Posts

Showing posts from August, 2022

(244) 31 August (31.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 31 Aug జాగ్రత్త! జాగ్రత్త! నీ కర్మలే వెనుతిరిగి నీ నెత్తినే పడతాయి.  నీవు చేసిన కర్మల ఫలితములనే నీవు అనుభవించక తప్పదు. Beware! Beware! Your deeds will backfire on you.   You must experience the results of your deeds.

(243) 30 August (30.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 30 Aug ఆలస్యంగా లభించిన ఫలితములు దైవము యొక్క దయవలననే కదా! దీని అర్థము దైవము నీ ప్రార్ధనలను తిరస్కరించినాడని కాదు కదా! తొందరను ఓరిమితో అధిగమించు. ఓరిమియే విజ్ఞ. విజ్ఞులు మాటలతో గాక ఆచరణతో బోధిస్తారు. అంటే వారి బోధలు సజీవ దృష్టాంతాలుగా ఉంటాయి. The late results are due to the grace of God! This does not mean that God has rejected your prayers! Overcome haste with patience. The patience is wisdom. Wise one's teach not by words but by deeds. That is, their teachings are living examples.

(242) 29 August (29.08.)

Image
శ్రీ శారాద శ్యామ సందేశం: 29 Aug తనకు నచ్చింది చేయడం కాక, తన కర్తవ్య కర్మను ఇష్టముతో చేయడమే ఆనందముననుభవించుటలో గల రహస్యం. The secret of happiness is not doing what one likes, but doing one's duty with love.

(241) 28 August (28.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 28 Aug బ్రతికేందుకు ప్రార్థించు. విద్యనేర్చుకొనుటకు, బ్రతుకు ఇచ్చుటకై నేర్చుకో. ఇచ్చేది దైవానికివ్వు. దైవం పదింతలు నీకు తిరిగి ఇస్తాడు. కాలం విలువైనది. దాతృత్వము లేదా త్యాగము మరింత విలువైనది. త్యాగమే దైవము, దైవమే ప్రేమ, ప్రేమే విశ్వం. నీవు విశ్వం యొక్క అంశమే. కనుక ఉదారంగా దానం చేయగల అలవాటు చేసుకో. ఇతరులకిచ్చేది నీకు ఇచ్చుకున్నట్లే అవుతుంది. Pray for Life, to learn education, learn to give life. Give to God. God will repay you tenfold. Time is precious. Charity or sacrifice is more valuable. Sacrifice is God, God is love, love is the universe. You are an element of the universe. So make it a habit to donate generously. What is given to others is what is given to you.

(240) 27 August (27.08.)

Image
  శ్రీ శారాద శ్యామ సందేశం: 27 Aug నిలకడైన శ్రమ లేకుండా సంపద లేదు. సంపద లేకుండా శౌర్యం, శౌర్యం లేకుండా విజయం లేదు. దయ లేకుండా కీర్తి లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా పరమానందం లేదు. Without constant hard work there is no wealth. There is no valor without wealth, no victory without valor. There is no glory without grace. Without spiritual knowledge there is no bliss.

(239) 26 August (26.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 26 Aug అత్యల్పమైన దానిని ఆనందంగా అనుభవించగలిగితే దేనినైననూ సులభముగా అనుభవించవచ్చును. If you can experience the least with joy, you can easily experience anything.

(238) 25 August (25.08.)

Image
  శ్రీ శారాద శ్యామ సందేశం: 25 Aug “నీవు ఇతరుల పట్ల దైవంలా ప్రవర్తిస్తే అందరూ దైవభక్తి పరాయణులు గాను మరియు ప్రతివారు దైవంలాను ప్రవర్తిస్తారు." అనునది సత్యవచనము. మన ఊహలు, భయాల ఫలితములే మన బాధలకు, అనారోగ్యములకు కారణములు. "If you act like a god towards others, everyone will be a stranger to godliness and everyone will act like a god." That is the truth. The results of our imaginations and fears are the causes of our sufferings and illnesses.

(237) 24 August (24.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 24 Aug మానవులను వారి వారి స్వభావాన్ని బట్టి, కర్మలబట్టి, మాటలబట్టి అర్థం చేసుకోవచ్చును. ఎవరైతే మనసా, వాచా, కర్మణా ఏకత్వాన్ని, సఖ్యతను పొంది ఉంటారో వారే పవిత్రులు. Humans can be understood by their nature, actions and words. Those who have attained the unity and harmony of mind, word and action are holy.

(236) 23 August (23.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 23 Aug వృద్ధాప్యంలో నిన్నేది సంతోషపరచగలదో దాన్ని యవ్వనంలోనే సిద్ధం చేసి ఉంచుకో. మరణానంతరం ఉత్తర లోకంలో లేదా మరుజన్మలో నీకేది సంతోషాన్నిస్తుందో దాన్ని ఈ జన్మలోనే సిద్దం చేసి What make you happy in old age, prepare it in youth. Whatever makes you happy in the afterlife or in the next life, prepare it in this life itself.

(235) 22 August (22.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 22 Aug పరులకు సాయపడటం అంటే నీకు నీవు సాయపడటమే. పరులకు హాని కలిగించుట, నీకు నీవు అసౌకర్యం కలిగించుకొనుటయే. ఒకరికి హాని కలిగించుట నీకు నీవే హాని కలిగించుకొనుట కనుక జాగ్రత్తగా నడుచుకో. Helping others means helping yourself. To harm others is to cause discomfort to yourself. To harm someone is to harm yourself, so carefully go.

(234) 21 August (21.08.)

Image
శ్రీ శారాద శ్యామ సందేశం: 21 Aug మనిషి శాంతం చేత కోపాన్ని, మంచితనం చేత చెడును జయించాలి. Humans should conquer anger with peace and evil with goodness.

(233) 20 August (20.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 20 Aug ప్రతీదానిలో మంచిని చూడాలి. జరిగేదంతా భగవత్సంకల్పం. అహంకారం, క్రోధంలో కూడా మంచి చూస్తే చెడు కనిపించదు. మంచి అంటే చెడు లేకుండా ఉండేది, చెడు పోగొట్టేది అని అర్థం. See the good in everything. Everything that happens because of God's will. If you see the good even in pride and anger, you will not see the bad. Good means the absence of evil, the elimination of evil.

(232) 19 August (19.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 19 Aug 'ఆలోచన - ధ్యాస: వద్దనుకున్న దాని గురించి ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే అది ఇంకా ఎక్కువవుతుంది. ఆలోచన వచ్చిన వెంటనే ఉపయోగమా కాదా? ప్రశ్నించుకోవాలి. ఉపయోగం అయితే కొనసాగించు లేదా కట్ చేయి. Thought- Attention: Don't think about what you don't want. Thinking like that, makes it even more so. When it comes immediately question it... is this useful or not? If it's useful continue otherwise cut it

(231) 18 August (18.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 18 Aug మంచి ఆలోచనలు వస్తే కొనసాగించాలి. చెడు ఆలోచనలు అయితే అక్కడే ఆపివేయాలి. ఈరోజు భగవన్నామము భక్తితో, ఎంతసేపు చేశాము అని ప్రశ్నించుకోవాలి. Good ideas should be continued. Bad thoughts should stop there. Today we should question ourselves how long we have done chanting with devotion to God.

(230) 17 August (17.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 17 Aug ఉన్నదానిలో గొప్పతనం చూసుకోవాలి. లేనిదాని కోసం ఆరాటపడకూడదు. అలా చేయడం వలన ఇప్పుడు ఉన్నవి అనుభవించలేము, లేనివి రావు. రెండింటి చెడ్డవారమవుతాము. ఇప్పుడు ఉన్నవన్నీ ఇంతకు ముందు జన్మలో శ్రమించిన దానివలన వచ్చాయి. ఉన్నదానితో తృప్తి పడకపోతే వచ్చే జన్మలో ఇవి కూడా ఉండవు. Look for the greatness in what you have. Don't anxiet for what you don't have. By doing so, the present cannot be experienced, and the absent will not come. Both will be bad. Everything that exists now has come because of our hardwork in previous births. If you are not satisfied with what you have, you will not have these in the next life.

(229) 16 August (16.08.)

Image
శ్రీ శారాద శ్యామ సందేశం: 16 Aug ఏ పని అయినా తెలుసుకొని చేయాలి. లేదంటే చేస్తూ, చేస్తూ పోవడం వలన అదే తెలుస్తుంది. దేవాలయాలు ప్రశాంతతకు, ప్రాయశ్చిత్తములకు, పశ్చాత్తాపములకు నిలయాలు. Any work should be done knowingly. Otherwise it will be known by doing and doing. Temples are abodes of tranquility, Atonements and penitence.

(228) 15 August (15.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 15 Aug మీ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారో మీరు అలా ఉండాలి. ప్రేమ, విద్య పెంచే కొద్దీ పెరుగుతాయి. You should be what your children want you to be. Love and education will increase as you increase.

(227) 14 August (14.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Aug ఏ పని అయినా ఇది తక్కువ, ఎక్కువ అనుకోకుండా భగవంతుడు మనకు ఆ పని ఇచ్చాడని శ్రద్ధగా చేయాలి. సినిమాలైనా సరే చూసి వాటిలోని మంచిని గ్రహించాలి. మనసు గురుదేవుని ఆధీనము, శరీరము భగవంతుని ఆధీనము. భగవంతుని మీద విశ్వాసంతో ఎందరో బాగుపడ్డారు. మనము ఎందుకుగాను బాగుపడము అని సాధన చేయాలి. Any work which is less or high without much saying, feel that God has given it to us it should be done diligently. Even it movie one should watch and understand the good in that. The mind belongs to Gurudev and the body belongs to God. Many people got better with faith in God. We have to practice why we don't get better.

(226) 13 August (13.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Aug మనదైనది మన దగ్గర ఉంటుంది. మనది కానిది మన దగ్గర ఉండదు. సాయిని సమాఆశ్రయించిన తర్వాత, నమ్ముకున్నపుడు, జరిగేదంతా ఆయన సంకల్పమే, అది మన మేలుకేనని అనుకుని మౌనంగా ఉండాలి. ఎవరిని ఏమీ అనకూడదు. Our things will be there with us, we cannot have what is not ours. After taking refuge near Saibaba, believe that whatever happens is His Will and should be silent thinking that it is for our good. Noone should say anything.

(225) 12 August (12.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Aug మనలను గురించి ఎవరేమి అనుకున్నా మనము మాత్రము మౌనంగా ఉండాలి. మనలను అందరూ మంచిగా చూడాలని అనుకోవడం వలన శ్రీ సాయి కృపకు, కరుణకు దూరమవుతాము. No matter what anyone thinks about us, we must remain silent. Because we want everyone to see us as good, we get away from Sri Sai's grace and mercy.

(224) 11 August (11.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 11 Aug సద్గురువును సమాశ్రయించడం అంటే ఆయన ఆదేశ సందేశములకు అనుగుణముగా నడుచుకుంటూ అన్నింటికీ ఆయనే ధ్యేయమై, లక్ష్యమై, పరబ్రహ్మమై ఉన్నాడని అనుభూతి పొందడమే. Those who surrender to Sadhguru means to follow his instructions accordingly feel that.. For everything God is the mission, goal. 

(223) 10 August (10.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Aug నీకు చక్కటి అనుభవమును కలిగించి నీ నుంచి దేనినీ కోరక, నీ శ్రేయస్సునే కోరేదాన్ని నమ్ముకో. అదే సక్రమముగా మార్గములో నడిపిస్తుంది. The one who give you a good experience, and wants nothing but your well-being. Trust them. They leads in the right way.

(222) 09 August (09.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 9 Aug స్వచ్ఛమైన అపరంజి లాంటి సంస్కారానికి లొంగుతాడు శ్రీగురుడు. భూత దయ, ప్రేమ, కరుణ కలిగిన మానవుని మహాత్మునిగా తీర్చిదిద్దగలడు. Sriguru surrenders to pure refined behaviour. a human being with kindness, love and compassion can transform into a Mahatma. 

(221) 08 August (08.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Aug రూపమేదైనా, నామమేదైనా తుది శ్వాస వరకు స్మరిస్తూ చేతనైనంత వరకు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉండటమే మానవ జన్మకు సార్ధకతను కలిగిస్తుంది. Whatever the form or name is, remembering it till the last breath and praying as much as possible makes human birth meaningful.

(220) 07 August (07.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Aug "నాకు గురువు కావాలి. మిమ్మల్ని గురువుగా పెట్టుకుంటాను." తీవ్రమైన ఆకలైన వాడు ఆహారాన్ని వెతుక్కుంటాడు. అలాగే నిజంగా మనస్ఫూర్తిగా దైవాన్ని తెలుసుకోవాలని, ఆయన అనుగ్రహాన్ని పొందాలని ఉంటే సర్వాంతర్యామి అయిన దైవం ఏదో ఒక మార్గము ద్వారా గురువు చెంతకు చేర్చుతాడు. "I want a Guru. I'll keep you." He who is very hungry searches for food. Like that, if you really want to know God with your heart and get His grace, who is omnipresent. God will bring you Guru through some means.

(219) 06 August (06.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Aug అంతా యింతే. యింత దానికి అంతెందుకు? అంతెందుకు అని ఊరుకోకు. ఊరుకుంటే ఊరు ఊరుకోదు. ఊరు-పేరులకు తేడా లేదని తెలిసే వరకూ నీకూ నాకూ ఈ తగిలింపులు తప్పవు. తప్పవని నిరుత్సాహ పడకు. తప్పవని తెలిస్తే, తప్పించుకోగల శక్తి వస్తుంది. అది వస్తే అంతా ఇంతేనని అవగాహన అనుభవములలో తెలుస్తుంది. That's it. Why so much for that?  Don't keep by saying why. If you settle down, the town will not keep you settle down. Until we know that there is no difference between town and name, you and I will have inevitable encounters from attachments. Don't be discouraged for inevitable's. If you know that you are inevitable, you will have the power to escape. it will be known in the experiences of awareness.

(218) 05 August (05.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 5 Aug అనుకునే అందరూ జన్మించడం లేదు. ఉందామనుకున్న వారందరూ ఉండటంలేదు. రావడం, పోవడం మన చేతిలో లేదు. పరిమితమగు ఆశ నిస్వార్థమైనది అయితే, నెరవేరుతుంది. అపరిమితమగు ఆశ, దురాశ - పేరాశలుగా మారి స్వార్థపూరితమై దుఖంలో ముంచుతుంది. మునిగినది తెలుసుకోవడం కాదు. వెలుపలికి రావడం తెలుసుకోవాలి. అనుభవజ్ఞుల సహచర్యం మనకెంతో లాభము చేకూర్చుతుంది. వినయము, వివేకము అనునయంతో కూడిన భగవత్ కృపను అందిస్తుంది. కోరిక ఏదైనా అనుకోవచ్చు. తీవ్రంగా ప్రయత్నించవచ్చు. కానీ ఫలితం మాత్రం మన చేతిలో లేదని, ఆ కార్యక్రమానికి వచ్చిన ఫలితమే మనదని, మనకు మేలు చేకూర్చునని గ్రహించుటే ఆనందానికి ఆది. Not everyone who thinks is born. All those who wanted to be there are not here. Coming and going is not in our hands. If unselfish limited hope is there means that can fulfilled. Unbridled hope, greed turns into edacity and selfishness and leads to misery. Not to know the sunk. Know how to come out. The companionship of experienced people will benefit us greatly with humility, wisdom, persuasion and Go...

(217) 04 August (04.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Aug సమర్థ సద్గురువును సమాశ్రయించిన, మనలోనూ, మనకు కనిపించని వారిలోనూ నిండి ఉండి అన్ని వేళలలో, అన్ని మార్గములలో జీవులను పరమ శ్రేయోదాయకమగు మార్గమున నడిపించునటుల అనుభవము జరిగి శాంతి సుస్థిరమై ఆనందము అవధులు దాటును. Those who have surrender to the competent Sadguru... who is present in us and who are invisible to us from them and living beings leads us in the path of supreme beneficence at all times and in all ways. Experiences happens, peace is established and bliss transcends the bounds. 

(216) 03 August (03.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 3 Aug ఋణాను బంధము తప్పదు. సద్గురువుతో ఋణానుబంధము పెట్టుకుంటే చక్కగా నడిపిస్తాడు. Debt relationship is inevitable. If you have a debt relationship with Sadguru, he will guide you well.

(215) 02 August (02.08.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 2 Aug వ్యక్తి జీవిత స్వభావం అతని చుట్టూ ఉన్న సమాజంతో అతనికి గల సంబంధాల స్వభావంగా ఉంటుంది. The nature of an individual's life is the nature of his relations with the society around him.  

(214) 01 August (01.08.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: (1 Aug) ఆచరణాత్మకతతో, అసలైన జిజ్ఞాసతో అందరూ ఆనందమయులుగా మారగలరని తెలిపేదే శ్రీఅవధూతలీల. God's Messenger magics says that "With practicality and genuine curiosity, everyone can become happy"