వేరే ఇతర సాధనాలు అవసరం లేదు. నామం మోక్షాన్ని కలిగిస్తుంది. నామముయందు శ్రద్ద గల వారికి సర్వ పాపాలు ప్రక్షాళన అవుతాయి. నామాన్ని సదా జపించెడివాడు గుణవంతులలో గుణవంతుడు. The name (Chant) is sacred. If you believe the Integrity Chant will reach the shore, No other tools are needed. The chant brings salvation. All sins will be purged of those who pay attention to the chant. The one who always chants the name is the best among the virtuous. 

(322) 17 November (17.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 17 Nov సత్య, ధర్మ, ధైర్య, తృప్తి, నియమ నిబంధనలకు అనుగుణముగా బ్రతుకుచు ఇతరులకు ఇబ్బందులను కలిగించక జీవించువారు దైవ/ గురు కృపకు పాత్రులు. Those who live according to the virtues of truth, righteousness, courage, contentment and discipline without causing trouble to others, deserve the grace of God/Guru. 

(321) 16 November (16.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: అన్ని అవరోధములను అధిగమించుటకు మానసిక మౌనమే అత్యున్నతమగు సాధనము. Mental silence is the supreme tool for overcoming all obstacles. 

(320) 15 November (15.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 15 Nov నీలో దైవం కొరకు ప్రేమ ఎంతెంతగా పెంచుకుంటూ పోతే అంతంతగా కామక్రోధాదులు వెనుదిరిగి పోతాయి. కనుక ఆయన్ను ప్రేమించడానికి నిన్ను ఆశీర్వదించమని ఆ దేవుణ్ణి ప్రార్థించు. The more you grow the love for God in you, the more the lust-angry will go away from you. So pray to God to bless you to love him. 

(319) 14 November (14.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Nov నైతికమనేది, మనల్ని మనం ఎలా సంతోషవంతులుగా చేసుకోవాలో తెలియజెప్పే సిద్ధాంతం కాదు. మనం ఆనందాన్ని అనుభవించడానికి మనల్ని ఎలా అర్హులుగా చేసుకోవాలో తెల్పేదే అది. సంతోషము - భౌతికమైనది మరియు ఇంద్రియాధీనము, నశించేది. ఆనందము - పారమార్థికమైనది, ఇంద్రియాతీతము, శాశ్వతమైనది. కావున దైవాన్ని స్మృతియందుంచుకొని ప్రార్థించు. Morality is not a theory that tells us how to make ourselves happy. It tells us how to qualify ourselves to experience happiness.  Gleefulness (Santhosham) - Material and sensual, perishable.  Happiness (Anandam)- Transcendental, phenomenon, eternal. So remember God and pray. 

(318) 13 November (13.11.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Nov భగవంతుని మీద భక్తి కావాలి అని భగవంతుడినే ప్రార్థించాలి. నీ సేవ చేసుకుని నిన్ను మరిచిపోకుండా చెయ్యి అని ప్రార్థించాలి. We should pray to God that we need devotion on God. I have to pray that let me do your service and do not make me forget you. 

(317) 12 November (12.11.)

Image
  శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Nov నీ గురు పాదపద్మములపై దృఢ దృష్టి నిలుపు. అమృత పానానందము కొరకై భక్తి ప్రపత్తులతో వారి పవిత్ర నామ సంకీర్తనం గావించు. Stay focused on your Guru lotus feet. For Elixir-Enjoyment, sing the hymn of holy name with devotion.