5 August
శ్రీ శారదా శ్యామ సందేశం: 5 Aug
అనుకునే అందరూ జన్మించడం లేదు. ఉందామనుకున్న వారందరూ ఉండటంలేదు. రావడం, పోవడం మన చేతిలో లేదు. పరిమితమగు ఆశ నిస్వార్థమైనది అయితే, నెరవేరుతుంది. అపరిమితమగు ఆశ, దురాశ - పేరాశలుగా మారి స్వార్థపూరితమై దుఖంలో ముంచుతుంది. మునిగినది తెలుసుకోవడం కాదు. వెలుపలికి రావడం తెలుసుకోవాలి. అనుభవజ్ఞుల సహచర్యం మనకెంతో లాభము చేకూర్చుతుంది. వినయము, వివేకము అనునయంతో కూడిన భగవత్ కృపను అందిస్తుంది. కోరిక ఏదైనా అనుకోవచ్చు. తీవ్రంగా ప్రయత్నించవచ్చు. కానీ ఫలితం మాత్రం మన చేతిలో లేదని, ఆ కార్యక్రమానికి వచ్చిన ఫలితమే మనదని, మనకు మేలు చేకూర్చునని గ్రహించుటే ఆనందానికి ఆది.
Not everyone who thinks is born. All those who wanted to be there are not here. Coming and going is not in our hands. If unselfish limited hope is there means that can fulfilled. Unbridled hope, greed turns into edacity and selfishness and leads to misery. Not to know the sunk. Know how to come out. The companionship of experienced people will benefit us greatly with humility, wisdom, persuasion and God's grace. Desire can be anything try hard. But the beginning of happiness is to realize that the result is not in our hands, the result of the program is ours and will benefit us.
Comments
Post a Comment