Posts

Showing posts from March, 2022

31 March (31.03.) (91)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: నామ, రూప, గుణ, తత్వము చేత భగవంతుణ్ణి చింతించాలి. By name, form, character and philosophy, should ponder the God (31 Mar) 91) సద్గురు బ్రహ్మ సనాతన హే  సద్గురు బ్రహ్మ సనాతన హే  పరమ దయాకర పావన హే జన్మజ దుఃఖ వినాశనహే జగదో ధారణ కారణహే  సాయి కృష్ణ జనార్ధన హే  జనార్ధన హే - జనార్ధన హే - జనార్ధన హే - శిరిడీ సాయి కృష్ణ జనార్ధన హే భవ భయ జలధీ కారణహే ॥సద్గురు॥

30 March (30.03.) (90)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: జిత రసే జితే సర్వం, నాలుకను అదుపులో ఉంచుకొనవలెను. "Jita rase jite sarvam" (Who conquers the tongue, can conquer everything). The tongue should be kept under control. (30 Mar) 90) చాలు చాలు సాయి దేవా చాలు చాలు సాయి దేవా నీ ఆట సాగ నీయమా మమ్ముల నీ బాట ॥ చాలు॥  పలుక నీయుమా సతతము నీ మాట పాడగ చేయుము ఆనందముగా నీ పాట ॥చాలు॥ నిలువ నీయమా నీ నామము మా నోట నొసగి బ్రోవుమా మా కిల భక్తి మూట ॥చాలు ॥ కట్టి వేయుమా మా మనసుల నీ గాట తుడిచి వేయుమా దుష్కర్మల నీ గోట ॥చాలు॥

29 March (29.03.) (89)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: యాద్భావం తద్భవతి  సద్భావం సద్భవతి  దుర్భావం దుర్భవతి  నభావం నభవతి. What we think, that will happen Good Thoughts, Good Results Bad thoughts, Bad Results No thoughts, No results (29 Mar) 89) కన్న తండ్రీ కావగా కన్న తండ్రీ కావగా  కరుణ మానితి వేలరా కనులు గానక  కళ్ళలాడుచు  కష్టములలో నుంటిరా॥కన్నతండ్రీ॥ విశ్వమందున అణువు  నేనను సత్యమును గుర్తించనైతిని విర్ర వీగుచు నేను నేనని  నాది నాదని తలచు చుంటిని ॥కన్నతండ్రి॥ నిన్ను జేరగ దలచి నంతట నన్ను లాగును  మోహము నిన్ను తలవగ నెంచి నంతట  మనసు చేయును మోసము దారి తెలియక  నిన్ను జేరిన శ్యామ కీవే శరణము ॥కన్నతండ్రి॥

28 March (28.03.) (88)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: బుద్ధి వికసించిన సదసత్ వివేకము ఉదయించును. సదసత్ వివేకము వలన వినయము లభించును. వినయము వలన సూక్ష్మ గ్రాహక శక్తి అంచెలంచెలుగా పెంపొందును. సూక్ష్మ గ్రాహక శక్తి వలన సారాసార విచారణ కలుగును. సద్విచారణ వలన విషయ వాసనల విశ్లేషణ జరుగును. Wisdom will rise when intelligence blossoms. With Wisdom Humility will obtain. Humility will slowly enhances the micro-perceptiveness. Micro-perceptiveness causes an absolute inquiry. Due to indeed inquiry "Subject Odor Analysis" is done. (28 Mar) 88) కొలువై యున్నాడే  కొలువై యున్నాడే  మన సాయి రాముడు కొలువు దీరిచి యున్నాడే  ఘనముగా మన శ్యామ సన్నతుడు ॥కొలువై॥ మాతాపిత గురుదైవము తానై మందహాసముతో ముచ్చట గొలుపగ భక్తులారా రండు రండనుచు ఇక భయము మీకేల వలదు వలదనుచు ॥కొలువై॥ మీ భారంబుల నాపై వదలడు సర్వము నేనే మోయు చుందునని నిష్ట  సబూరుల గలిగి యుండుడని అవియే సకల శ్రేయముల గూర్చునని ॥కొలువై॥

27 March (27.03.) (87)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: సాధన విషయములో నడక పనికిరాదు. పరిగెత్తాలి. In practice, Walking is useless, Have to run. (27 Mar) 87) కనికరింపుమా దేవ కారుణ్య నాథా కనికరింపుమా దేవ కారుణ్య నాథా కలత బాపుమా వేగ శ్రీ సాయినాథా ॥కనికరింపుమా॥ తల్లి తండ్రి గురు దైవము లీవేనని దలచితిరా  సుఖ దుఃఖము లందు నిన్ను మరువక పూజించితిరా కంటికి రెప్పగా కాపాడు దైవమా కనుల నీరు తుడవగా కదలిరావదేలరా ॥కనికరింపుమా॥ ఈ మాయా మోహము లో తగులు కొనిన వాడరా మమ కారములన్నీ దాటి వెలికి రాని వాడరా ఏ తీరుగ బ్రోతువో ఏ తీరుగ గాతువో  నీ పదములే శరణంబని నమ్మియున్న వాడరా ॥కనికరింపుమా॥

26 March (26.03.) (86)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: చపాతీ పిండి లాగా, నలిగి అగ్నికి కాల్చబడితే కానీ చపాతీ కాదు. అలాగే మనము కూడా బాగా నలిగితే కానీ సాధనలో పైకి రాలేము. Like wheat flour, Crushed and fire baked flour become Chapati. Like If we are also crushed well then can get up in practice. (26 Mar) 86) కలుగదా నామీద జాలి కలుగదా నామీద జాలి సాయి కరుగదా  నీ మనసు నా ప్రార్థనలను విని ॥కలుగదా॥ తనువశాశ్వతము ఆశయే దుఃఖము  రుణాను బంధమే ఈ బంధములని జూచుచు నుండి మనసు నిలపక లేక సుడి గుండములో జిక్కినవాడను॥ కలుగదా॥ తనువు మనసులకు బలమే లేదు మమకారంబుల కంతమే లేదు సద్గతి నందెడి మార్గము తెలియక అజ్ఞానంతో బ్రదుకుచు నుండగా ॥ కలుగదా॥ సద్గతిని గోరిన సుఖములు తొలగును  సుఖముల గోరిన సగ్గతి కలుగదు రెంటిని గోరుచు నుంటిని ఈ భువి కంటికి రెప్పగ కాపాడెదవని ॥ కలుగదా॥

25 March (25.03.) (85)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: అన్నం ఆయనే, బియ్యం ఆయనే, అన్నీ ఆయనే, అంతటా ఆయనే అన్న భావన రావాలి. He is the Food, He is the Rice, He is Everything, He is Everywhere. This feeling should come. (25 Mar) 85) కరుణ జూపుమా - సాయి కనికరించుమా కరుణ జూపుమా - సాయి కనికరించుమా  పటములోని రూపముతో మమ్ము పలకరింపుమా  పటంలోని రూపముతో మాకు కానుపింపుమా ॥కరుణ॥ మానవుల మైనందున మాయల బడి ఉన్నందున పరోక్షముగ కనిపించెడి నిన్ను తెలియలేమైతిమి పటములోని రూపముతో దర్శనమిడి బలుకరించ ఆత్మానందముల నొంది కృతార్థులము మేమగుదుము ॥కరుణ॥ నీ దర్శనమెనరించిన నిర్మూలనమౌ కర్మలు నీ పలుకుల వినినంతనే నిచ్చలమౌ మాది మనసు నీ ఆశీస్సుల బడసిన నీ దరి వీడగలేము నీ దయతో తరియుంతుము నిజము శామసన్నుతా ॥కరుణ॥  దేవతలలో నిన్ను చూచి అర్చించగ లేమయితిమి మహాత్ములలో నిన్ను జూచి సేవింపగా లేమైతిమి జీవులలో నిన్ను చూచి ప్రేమించగ లేమైతిని  విశ్వములో నిన్ను చూచి ధ్యానించగ లేమైతినే ॥కరుణ॥

24 March (24.03.) (84)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: ఓ మాయ దేవత! నీవు కరుణించి మమ్మలను శ్రీగురు చెప్పిన మార్గంలో నడిపించు అని ప్రార్థించాలి. మాయకు తలవంచి ఆమెకు నమస్కారం చేయాలి. Ohh goddess of illusion! have mercy on us and lead us in the path that Sri Guru has told. Pray her, Bow your head infront of her illusion and Salute her. (24 Mar)   84)  సుందరానన సుందరానన  సుందరానన సుందరానన సుందరానన శివ సుందరానన భస్మోధూలిత సుందరాననా భవభయ హరణ సుందరానన భద్ర సేవిత సుందరానన వీరభద్ర సేవిత సుందరానన ॥ సుందరానన॥ అరుణాచల శివ సుందరానన అర్థనారీశ్వర సుందరానన  అంబికా వల్లభా సుందరానన ఆదరమున కావరా సుందరాననా ॥ సుందరానన॥  రుద్ర కోటేశ్వర సుందరానన రుద్రాణి సమేత సుందరానన రుద్రాక్ష ధారణ సుందరానన రూప నామ రహిత సుందరానన ॥ సుందరానన॥ కాశీ విశ్వనాథ సుందరానన విశాలాక్షి సమేత సుందరానన కలి నాశక సుందరానన  శ్యామ  పూజిత సుందరాననా ॥సుందరానన॥ షిరిడీ నివాస సుందరానన  ద్వారకా నిలయ సుందరానన సద్గురు నాథ సుందరానన శరణంటినయ్య సుందరానన ॥ సుందరానన॥

23 March (23.03.) (83)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: ఆశ, ఆశయం వైపు ధ్యాస, ధ్యేయం వైపు ఉండాలి. Aspiration towards Aim, Attention towards Ambition should be there. (23 Mar) 83)  భక్తి నీయవమ్మా భవతారిణి భక్తి నీయవమ్మా భవతారిణి  శక్తినీయవమ్మా సౌమ్య రూపిణి ॥ భక్తి॥  రూప నామ గుణ తత్వ చింతనలతో నీదు సేవలను చేయనీయవే॥ భక్తి ॥  కరుణ రూపమైన కామాక్షి నాదు కనులు తెరవజేసి కానుపింపవే ॥ భక్తి ॥  ఆదిశక్తి నీవే అఖిలమ్ము నీవే అమ్మ యనెడి వారలాదరింపవే  సర్వవ్యాపీ వైన సర్వేశ్వరి శామాదులను కరుణ బ్రోవ రావే ॥భక్తి ॥

22 March (22.03.) (82)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: పాక్షిక శరణాగతి అయినా చేయాలి. ఉదాహరణ:కాఫీతో మొదలుపెట్టండి. కాఫీ, వాళ్ళు ఇచ్చే దాకా అడగకూడదు. ఎక్కువ ఇచ్చినా, తక్కువ ఇచ్చినా ఇన్ని ఇచ్చారు, అన్ని ఇచ్చారు అని అనకూడదు. చక్కెర ఎక్కువ, తక్కువ అనకూడదు. ఈ ఒక్కటి అయినా ఆయనకు ఇవ్వవలెను. Partial surrender should be done. Example: Start with coffee. Do not ask Coffee until they give. Do not say Give more, give less, only this much. Sugar should not be high or low. Atleast this should be given to him. (22 Mar)   82)  కనుల నీరు తుడవగా కదలి రావ దేలరా కనుల నీరు తుడవగా కదలి రావ దేలరా కలతలను బాపి నాకు కానుపింప వేమిరా ప్రభో ! సాయి దేవరా పలుక కున్నా వేమిరా శరణంటిని దేవరా సతతము నను గావరా  ॥కనుల॥ పూర్వజన్మ కర్మ ఫలము, నీ లీలా సంకల్పము, మహాత్ముల శాప ఫలము , దుచ్చరియల ప్రతిఫలము, సమస్యలకు పరిష్కార వమింత దనుక కలుగ లేదు సతమతమౌ హృదయంబున శాంతి అయిన నిలువలేదు  ॥ కనుల ॥ వివాహముల జేయనెంచి వినయంబుగా నిను వేడగ నిమ్మకు నీరెత్తినటుల నిచ్చలముగా కూర్చుంటివి ఇలు వెడలిన తమ సుతుని వెదకుచున్న నీ వారికి సం...

21 March (21.03.) (81)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: ఆరోగ్యంగా ఉన్న శరీరానికి 6 గంటల నిద్ర చాలు. For a healthy body, 6 hours sleep is enough. (21 Mar)   81)  ఒక పరి నిన్ను మనసారగ నమ్మిన ఒక పరి నిన్ను మనసారగ నమ్మిన - వారల ప్రేమగ కరుణించెదవూ ! ఒకపరి నిన్ను శరణాగతి వేడిన - వారల బరువుల భరించెదవూ ! నీ ప్రేమ అనంతమూ -   దయ అపారము కరుణ అనూహ్యము  సాయి రామా - శరణం సాయిరామా శరణం సాయిరామా  ॥ఒకపరి॥ పాపాత్ముల పరిరక్షణ చేయగ మానవ రూపము ధరియుంచితివి పరిశుద్ధాత్ముల పరమును జేర్చగ పరమాత్ముడవై ధర వెలసితివి సకల జీవులను సంరక్షించగ సాయినాధునిగా భువి నిలచితివి  ॥నీ ప్రేమ॥ కులమత రహితము జాతి కతీతము సంతస భరితము సర్వోన్నతము. సర్వ సమ్మతము సూన్రుత సహితము సుందర చరితము మంగళకరము సద్గతి భరితము సజ్జన హితము సోహం నాదము దైవ విధానము  ॥నీ ప్రేమ॥

20 March (20.03.) (80)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: చేసే ప్రతి పని భగవంతునిదే అనే భావం ఉండాలి. ఈ శరీరం, మనస్సు, బుద్ది అనునవి అర్హత సంపాదించుకుంటే గురువు దారి చూపిస్తాడు. Feel that, Every work belongs to God. If this body heart mind are eligible Guru shows route (20 Mar) 80)  ఏల కానరావయ్య బృందావన విహారా ఏల కానరావయ్య బృందావన విహారా ఎందుకు దాగినావయ్యా రాధా మానస చోరా  ॥ఏల॥ పున్నమి వెన్నెల రాత్రులు, కన్నుల పండువు జేయగ నానా విధ సుమ బాలలు సుగంధముల విరజిమ్మగ సుందర యమునా తీరము నీ రాకకు తపించగ చల్ల చల్లని పిల్లగాలి నీ కొరకటు నిటు దిరుగగ  ॥ఏల॥ చిరుమువ్వల సవ్వడులు ఘల్లు ఘల్లు ఘల్లుమనగ మురళీనాదము మోహనరాగ మాలపించగా సమ్మోహనమున జగమే సంతసమును బొందగా నీ పద భక్తులు నీకై పరిపరి విధముల వేడగ  ॥ ఏల॥

19 March (19.03.) (79)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం:   విజయం పొందడానికి నీవు స్థిరమైన పట్టుదలను, బలమైన సంకల్పాన్ని కలిగి ఉండాలి. అలాంటి శక్తిని పొంది, కష్టపడితే నీవు గమ్యం చేరగలుగుతావు. To succeed you must have consistent perseverance and strong willpower. Get that energy and work hard, you will reach there. (19 Mar)   79)  ఏమి కర్మముల చేసితినో నేనేమీ పాపముల నొనరించితినో ఏమి కర్మముల చేసితినో నేనేమీ పాపముల నొనరించితినో ఈ భూమిలో పలు బాధల వలలో జిక్కి దిక్కుతోచక ఉన్నాడను  ॥ఏమి॥ నిను నమ్మితిని, ఓర్పుగ నుంటిని నీవేదో మేలొన గూర్తువని ఎన్నడు నీ దయ ప్రసరించునోయని ఎదురు తెన్నులు జూచుచు నుంటిని  ॥ఏమి కర్మముల॥ నీ దయ రాక దారి తెలియక నిట్టూర్పులతో బ్రతుకుచు నుంటిని అంతము లేదా ఈ ఓర్పునకు, అభయము నీయవా ఈ ఆర్తునకు  ॥ ఏమి కర్మముల॥ ఎటు నిను వేడిన కరుణించెదవో ఎటు ప్రార్ధించిన మొరలాలిన్తువో ఎరుగని వాడను సాయి దేవా, ఎటు నను బ్రోతువో దేవా దేవా  ॥ ఏమి కర్మముల॥ తండ్రివి నీవే దయమాలిన ఇక దీనజనులకు దిక్కెవరయ్యా మా మొరలను విని వేదనలను గని సరగును బ్రోవుము శామసన్నుత ॥ ఏమి కర్మముల॥

18 March (18.03.) (78)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: అప్పుడే జననమొందిన శిశువునకు అహంకారము, కోరికలనే సంస్కారములు ఉండనందున దాని సంరక్షణ బాధ్యతలను తల్లి చూచుకుంటుంది. ఆ శిశువే ఎదిగాక తన అహంకారము, కోరికల సంస్కారముల వల్ల తల్లికి దూరమవుతుంది. అలానే దైవం/గురువు పట్ల నీ ప్రవర్తన ఎటులో, ఆయన ప్రతిస్పందన అటులనే ఉంటుంది. Newborn baby don't have the culture of ego and desires. So mother take cares of their responsibilities to protect them. As the child grows older, their ego and desires will lead them away from mother. Similarly based your attitude towards the God/Guru, responses will be there. (18 Mar)   78)  ఏదని దలతును నీ రూపమును ఏదని దలతును నీ రూపమును ఏమని బిలతును నీ నామమును లీలా నాటక సూత్రధారి హే! మాయా మానుష వేషధారి ..॥ఏమని ॥ ఇది యది యనక అన్ని రూపములలో నున్నది నీవే యని దెలుపుచు సర్వనామముల కధిపతి నీవై సమతా మమతలను నిలిపిన దేవా  ॥ ఏమని॥ రామ, కృష్ణ ,శివ, దత్త ,మారుతి, రహీము, అల్లా, యెహోవా, క్రీస్తు, నానకు, నారాయణి శక్తులుగా దర్శన మెసగిడి శ్యామ సన్నుతా  ॥ఏమని॥

17 March (17.03.) (77)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: ధర్మ మార్గం అవలంబకుని ధర్మమే కాపాడి సంరక్షించును. అధర్మ మార్గావలంబకుని అదియే శిక్షించి భక్షించును. Adopt the path of Virtue Virtues itself protects and preserves. Following the path of unvirtues that only will punish and eat you. (17 Mar)   77) ఇది ఏమీ ఆటరా తండ్రీ ! ఇది ఏమీ ఆటరా తండ్రీ ! ఇది ఏమి వేడుక దేవా! ఇటు నటు నూపుచు అటు నిటు జేర్చక ఆడించుచున్నావు సాయి.. ॥ ఇది॥ భక్తి తోడ నిను తలచ దలంచిన భవ భంధములు బంధము లాయెను నీదు లీలలను గానము జేయగ నెంచిన నా మది నిలువకపోయెను లోకవాసనల వ్యామోహములతో మంచి చెడుగల విచక్షణ లేక గ్రుడ్డివానిగా బ్రతుకుచు నుంటిని పిచ్చివానిగా వాగుచు నుంటిని ॥ఇది ॥ పరబ్రహ్మమే నీవనడి నిజము పరిపూర్ణముగా తెలియక నైతిని  బాధ్యతలను భరియంచెడి నిన్ను భక్తిగా నెపుడు గొలవ నైతిని  సర్వము నీదని అనుకొనుచు నాది యనుచునే భ్రమ పడుచుంటిని  జ్ఞానము నొసగక శ్యామను ఈ భువి అవివేకముతో బ్రతుకగ జేయగా ॥ఇది॥

16 March (16.03.) (76)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: ఉన్నదానిని పొమ్మనకు, లేనిదాన్ని రమ్మనకు. మొత్తం దీనిలోనే వుంది. Don't miss what is there, don't ask for what is not there. The whole thing is in it.. (16 Mar) 76) ఆనందమే సాయి నామము  ఆనందమే సాయి నామము-  పరమానందమే సాయి నామము ఆనందమే సాయి నామము- మధురానందమే సాయి నామము ఆనందమే సాయి రూపము-  పరమానందమే సాయి రూపము ఆనందమే సాయి రూపము-  మధురానందమే సాయి రూపము ఆనందమే సాయి నామము-  పరమానందమే సాయి రూపము ఆనందమే సాయి గానము-  నిత్యానందమే సాయి గానము ఆనందమే సాయి ధ్యానము-  మధురానందమే సాయి ధ్యానము ఆనందమే సాయి స్మరణము-  బ్రహ్మానందమే సాయి స్మరణము ఆనందమే సాయి మననము-  దివ్యనందమే సాయి మననము ఆనందమే సాయి దైవము -  సచ్చిదానందమే సాయి దైవము ఆనందమే సాయి వైభవం -  మహదానందమే సాయి వైభవం ఆనందమే సాయి జ్ఞానము -  పరమానందమే సాయి జ్ఞానము ఆనందమే సాయి ధామము -  మధురానందమే సాయి ధామము ఆనందమే సాయి యోగము -  పరమానందమే సాయి యోగము ఆనందమే సాయి భోగము -  మహాదానందమే సాయి భోగము ఆనందమే సాయి భావన - పరమానందమే సాయి దీవెన ఆనందమే సాయి దీవెన -...

15 March (15.03.) (75)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: సదా పరులకు ఉపకారము చేయుచుండువారికి భగవత్కృప సులభ సాధ్యము. Those who always helps others, God's grace is easy for them. (15 Mar)   75) అవో సాయి నారాయణ దర్శన దియో అవో సాయి నారాయణ దర్శన దియో తుమ్ హో జగతికే త్రాతా !..... తుమ్ హో భాగ్యవిధాతా....॥ ఆవో ॥ త్వమేవ మాతా పితా త్వమేవా త్వమేవ విశ్వవిధాతా ..... త్వమేవ సర్వవిధాతా......॥ ఆవో॥ త్వమేవ బ్రహ్మ త్వమేవ విష్ణు త్వమేవ శంకర రూపా........ త్వమేవ దత్త స్వరూపా ......॥.ఆవో॥ త్వమేవరామ త్వమేవ కృష్ణ త్వమేవ షిరిడి సాయిబాబా...... త్వమేవ సత్య సాయి బాబా..... ॥ ఆవో ॥

14 March (14.03.) (74)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: పురాకృతసుకృతంవల్లను, దైవానుగ్రహంవల్లను ఉత్తమమగు గురువు సాంగత్యం లభిస్తుంది. అలాంటి గురువును అనుసరించడం పుణ్యాత్ములైన శిష్యుల కర్తవ్యం. Due to antique great works and Divine blessings, You will get the best companionship of the Guru. It is the duty for virtuous disciples to follow such a Guru. (14 Mar)   74) శ్రీకరా ! శ్రీ షిరిడీశ్వరా శ్రీకరా ! శ్రీ షిరిడీశ్వరా ప్రేమగ నను గావరా ! సాయిశ్వరా! ॥శ్రీకర ॥ గురుడవు నీవని, దైవము నీవని, గురువే దైవమని, సత్య ధర్మము సత్పథ మర్మము తెలుపగా వేడితిమి నీ నామామృత పానము చేయుచూ నీవే శరణమని పిలిచి పిలిచి నేను గొలిచి గొలిచి నేనలసిపోతిని రా దయను చూపి నీ దర్శనము నొసగి హృదయ మందిరము నందు నిలువరా! పలుకరించరా ! ॥ శ్రీకర॥ నిష్ట సబూరుల శిక్షణ నొసగగ ఇక్కట్టుల కలిగించితివో ! సుఖదుఃఖంబులలో సమభావము కలుగునటుల కరుణించితివా మోహము నెప్పుడు కూల్చెదవో మోదమునెప్పుడూ కూర్చెదవో ఎటుల నీ దరికి చేర్చెదవో ఎప్పుడు నీలోన నిలుపెదవో నేనెరుగలేను రా శ్యామ సన్నుత సాయి ॥ శ్రీకర॥

13 March (13.03.) (73)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: మీ ప్రవర్తనను బట్టి నా ప్రతిస్పందన ఉంటుంది. My response will depend on your behavior. (13 Mar)   73)  ప్రేమ ముదిత మనసె కహో సాయిరామరాం ప్రేమ ముదిత మనసె కహో సాయిరామరాం  సాయి రామ రాం సాయి రామ రాం బాబా సాయి రామరామ్   పాపమిటే దుక్కకటే లేకె సాయినాం  భవ సముద్ర సుఖ ధనావ ఏక్ సాయిరాం  పరమ శాంతి సుఖనిదాన మంత్ర సాయి నామ్  నిరాధార కోవధార ఏక్ సాయి నామ్   పరమ గోపయ పరమ దివ్య మంత్ర సాయి నామ్  సంతహృదయ సదా వసతు ఏక్ సాయి నామ్  మాతా పితా బంధు సఖ సబ్ కి సాయి నామ్  భక్తజనర జీవన ధన ఏక్ సాయి నామ్

12 March (12.03.) (72)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: నిద్ర లేచిన తర్వాత నాలుగు ప్రశ్నలు వేసుకోవాలి ఎందుకు లేచాను, ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఏ విషయం కోసం. After waking up, four questions to ask ourself . Why did I wake up, what to do, how to do, for what reason. (12 Mar)   72)  దయ చూపి ప్రేమతో దరి చేర్చుకోవా ! దయ చూపి ప్రేమతో దరి చేర్చుకోవా ! నీ పాదముల చెంత పడి ఉండనీవా!... చాలు నీ సంసారము సాయిరామా !.. ఆదరించగ రమ్ము ఆత్మాభిరామ !.. శ్రీరామ రఘురామ శృంగార రామా జయ రామ జయ రామ జానకి రామా...॥ దయ ॥ సంసారమును జేయ సకల వ్యామోహములు బంధించి బాధించి కృంగజేయుచునుండె ధర్మ మార్గములను తప్పించు చుండె దైవ భావములను దరి చేర్చకున్నాయి..॥ దయ॥ సకల విశ్వమునందు నీవున్న గాని చూడగలిగెడి శక్తి నాకు లేదయ్యా అవతార రూపమే ఆరాధనము చేసి అందుకో దలిచితినయ్యా నీ దీవెనలు ..॥దయ ॥ భక్తిశ్రద్ధల తెలియలేని మూర్ఖుడనయ్యా నిష్ట సబూరులను నిలుపుకోలేనయ్య పూజ చేయగలేని పరమ నీచుడనయ్యా ప్రతితుడను నీ పాల బడితి నేనయ్య నాకేమీ కావలెను నేనెరుగలేను నేనేమి చేయదునో తెలియలేను నీ పరము చేసుకొని నన్నేలుకోవా శ్యామచరణుని నీలో కలుపుకోలేవా..॥ దయ॥

11 March (11.03.) (71)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: ఇతర జీవులు మన జీవిత సంఘటనలకు కారకులని మనము భావించిన, ఆ భావనలు కోట్లాది జన్మలను (ఆగామి) తెచ్చిపెట్టును. If we think that other creatures are responsible for our life events, those feelings will bring billions of births. (11 Mar) 71) ఏ ప్రాంత మందున జనన మందితివో ఏ ప్రాంత మందున జనన మందితివో కులమేమో ? మతమేమో? నీదు పేరేమో? తెలియగ లేరయ్యా ! రూప గుణ రహితా రామ శివ మారుతి దత్త గురు సాయి... పత్రి గ్రామము నందు జనన మందితి వంట జమునా భాయ్ నందలాలు తనయుడవు నీవంట బాల్యమునందే ఒక ముస్లిం ఫకీరు కడ ప్రేమ వాత్సల్యముల పొంది పెరిగితివంట... నీదు సంకల్పమున వేంకుసా గురుజేరి శుశ్రోషలను చేసి కర్తవ్య మెరిగి గురుని ఆజ్ఞల బొంది గోదావరిని చేరి ఆ చెంతనే నున్న షిరిడీ చేరితివంట....॥ ఏ ప్రాంత॥ బాధితుల నందరిని బాగుపరిచితివంట సద్భక్తులకు ముక్తి పథము నిచ్చితివంట నమ్మి నిను జేరడి భక్తులందరగాచి నిన్నే కొలుచు శ్యామచరణుని గాచి రక్షించి బ్రోచుచు నిలిచి ఉన్నావంట ॥ఏ ప్రాంత॥

10 March (10.03.) (70)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: మనము మనశ్శాంతిగా ఉండాలి అంటే ఎదుటివారి తప్పులు, చెడు, లోపాలు చూడకుండా ఉండాలి If we want to have peace of mind, we should not see the mistakes, badness and defects of others. (10 Mar)   70) సాయి నన్ను బ్రోవ భారమా సాయి నన్ను బ్రోవ భారమా రామ సాయి నన్ను బ్రోవ భారమా శివ సాయి నన్ను బ్రోవ భారమా కృష్ణ సాయి నన్ను బ్రోవ భారమా శ్యామ సాయి నన్ను బ్రోవ భారమా //సాయి// మంచి చెడుగులను భేదము మది నెంచక యుండుట నా నేరమా సాయిరామ నన్ను బ్రోవ భారమా... కామ క్రోధాదుల తోడను... కలహించి జీవించుట నా నేరమా... ॥సాయి॥ దానధర్మంబుల జేయక నీచ స్వార్థంబు నడతలు నా నేరమా... ॥సాయి ॥ ఈర్ష్య అసూయలతోడను భక్తులందరినీ దూరట నేరమా...॥ సాయి॥ తప్పులన్నీ తెలిసి కృంగుచు నీకు చెప్పుకొనుటయే నేరమా ...॥సాయి॥ మెప్పుదనముగా నే పొంగుచు నా గొప్పదనము గోర నేరమా...॥ సాయి॥ చేయరాని పనులు చేసితి, మరి వినగరాని మాటలాడితి నని ..॥సాయి ॥ శ్యామచరణుని నన్ను దూరము చేయకుమని వేడుకొందును నిన్ను దైవమా ..॥సాయి॥

9 March (09.03.) (69)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: (9 Mar) ప్రతికూల ఆలోచనలు వస్తే రెండు అక్షరములు నామము మనసులో గట్టిగా చెప్పుకోవాలి. ఉదాహరణకు రామ రామ. If you get negative thoughts, recite two letters name (Telugu) loudly in your mind. For example Rama Rama (రామ).  69) సాయి నామ మను మధురామృతము సాయి నామమను మధురామృతమును గోలగ రండి జనులారా......... శాంతి సౌఖ్యముల నందు కొనుచు ఆనందము నందుడు జనులారా..... ॥ శ్రీ సాయి॥ దైహిక బాధల దాడి ఐరుంగని స్థితిని చేరుడోజనులారా లౌకిక వాంఛలను తప్పుకొని స్థిరత్వమెందుడు జనులారా స్థిరతను బొందుడు జనులారా॥ శ్రీ సాయి॥ కాంతా కనకపు కామమోహముల వలలో బడకుడు జనులారా శాంతి కొరకు శ్రీనాధుని మదిలో చింతన చేయుడు జనులారా.... సాయి॥ ప్రగాఢమగు విశ్వాసము నోర్పుల గలిగి యుండుడో జనులారా బహు దుర్లభమగు ముక్తి పదమును శ్యామచరణుని సూక్తులను ఆసక్తిగా వినుడోజనులారా (ముందుగా దెలియుడు జనులారా) (బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే) రాగం)

8 March (08.03) (68)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: మనస్సు, శరీరము, ఇంద్రియములు నిరంతరం భగవంతుని తలుచుకోవాలి. The Heart, Body, Senses constantly must think of God. (8 Mar)     68) అత్రి నందన అనసూయత్మజ అత్రి నందన అనసూయత్మజ శ్రీ గురుదేవా దత్త గురూ... దత్త గురు దత్త గురు దత్త గురు దత్త గురు అవధూత నిరాకారి దత్త గురు త్రిభువనాధ కేళి... త్రిమూర్తి రూపా త్రిగుణాతీతా దత్తాత్రేయ గురు దేవా ..... అవధూత నిరాకారీ దత్త గురు త్రిభువనాధ కేళి .....  దిగంబరా దిగంబరా దిగంబరా దిగంబరా.... శ్రీపాద వల్లభా దిగంబరా దిగంబరా.... దిగంబరా దిగంబర దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా దిగంబరా

7 March (07.03.) (67)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: బాధలో కానీ, ఆనందంలో కానీ శరీరము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న నూ హృదయపూర్వకముగా భగవంతుని ప్రార్థించవలెను. Whether in sorrow or in happiness or in any circumstance of the body, wholeheartedly we should pray to God. (7 Mar)   67) రమణ రమణ భగవాన్ రమణ రమణ భగవాన్ రమణ రమణ రమణ రమణ రమణా యనరే॥    మరణ మనిన చింతించే మనసును గనరే మాయ మనసును గనరే మన మనసును గనరే॥  భగవాన్ రమణ రమణ రమణ రమణ రమణా యనరే ॥ నేనెవరని పరికించెడి మార్గము గనరే దివ్య మార్గము గనరే రమణ మార్గము గనరే సులభ మార్గము గనరే  సాయి మార్గము గనరే ॥  నేను నీవు నశించెడి భావము గనరే  సద్భావము గనరే  సాయి భావము గనరే  రమణ భావము గనరే  రమణ రమణ రమణ రమణ రమణాయనరే ॥  ప్రారబ్దము నడిపించెడి తీరును గనరే  లోకతీరును గనరే  లోకేశ్వరు సేవించడి పదమును గనరే  దివ్య పదమును గనరే  రమణ రమణ భగవాన్ రమణ రమణ భగవాన్ రమణ రమణ రమణ రమణ రమణాయనరే ॥    అరిషడ్వర్గములు వర్గములు జేయు వింతలు గనరే వింత వింతలు గనరే  వింతల నశింపజేయు చరణము గనరే  రమణ చరణము గనరే...